Monday, April 25, 2011
ప్రతి క్షనం నీతలపులతో ...నీ ద్యాసతో గడుపుతున్నా..
చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పు
మృత్యువునైనా ఆహ్వానిస్తా
మౌనాన్ని వదలిపెట్టి నా పేరును స్మరిస్తావా... చెప్పు
ఈ క్షణమే నన్ను నేను దహించుకుంటా
ప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... చెప్పు
ఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తా
నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా... చెప్పు
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.
ప్రతి క్షనం నీతలపులతో ...నీ ద్యాసతో గడుపుతున్నా..
ఎప్పుడొకప్పుడు వస్తావని ..చిరునవ్వులు చిందిస్తూ పలుకరిస్తావని..
నీ ద్యాసలోనే గడుపుతున్నా....నీవే ప్రాణంగా బ్రతుకుతున్నా..
ప్రాణం ఆగిపోతానంటుంది..నిలువనంటూ మారాం చేస్తోంది..
నే మనిషిని పూర్తిగా మారిపోయా...మనిషిగా ఓడిపోయా...
బ్రతుకుతానన్న నమ్మకం పోయింది..చావు ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తున్నా
Labels:
కవితలు