Tuesday, April 19, 2011
బెంగగా నాలో నేనే ముడుచుకుని పడుకుని ఉన్నాను
ఇంత ఎందుకు ఉంటున్నానో ఈ మద్యి అర్దకావడం లేదు
ఒక్క నీ విషయంలో మాత్రమే ఇలా జరుగుతోంది ఎందుకో
చేయని తప్పులకు భాద్యున్ని చేస్తున్నారు అకారణంగా
నీ ఎదురుగా కోందరు నన్ను తప్పుడు వానిగా చేస్తున్నారు.
ఏం జరుగుతుందో అర్దంకావడంలేదుకొంచెం కూడా ధైర్యం రావడంలేదు
బెంగగా నాలో నేనే ముడుచుకుని పడుకుని ఉంటున్నాను
ఈ భూప్రపంచం మీద నాకెవరూ లేరంటూ
నా కన్నా ఒంటరి ఇక ఎవరున్నారంటూ?
పిచ్చి పిచ్చి ఆలోచనలతో నేను ఆందోళనలో ఉన్నాను
నేనో చిన్న ఓదార్పు కోసం చూస్తున్నా అది ఎవరోకాదు
అటువంటప్పుడు సొంత వాళ్లో, పరాయివాళ్లో కాదు
ఎవరోకాదు అది నీకూ మాత్రమే సాధ్యి ప్రియా
ఒక్క దయగల నీ చూపు చాలు నాకు
సర్వ భయాలనించీ సదా విముక్తిడినయిపోతాను
ఇక పాత జ్ఞాపకాల రైలుబండి
పట్టాలమీద మళ్లీ వచ్చి నిలబడుతుంది
లక్షల వేల కోట్ల అసంఖ్యాక బంధాలలో
నీ చిరునవ్వుతో కూడిన ఒక్క చిన్న పలుకు చాలు
ప్రేమ నిండిన నీ ఒక్క స్పర్శ చాలు
ఇక ఆగిపోయిన బతుకు నావ
కాలం వాటుగా సాగిపోతుంది
అటక మీద తుప్పుపట్టి పడున్న
ఇనప్పెట్టె లాంటి నా మది
స్వర్గలోకపు దారుల్లోకి
ఇక వడివడిగా తెరుచుకుంటుంది
అది ఎవ్వరో తెలుసా నీవే అది నీకు మాత్రమే సాద్యిం..
Labels:
కవితలు