Thursday, April 14, 2011
అన్నీ నీవే అనుకున్న నేను ప్రపంచాన్ని పూర్తిగా మరిచాను
ఎప్పుడొచ్చావు నా గుండెలోకి... చప్పుడైనా చేయకుండా...
ఏమి చెప్పావు నా మనసుకి... నాకేమాత్రం తెలియకుండా...
ఏ మంత్రం వేశావు నామదికి... నీవు తప్ప మరో ఆలోచన లేకుండా...
ఏ మాయ చేశావు నాలోని తలపులకి... నిత్యం నీ ధ్యాసే తప్ప మరేదీ రాకుండా...
అన్నీ నువ్వు చేస్తావు..కానీ నా మాట మాత్రం పట్టించుకోనంటావు...
ప్రేమంటే తెలుసానీకు... కానీ నీతోటి ప్రేముంటేనే జీవితం నాకు...
గూండెల్లో చేరావు..అలజడి స్ర్తుష్టించావు ఆందోళన్ రేకెత్తంచావు..
అన్నీ నీవే అనుకున్న నేను ప్రపంచాన్ని పూర్తిగా మరిచాను ..
నీవు నాతో ఉన్నప్పుడు ఏప్పుడూ నాకు నేను అనుకునే వాడిని ..
ప్రపంచంలో కేల్లా నేనొక్కడినే అద్రుష్టవంతుడిని నేనే అని..
అప్పుడనిపించేది ప్రపంచం అంత చిన్నగా ఉండేదా అని..
ప్రతిక్షనం ప్రతినిమిషం అప్పుడూ ఇప్పుడూ నీ ఆలోచనలే...
నీ పలుకే విననంత దూరంగా నేను బద్దశత్రువుల్లా దూరంగా ఎందుకో..
ఈ విషయాన్ని ఎప్పూడూ ఊహించలేదు..కాని జరిగిపోయింది..
అప్పుడు అనుకున్నది తప్పు ప్రపంచంలో కెళ్ళా దురద్రుష్టవంతున్ని అని..
ఇప్పుడు నీతో మాట్లాడే వాల్లే అలాంటి అద్రుష్టవంతులని నెనెప్పటీకీ కాదని..
నీకు తెలుసా నాలో నేను లేను పూర్తిగా మారిపోయాను..
నీవు గుర్తుపట్ట్లేనంతగా...ఉన్నాను చూసి ఎవరూ అంటావు అలావున్నాను..
ఇక కొద్దిరోజులే మిగిలి ఉంది..నీవు కనిపిస్తావనే ఆశ చచ్చిపోయింది..
నా ప్రయాణం చివరి మజిలీలో ఉంది..అనినీకూ తెల్సు కాని...?
Labels:
కవితలు