Saturday, April 16, 2011
ఇద్దరి స్నేహితుల మద్యి...మౌనం పెద్ద నరకం
ఇద్దరి స్నేహితుల మద్యి...మౌనం పెద్ద నరకం..
అసలు ఇద్దరు ఎందుకు కలుస్తారు.. ఎందుకు స్నేహితులవుతారు..
ఒకరికొకరుగా..ఎంతో ఇష్టంగా ఒకరికి ఒకరు కష్టపెట్టకుండా ఉండి ఎలా మారతారు..
అంతలా ఇష్టపడ్డ రెండు మనసులు దూరం అయితే వారి మద్యి రాక్షసిలా చెరుతోంది మౌనం ..
ఆ ఇద్దరి మద్యి మౌనం...రెండు హ్రుదయాల్ని ఎంతగా గాయపరుస్తుందో కదా..?
ప్రపంచంలో ఆ స్నేహితులకు చెప్పుకోలేని నరకం అంటే ఇద్దరి మద్యి మౌనమేకదా...?
ఎందుకు వీరిద్దరి మద్యా మౌనం చేరుతుందోకాని..ప్రతినిమిషం వారిని చంపేస్తుంది...
అంతగా వారికి వేదిస్తున్న మౌనం కన్నా పెద్దనరకం ఇంకోటి ఉండదు మరి
ఒకేసారి ప్రాణం పోయినా బాగుంటుంది కాని ఇద్దరి మద్యి మౌనాన్ని భరించలేరు..
ఇద్దరూ ఒకరికొకరు అనుకుంటారు మామద్యి ఏర్పడ్డ అఘాదన్ని ఎవరైనా వచ్చి తీర్చకుడదూ అని..
ఇద్దరిని విడదీయటనికి ఏంత శ్రమపడతారో...ఎన్నో చెప్పి విడదీస్తారు..వారేంసాదిస్తారో తెలీదు..
నిజంగా ఒకప్పుడూ అన్నీ షేర్ చేసుకుని ప్రతినిమిషం మాట్లాడుకునే స్నేహితులకు మౌనం ఓ శాపం..
మౌనం మనిషిలోని మనస్సును దారుణంగా చంపేస్తుంది...బ్రతికించలేనంతగా..
నేనున్నానంటూ దైర్యించెప్పిన మనిషి మౌనంగా ఉంటే చెప్పలేని భాద
ఇద్దరి మద్యి మౌనానికి సరైన శిక్ష మరణమే..ఎందుకంటే..?
మరణం మనిషిని ఒక్కసారే చంపేస్తుంది...కాని మౌనం ఇద్దరి స్నేహితుల్ని ప్రతిక్షనం చంపేస్తుంది దారుణంగా
Labels:
కవితలు