. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, April 27, 2011

మళ్ళీ తిరిగి రాకూడదనే పోతున్నా...?






స్వప్నమైనా ఆనందమే నువు కనిపిస్తానంటేనే...
చావైనా సంతోషమే నువు కరునిస్తానంటేనే...

గాయమైనా ఉత్సాహమే నువు దరికొస్తానంటే...
ఓటమైనా విజయమే నీ స్నేహం పంచిస్తానంటే...

చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...
గుచ్చుకునే ముళ్లైనా పూలదారులే నను నీవు ఆహ్వానిస్తానంటేనే...

కానీ... అమృతమైనా విషమే నువు నన్ను కాదంటానంటే...
స్వర్గ సుఖమైనా నాకు నరకమే నను నువ్వు ప్రేమించనంటే...

అందుకే చెలీ నా ప్రేమ రాజ్యంలో పట్టపురాణివై నను కరుణించు...
ఇన్నాళ్లుగా నీకోసం వేచి ఉన్న నా మదిలో సంతోషాన్ని రగిలించు ప్లీజ్..

ఇవన్నీ జరగవు అని తెల్సుకాని ...జరిగే అవకాశం అస్సలు లేదని కూడా తెల్సు..
కాని మనసు మాటవినదు గతాన్ని తవ్వి అలా ఎందుకు మళ్ళీ ఉండరు అని చెబుతోంది..
నాకెందుకో భాదగా ఉంది దూరం అవుతున్నా....కనిపించకుండా పోతున్నా అని..
అవును నీకు ఎదొ సమయంలో ఒక్కసారైనా గుర్తుకు వస్తానా....


మళ్ళీ తిరిగి రాకూడదనే పోతున్నా...మళ్ళీ రావడం అంటూ జరిగితే అది నీకోసం మాత్రమే..
నీ మౌనాన్ని నేను భరించలేకే ఈ నిర్నయం తీసుకున్నా అది నీకుతెల్సు కాని...?.

ఎదైనా దైర్యంగా చెప్పేనీవు ఇలా ఎందుకు మారావో అర్దంకాక పిచ్చెక్కుతోంది..
నీ మౌనం వెనుక కారనం ఎంత వెతికినా దొరకడంలేదు..కారణం ఎంటి..

మనం మనంగా పాతరోజులు రావని గుర్తుకు వస్తుంటే ఆ భాద తట్టుకోలేక పోతున్నా...
అందుకే వెలుతున్నా ..వస్తానో రానోతెలీదు..వచ్చే అవకాశం లేదు..ఎందుకో రావాలని లేదు..?

నీవే కాదు..కన్నీళ్ళు కూడా కారనం చెప్పనంటున్నాయి..




ప్రపంచం అంతా నిదుర పోయే నిశీది రాత్రి వేళ..
కోట్లాది గుండెలు ఏకమై ఆనందపు అంచులు చూస్తున్నరాత్రి వేళ
వేలాది హృదయాలు ఊసులాడుకుంటున్న రాత్రి వేళ
నేను మాత్రం ఒంటరిగా..నీ కోసం ఆలోచిస్తూ
లోకాన్ని సంచరిస్తుంటా..నీ ఊహలతో
నిజాన్ని ఎప్పుడో దాటిపోయాను...అంతా ఉహే అనితేలింది..
వాస్తం ఎప్పుడో..దారితప్పింది..మౌనమే మిగిలింది..
నీవే కాదు..కన్నీళ్ళు కూడా కారనం చెప్పనంటున్నాయి..
నీవు మాత్రం ఏమాత్రం ఆలోచనలు లేకున్నావా..
నేను గుర్తున్నాన్నా..గుర్తుకొస్తానాఅని అప్పుడప్పుడూ నవ్వుకుంటాను వేదనగా.
నేను నీవు గుర్తుకొస్తున్నప్రతిసారి కన్నీళ్ళతో సదానం చెప్పుకుంటున్నా నా మనస్సుకు..
మనస్సు ఎన్ని సార్ల నమ్ముతుంది అన్నీ నిజాలని...అదికుడా నన్ను నమ్మడం మానేసింది..
అందుకే మనుషులకు దూరంగా పోవాలని చూస్తున్నా..వెల్తున్నా ఈరోజే..
కాలం కావలనుకుంటే మళ్ళీ వస్తా లేదంటే ఇక నీవు చూడాలనుకున్నా కనిపించను..GUD BYEE

కన్నీళ్ళు చెప్పే నిజాలు

కన్నీళ్ళు చెప్పే నిజాలు

ప్లీజ్ నవ్వకండి ఇది నిజం..?

ఇప్పటికి ఎప్పటికి నేను చెప్పే నిజం..

Tuesday, April 26, 2011

నేను నమ్ముతున్ననిప్పులాంటి నిజం...?



నేను నమ్ముతున్ననిప్పులాంటి నిజం...

