Tuesday, April 12, 2011
నేనేం చెప్పలేనిక..జరిగేది చూడు నీవిక
నేనేం చెప్పలేనిక..జరిగేది చూడు నీవిక
చెప్పటానికి నా భాషకు భావం దూరం అయింది
ఇక చెప్పే దేమిలేదు..జరిగేది చూడు
ఎప్పుడు ,ఎక్కడ అని అడక్కు ..
ఎప్పుడైనా ,ఎక్కడైనా , ఏనిమిషమైనా జరగొచ్చు..
ఇక అన్నిటీకీ మౌనమే సమాదానం ఎప్పటికీ..
ఊపిరి ఆగే వరకు మాత్రం నీ ఆలోచనలు ఆగవు ఆవిషయం నీకు తెల్సు..
తెల్సుకోవాలని ప్రయత్నించకు ..?..ఉపయోగం ఉండదు
తెల్సుకోని నీవు చేసేది ఏముందిక.. అంతా అయిపోయింది..
ఒక మనిషిమీద ఇష్టం ఇంత దారుణంగా ఉంటుందని తెలీదు అప్పుడు..
ఆవిషయం తెల్సుకునేసరికి ... అంతా అయిపోయింది..
నాకు ఇష్టపడటమే తెల్సు ఎప్పుడూ కష్టపెట్టాలనుకోను..
నీ ఆనందంకోసం ,ఏన్నో కష్టాలు పడ్డాను ఇంకా పడతాను కూడా..
ఎందుకూ అని ప్రశ్నించకు ..అది నా మనస్సుకు సంబందించిన ప్రశ్న..
మనిషిగా ఎదుటివారికి ఇచ్చిన విలువకూడా నాకు లేదు..
అందుకే వెలుతున్నా..ఎప్పటికీ కానరానంత దూరంగా..
ఇప్పుడు నాకు "వేదనా , రోదనే " నీవు నా కిచ్చిన బహుమతులు..
ఇలాంటి అద్బుతమైన గిఫ్ట్ లు ఎన్నోఇచ్చావు ఈ జీవితానికి ఇక నాకుఇవి చాలు.. GUD BYEE
Labels:
కవితలు