![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOOdSqXDOsFh9wpF7xLukpi8CSprsTvD3jTmCFxFKXwmAEXoQh6RJdethmceWQ65fcrSmu9By0LgsvBWV7_vILWSDHszXUPGZrozCp52bDWPNsnCNLYZTGohMUXTDG96Y5G-ySFeO8o_A/s320/51-broken-heart.jpg)
నీ జ్ఞాపకాలు ..పదునైన కత్తుల్లా గుండెల్లో గుచ్చు కుంటున్నాయి..
నిజమే గంతంతాలూకా నీ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు చెప్పలేని భాద..
నీ గుర్తులు ఎక్కడ ఉన్నావంటూ నన్ను ప్రతిక్షనం వెక్కిరిస్తున్నాయి నీ వెక్కడ అంటూ..
మనం కల్సిన మొదటి క్షనం నుంచి ఇప్పటిదాకా ప్రతిజ్ఞాపకం పదిలంగా ఉంది..
నీ ప్రతి జ్ఞాపకం పదునైన కత్తుల్లా గుండెల్లో దిగబడ్డాయి..రక్తం ఏరులైపారుతోంది..
ప్రాణం విలవిల లాడుతోంది ఏక్షనం అయినా ,ఏ నిమిషం అయినా ప్రాణం పోవచ్చు
ఒక్కోసారి అనిపిస్తుంది నీవు నాతో ఎందుకు మాట్లాడవని ..నాకు ఆర్హత లేదేమో కదా..
నిజమే ఎందుకు మాట్లాడాలి ఇప్పుడున్న నీస్నేహితుల ....?నేను వేష్టుగాడిని కదా..
ఇప్పుడు నీవు మాట్లాడే స్నేహితుల్లో ...నేనే వేష్టుగాడిని కాబట్టే నాతో మాట్లాడటం లేదు కదా..
పాతజ్ఞాపకాలు ఇప్పటికే గుండెళ్ళో పెద్ద పెద్ద గాయాలు చేశాయి బ్రతికే అవకాశం లేనంతగా..
వాడిపోయిన చెత్తకాగితం లాంటి నా లాంటి స్నేహితులు నీకెందుకులే కదా అనిపిస్తుంది నాకెప్పుడూ..
ఎందుకో ఈమద్యి జ్ఞాపకాల తాలూకా భాద ఎక్కువైంది..అయినా ఏమి చేయగలను భాదపడటం తప్ప..
పాత జ్ఞాపకాలు రంపపు కోతల్లా గుండేను ప్రతిక్షనం నిలువునా కోస్తున్నాయి నీ వెక్కడంటూ..
అప్పటినుంచి ఇప్పటివరకు అన్నీ మదుర జ్ఞాపకాలే..అయినా ఎందుకో అవి భాదిస్తున్నాయి..
అన్ని జ్ఞాపకాలు నీ వెవరంటూ వెక్కిరిస్తున్నాయి..నీగురించి ఆలోచించే అర్హ్జత లేదంటూ వార్నింగ్ ఇస్తున్నాయి..