Sunday, April 10, 2011
వెన్నెల సంతకం చెదిరిపోయింది..?
వెన్నెల సంతకం చెదిరిపోయింది..?
మనసులో భావాలు మదిని తొలుస్తున్నవేళ..
చల్లని అమ్రుత హస్తం చేయందిచ్చిన వేళ..
హాయిగా ప్రశాంతంగా గడుస్తున్న రోజులు..
నేను ప్రంపంచంలో అద్రుష్టవంతున్ని అనుకుంటున్న వేళ..
అప్పుడే అనిపించేది మేమూ దూరం అయితే అని..?
ఎవ్వరో వచ్చి ఇద్దరిని విడదీసినట్టు..
మళ్ళీ మామనసులు కలువలేనంతగా విడిపోయినట్టు ..
అనిపించి నిదురలో ఉలిక్కి పడి లేచే వాన్ని..
ఇంక అస్సలు నిద్దుర పట్టేది కాదు..
ఎక్కడ దూరం అవుతుందో నని ఎన్నో నిదుర లేని రాత్రులు గడిపా..
ఎవైతే జరుగ కూడదు అనుకుంటున్నానో అవేజరిగాయి.
వరుసగా జరుగుతున్న ఘటనలు..అర్దంకాని పరిస్థితి..
జరకూడదని భయపడిన సంఘటనలే వరుసగా జరిగాయి..
నోట మాటరాక మౌనంగా ఉన్నాను ఎంచేయాలో తెలీక..
అలా ఓ చల్లని వెన్నెల నాకు దూరం అయింది..
మళ్ళీ దగ్గరగా చేరుకోలేనంత దూరం అయింది..
వెన్నెల సంతకం చెదిరిపోయింది..
ఆశ చావక పోయినా నిరాశగా ఎదురు చూస్తున్నా మౌనంగా..