Sunday, April 3, 2011
నీ జ్ఞాపకం చచ్చేదాక చావనీదు ...ప్రశాతంగా ఉండనీయదు
మనసులో నీ ఆలోచనలు దాటి నన్ను పొనీదు
నన్ను గెలవనీదు ....ఓడనీదు ఎందుకో
చచ్చేదాక చావనీదు ...ప్రశాతంగా ఉండనీయదు
కలిసి రాని కాలం నాతో కలిసి నడుస్తుంటే
కలవలేని కలల తీరాన్ని కంటిపాప నీకోసం కలవరిస్తొంది
చిత్రంగా లేదు ....? ఇలా నాకు మాత్రమే ఎందుకు జరుగుతోందో కదా..?
నా రేపటిని నేటిగా నాకిచ్చిన ఈ నిమిషాన్ని..నీవెందుకు తీసుకెళ్ళావు
నిన్నటి తిమిరానికి తిరిగిఇవ్వలేవు..
అలా అని నా కాళ్ళ కింద నలుగుతున్న ఈ నేటిని
అలానే అదిమివుంచనూ లేను
అందుకే నీరు కారుతున్న ఈ నిమిషాలను బొట్టు బొట్టుగా పోగేసి
నాకంటి పాప కొలనులొ స్వప్న సౌధాలు నిర్మించుకుంటున్న..
ఆ స్వప్నంతిరిగి రాదని తెల్సినా..ఆస్వప్నమే జీవితంగా బ్రతుకుతున్నా
నీ మీది ఆశతో ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు ...ఎప్పుడు నాకు ఏమౌతుందో తెలీదు
నిన్న నాకొక జ్ఞాపకం..నేడు నీ జ్ఞాపకాలు నాకొక వ్యాపకం
రేపన్నది ఎప్పుడూ ఓ ప్రశ్నే...జ్ఞాపకాల వ్యాపకంలో రేపటి ప్రశ్న
నేడు అన్నది నాకు సవాలు కావచ్చు..రేపు ఎప్పుడైనా నేను సమాధి కావచ్చు