. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, April 5, 2011

నిశ్శబ్దంగా నదిలో వురిపోసుకున్న చీకటి రాత్రులు




చీకటి తెరలు తొలగిపోయే వేళ
వెలుగు రేకలు విచ్చుకునే వేళ
కూలిన విశ్వాసాలు చిగురించే చోట
ఆగ్రహ నయనాలు చెమ్మగిల్లే చోట
మళ్ళీ మనం కలుసుకుంటామా?

వాన చినుకు కత్తిదూసిన మేఘాలు
మేఘాల చితిమంటలై ఎగసే ఆకాశం
జ్ఞాపకాల చినుకులు తగలబడే కమురు వాసన

నిన్నటి నినాదం మూగవోయిన చోట
నేడు దహించే మౌనం ప్రతిధ్వనించే చోట
నిన్నటి మౌనపు పదఘట్టనల్ని ధిక్కరించే వేళ
రేపటి నినాదాలు రెపరెపలాడే వేళ
మళ్ళీ మనం కలుసుకుంటామా?

నిశ్శబ్దంగా నదిలో వురిపోసుకున్న చీకటి రాత్రులు
ఒంటరి రాత్రుల శవయాత్రలో
మౌనంగా ప్రవహించే సజల నేత్రాలు
పగబట్టి పరిహసించే చరిత్రల పురాస్మృతులు

ముళ్ళకంచెలు తెగిపోయే వేళ
చెలిమి చేతులుచాచి కరచాలనం చేసే వేళ
తెగినవీణ తంతృలు శ్రుతి చేసే చోట
పాటల నదిపై వెన్నెల మెరిసే చోట
మళ్ళీ మనం కలుసుకుంటామా?

- సుధా కిరణ్