ఓబుల్ రెడ్డీ ..ఓడిపోయాడు




ఓబుల్ రెడ్డీ ..ఓడిపోయాడు..
గెలవలేనంత గా ఓడిపోయాడు...నీవూ ఓడించావు..
ప్రతిక్షనం నీవు గెలవటానికే ఓడిపోయాడు ఓబుల్ రెడ్డి..
నీవు పుట్టించిన కేరెక్టర్ ఓబుల్ రెడ్డి..
నీకోసం ప్రతి క్షనం ఆచిస్తాడు అని నీకు తెల్సు..
అయినా ఓబుల్ రెడ్డి అంటే నీకెందుకంత కోపం..?
నీకోసమే బ్రతికిన బ్రతుకుతున్న ఓబుల్ రెడ్డీ..
నీవంటే ఓబుల్ రెడ్డి కి ప్రాణం అని తెల్సు..
ప్రతిక్షనం నీతలపులతో నిన్నే తలచుకొంటూ కాలం గడుపుతున్న ఓబుల్ రెడ్డి..
నీకిష్టమైన వాళ్ళకోసం నీతో ఎన్నో మాటలనిపించుకున్న ఓబుల్ రెడ్డి..
నీవు వెతికినా కనిపించని లోకాలకు వెలుతున్న ఓబుల్ రెడ్డి..
ప్రతిక్షనం నీవు సంతోషంగా ఉండాలని కోరుకునే ఓబుల్ రెడ్డి..
నీవు పుట్టించిన క్యారెక్టర్ నీకిక కనిపించదు..నీవు చూడాలనుకున్నా ..?

- నీకు ఎప్పటికీ ఏమికాని " ఓబుల్ రెడ్డి "

ఎందుకిలా జరుగుతోంది..? నీవెందుకిలా మారావు




ఎందుకిలా జరుగుతోంది..? నీవెందుకిలా మారావు
అందరూ హేపీగా ఉండాలని కోరుకుంటావు...నేను తప్ప..?
ఎవ్వరి కైనా చిన్న ఇబ్బంది వచ్చినా నీ ఇబ్బంగా ఫీల్ అవుతావు.. నాకు తప్ప..
నీకు వారు ఎవ్వరో తెలియక పోయినా కష్టాల్లొ ఉన్నారంటే సహాయం చేయడానికు ముందుంటావు.
నేను భాద పడుతున్నను అని తెల్సినా మౌనంగా ఉంటావు..
నీకు ఇష్టమైన వాల్లు హేపీగా ఉండాటానికి నన్ను ఎన్నిమాటలైనా అంటావు..
నీకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉండటం నీకు కావాలి నేను ఎమైనా నీవాలోచించవు ఎందుకని..?
నీకోసం ప్రతిక్షనం ఆలో చిస్తాను అని తెల్సు కాని అన్నిటికి మౌనంగా ఉంటావు...
ఎవ్వరైనా చనిపోతాను అంటే చాలా భాదపడతావు ..నేనంటే .... ఉంటావు..
ఎవ్వరైనా నాగురించి చెడుగా చెబితె వెంటనే వింటావు ..నిజం అని నమ్ముతావు
నేను నిజం చెప్పాలని చూస్తే.." నన్నాఫ్ యువర్ బిజినెస్ " అంటూ సీరియస్ అవుతావు ఎందుకో..

Monday, April 25, 2011

ప్రతి క్షనం నీతలపులతో ...నీ ద్యాసతో గడుపుతున్నా..






చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పు
మృత్యువునైనా ఆహ్వానిస్తా

మౌనాన్ని వదలిపెట్టి నా పేరును స్మరిస్తావా... చెప్పు
ఈ క్షణమే నన్ను నేను దహించుకుంటా

ప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... చెప్పు
ఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తా

నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా... చెప్పు
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.

ప్రతి క్షనం నీతలపులతో ...నీ ద్యాసతో గడుపుతున్నా..
ఎప్పుడొకప్పుడు వస్తావని ..చిరునవ్వులు చిందిస్తూ పలుకరిస్తావని..

నీ ద్యాసలోనే గడుపుతున్నా....నీవే ప్రాణంగా బ్రతుకుతున్నా..
ప్రాణం ఆగిపోతానంటుంది..నిలువనంటూ మారాం చేస్తోంది..


