Thursday, April 14, 2011
ఒక ఆశ నిరాశై నన్ను వెక్కిరిస్తున్న...వేళ..
ఒక ఆశ నిరాసై నన్ను వెక్కిరిస్తున్న...వేళ ..నాకు నేనుగా ఘోరంకా ఓడీపోయిన వేల
ఒకప్పుడు నేనున్నానంటూ దైర్యం చెప్పిన స్నేహం దూరమై ఈరోజుకు 220 రోజులు..
నెలలు రోజులు క్షనాల్లా గడుస్తున్నాయి.. భారంగా
ఎందుకిలా జరిగిందో తెలియదు..జరుగుతుందో తెలియదు..
ఒక్కోసారి పెద్దగా అరవాలనిపిస్తుంది నీదగ్గరకు వచ్చి నన్నెందుకిలా చేశావు అని..
మళ్ళీ అనిపిస్తుంది అర్హతలేదు నాకు నిన్ను అడిగేందుకు అని నిజమేకదా ..
అవును నాకో విషయం తెలీదు..నేను ఓడిపోయానా ఓడించావా..?
ఏముంది ఓడించినా ..ఓడీపోయినా ఘోరంగా బలైంది నేనేగా..
కాని ఒక్కటిమాత్రం గుర్తుంచుకో..నేను ఎన్ని సార్లు అయినా ఓడిపోతా..
నీవు మాత్రం ఎప్పుడూ గెలవాలి..ఓటమి నీదరిదాపులకు రాకూడదు.
అందుకే ఈమద్యి నాకనిపిస్తుంది ..నీకు విజయం శాశ్వితం కావాలంటే..
నేను శాశ్వతంగా ఈ లోకంనుంచి పోవాలి అదే నీ గొప్పవిజయం కదా..?
అప్పుడు నీవు ఇంకా ఆనందంగా ఉంటావా..పెదాలపై చిరునవ్వు చెరగకుండా ఉంటుందా..?..
నీ చిరునవ్వంటే నాకు ప్రాణం ఆనవ్వు కోసం ఏమైనా చేస్తాను..ప్రాణమైనా ఇస్తాను ..
Labels:
కవితలు