Thursday, April 21, 2011
బాగున్నావా అని అడగలేనంత విరోదులమా మనం...?
బాగున్నావా అని అడగలేనంత విరోదులమా మనం...?
వేలసార్లు అనుకున్నా ...కాని సమాదానం దొరకలేదు..
నిమిషాలు,గంటలు లెక్కలేకుండా మాట్లాడుకున్న మనం ఎందుకిలా ..ఎన్నాల్లిలా..?
ఒకప్పుడు భాదపడతానని ఫీల్ అయ్యేదానివి...అన్నీ తెల్సి మౌనంగా ..
ఒక్కోసారి అనిపిస్తుంది....నిన్ను ఎప్పుడు చూశాను అదే ఆఖరి చూపేమో అని..
అప్పుడు నీవు చూడాలనుకున్నా ..మాట్లాడాలనుకున్నా....?
శాశ్వతంగా మూగ బోయిన ప్రాణం..శాశ్వతంగా మూగ బోయిన నా గొంతు..
మాటలు వినాలనుకున్నా పలుకని నాగొంతు...ఎప్పటికి కనిపించని నేను..
అలా జరిగితే నీకే మనిపిస్తుంది...ఈ మాట చెప్పటానికి భాదగా ఉంది మరి నీకు..
ఎందుకో కొన్ని కొన్ని ఆలోచనలు ఈ మద్యి..చాలా భాదపెడుతున్నాయి..
ఒకప్పుడు ఏమైనా చెయగలను అనిపించేది మరి ఇప్పుడు...
నీ విషయంలో ఎందుకిలా మారిపోయానో అర్దంకావడలేదు ..
ఒక్కోసారి అనిపిస్తుంది షడన్ గా నేను ఊహించింది జరిగీ నేను నీకు ఎప్పటికీ కనిపించలేనంత దూరంగా పోతే...?
Labels:
కవితలు