Wednesday, April 20, 2011
కరిగి కన్నీటి వానగా మారి పోతే బాగుండు కదా...?
ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను అనిపిస్తుంది
ఆకాలమే అయినా మనసులో అందోళన అలా అనిపిస్తుంది
ఇవ్వాళ భోరున వాన కురిస్తే బావుణ్ను
మనసు నిండా అలుముకున్న ముసురు
నీ ఆలోచనల్లా మదినిండా..కమ్ముకున్నాయి
కరిగి కన్నీటి వానగా మారి పోతే బాగుండు కదా...?
నీ కోసం గుండెలో దిగులు గూడు కట్టుకున్నా
ఇంత నిర్లిప్తత ఎందుకో ? నీవు దూరం అయ్యావనే కదా..?
ఇప్పటి దాకా కమ్ముకున్న మబ్బులు
ఒక్క టొక్కటిగా విడి పోతాయా..?
ఒక్కో నయనం నుండి చినులా జాలు వారదా
జడి వాన కురవదా ?
కమ్ము మనమద్యి ముసుర్లు తొలగవా?
అపార్థాలు తొలగి పోవా?
మనసులు తేలిక పడవా?
కుండ పోతగా కురిసి
ఈ ముసురు వీడి పోతే బావుణ్ను
హరివిల్లు విరిచి నట్టు మనం ఎప్పటిలా ఉండాలేమా..?
Labels:
కవితలు