Sunday, April 24, 2011
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు
మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు
నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు
ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు
మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు
వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు
సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు
ఇవన్నీ నామదిని తొలచివేస్తున్న ఆలోచనలే..
నిజంలా నిద్దుర లేకుండా చేస్తున్న పరిస్థితులు.
అన్నీ ఊరిస్తున్న ఊహలే వాస్తవదూరాలు..
కాదనుకున్నా కటినమైన వాస్తవాలు..
నిజంలాంటి నిజాలు కాకపోయినా..
ఊహల్లో ఊరిస్తున్న వాస్తవాలు ప్రియా
Labels:
కవితలు