. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, April 24, 2011

ఏమని చెప్పను....?..సమాదానం చెప్పే పరిస్థితుల్లోలేను..






ఎన్నో చెప్పాలని అధరం మొదలు పెడుతోంది కాని ఏదీ చెప్పలేను....
మది భారాన్ని దించాలని ఉన్నా కన్నీటితో బరువెక్కిన మది కదలనంటుంటే ఏమి చేయగలను....?

ఎక్కడ ఉంటున్నావని అడిగితే ఎమని చెప్పను....?
నువ్వు లేని తీరంలో నవ్వుకు దూరంగా ఉంటున్నానని చెప్పనా ? చెప్పి నిన్ను బాధించలేను....

ఎలా ఉన్నావని అడిగితే ఎలా చెప్పను....?
ఆవేదన అంచుల్లో ఆరాటాన్ని చంపుకొని సుఖంగా ఉన్నానని చెప్పనా ? చెప్పి నిన్ను నొప్పించలేను....

ఏమి చేస్తున్నావని అడిగితే ఏమని చెప్పను....?
ఉదయ సంధ్యా రాగంలో హృదయ ఆర్తనాదాన్ని వింటూ బ్రతికేస్తున్నానని చెప్పనా ? ....

వేళకి తింటున్నావా అంటే, ....
కన్నీటి ప్రవాహాన్ని సేవిస్తూ నీ జ్ఞాపకాల ఆహారాన్ని అనుక్షణం నెమరువేసుకుంటూ తింటున్నాను....

కమ్మని కలలు కంటున్నావా అంటే, కంటున్నాను....
ముక్కలైన మనసు ఒక్కటైనట్టు, దిక్కుతోచని ప్రేమ దగ్గరైనట్టు పిచ్చిగా పగటి కలలు కంటున్నాను....

నా ప్రశ్నలకు సమాధానం చెప్పవా అంటే, ....
దరికి రాని నిన్ను తలచుకుకుంటూ దూరమైనా ఆనందాన్ని వర్ణిస్తూ నీకు సమాధానాలు చెప్పలేను....

నాతో ఎప్పటికీ మాట్లాడవా అంటే, ....
మాటలు రాని మౌనంతొ మూగబోయిన గాత్రాన్ని ఆత్రంగా నిద్దుర లేపి నీతో ఎప్పటికీ మాట్లాడలేను....

ఎప్పటికీ ఇలా ఒంటరిగానే ఉంటావా అంటే, ఉంటాను....
నువ్వు పంచిన ప్రేమ అంతరించే వరకు, నిన్ను వలచిన హృదయం అస్తమించే వరకు ఇలానే ఉంటాను ....

నన్ను క్షమించి మరచిపోలేవా అంటే, మరిచిపోలేను....
నువ్వు చూసే చూపుని.. నవ్వే నవ్వుని..నీ అలకని.. నిన్ను.. నీ ప్రేమని మరచిపోలేను....

నిన్ను క్షమించడానికి ఎవర్ని నేను ? నీకు ఏమి కాను....
నీ మనసు చంపుకొని మనువు చేసుకున్నావు, తనువు పంచుకున్నావు.. నువ్వే నేను, నీకు ఏమి కాను....

నిన్ను కోరుకున్న నేను ఆ దైవాన్ని కోరుకుంటున్నాను....
నా ప్రేమ నిజమే అయితే, నువ్వు ఎక్కడున్నా.. ఎవరి పక్కనున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను....

నిన్ను వీడలేని నేను ఈ కాలాన్ని వేడుకుంటున్నాను....
ఎలాంటి సందర్భంలోనూ నిన్ను చూపవద్దని, ఎంత చేరాలనుకున్నా నీ జాడ చెప్పవద్దని వేడుకుంటున్నాను....

నువ్వు నా దానవు కావు, నేను నీ వాడను కాను....
కోటి ఆశల కలల సౌధం కుప్పకులిపోయాక, నీటి రాతలు ఎండమావులయ్యాక నీ ప్రశ్నలకు సమాధానాలను....

ఏమని చెప్పను....?..సమాదానం చెప్పే పరిస్థితుల్లోలేను..ఆ అర్హత నాకు లేదు..?