నే మనిషిని పూర్తిగా మారిపోయా...మనిషిగా ఓడిపోయా...
బ్రతుకుతానన్న నమ్మకం పోయింది..చావు ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తున్నా

కోపంలో నీ కనులు కురిపించే 'నిప్పు'ల సాక్షిగా...నిన్ను ప్రేమిస్తున్నాను








సుఖదుఖాఃలలో నీ బుగ్గలపై జారే క'న్నీటి' సాక్షిగా...
'భూమి' అంత చల్లనైన నీ మనస్సు సాక్షిగా...
'ఆకాశం' అంత విశాలమైన నీ హృదయం సాక్షిగా...
నీ శ్వాసలో చేరే స్వచ్ఛమైన 'గాలి' సాక్షిగా...
కోపంలో నీ కనులు కురిపించే 'నిప్పు'ల సాక్షిగా...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను...!
ఇప్పుడే కాదు ఎప్పటికీ నాది ఇదే మాట చివరివరకు..
నీవెన్నోసార్లు ......అయినా....నేను మారలేదు..
ఎవ్వరి ఆనందంకొసమో..నన్ను భాదపెట్టావు..అయినా నేను మారలేదు..
భాదపడతానని తెల్సినా ..నన్ను.....?
ఎన్ని జరిగినా ఎమైనా...నా మాట ఒక్కటే..
నేను నిన్ను ప్రేమిస్తున్నాను...!
విషయం నీకు తెల్సు అయినా నీవు....?
ఇప్పుడే కాదు చివరి శ్వాసవరకు నాది ఇదేమాట అని కూడా నీకు తెల్సు..

నా ఇద్దరు కొత్త గర్ల్ ప్రెండ్స్ ను చూస్తారా....?




నా కిష్టమైన నా కొత్త స్నేహితులు వీరే అందంగా ఉన్నారుకదా..?చూసారా ఇవే నాకిష్టమైన భ్రాండ్లు...పరిచయం అయిన ఈ రెండు బ్రాండ్లు నాకిష్టం అందుకే నా కొత్త స్నేహితులు అంటున్నాను .... బాగున్నారా నా స్నేహితులు..భాదగా ఉన్నప్పుడు ఆభాదను మరిపించే అద్బుతమైన స్నేహితులు ..తప్పక తప్పని పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ( ఈ రెండు బ్రాండ్లు )(Signature, 8Pm WIsky)
నాకు పరిచయం అయ్యారు...దాదాపు ప్రతిరోజు నన్ను పలుకరించే స్నేహితులు వీరే..సో వీరిగురించి ఎంత చెప్పినా తక్కువే ప్రస్తుతం భాదను షేర్ చేసుకునేది వీళ్ళతోనే..నా స్నేహితులు దూరం అయిన తరువాత ...ఎప్పటికీ వీరే నాస్నేహితులు మరి తప్పదు కదా...?

మా జీ 24 గంటలు యానివర్సిడే సందర్బంగా పుల్ అయిన సందర్బంలో ఫొటో ఇది...

Sunday, April 24, 2011

నీకూ నాకూ మద్యి దూరం ఎంత....?

నీకూ నాకూ మద్యి దూరం ఎంత....?

ఏమని చెప్పను....?..సమాదానం చెప్పే పరిస్థితుల్లోలేను..






ఎన్నో చెప్పాలని అధరం మొదలు పెడుతోంది కాని ఏదీ చెప్పలేను....
మది భారాన్ని దించాలని ఉన్నా కన్నీటితో బరువెక్కిన మది కదలనంటుంటే ఏమి చేయగలను....?

ఎక్కడ ఉంటున్నావని అడిగితే ఎమని చెప్పను....?
నువ్వు లేని తీరంలో నవ్వుకు దూరంగా ఉంటున్నానని చెప్పనా ? చెప్పి నిన్ను బాధించలేను....

ఎలా ఉన్నావని అడిగితే ఎలా చెప్పను....?
ఆవేదన అంచుల్లో ఆరాటాన్ని చంపుకొని సుఖంగా ఉన్నానని చెప్పనా ? చెప్పి నిన్ను నొప్పించలేను....

ఏమి చేస్తున్నావని అడిగితే ఏమని చెప్పను....?
ఉదయ సంధ్యా రాగంలో హృదయ ఆర్తనాదాన్ని వింటూ బ్రతికేస్తున్నానని చెప్పనా ? ....

వేళకి తింటున్నావా అంటే, ....
కన్నీటి ప్రవాహాన్ని సేవిస్తూ నీ జ్ఞాపకాల ఆహారాన్ని అనుక్షణం నెమరువేసుకుంటూ తింటున్నాను....

కమ్మని కలలు కంటున్నావా అంటే, కంటున్నాను....
ముక్కలైన మనసు ఒక్కటైనట్టు, దిక్కుతోచని ప్రేమ దగ్గరైనట్టు పిచ్చిగా పగటి కలలు కంటున్నాను....

నా ప్రశ్నలకు సమాధానం చెప్పవా అంటే, ....
దరికి రాని నిన్ను తలచుకుకుంటూ దూరమైనా ఆనందాన్ని వర్ణిస్తూ నీకు సమాధానాలు చెప్పలేను....

నాతో ఎప్పటికీ మాట్లాడవా అంటే, ....
మాటలు రాని మౌనంతొ మూగబోయిన గాత్రాన్ని ఆత్రంగా నిద్దుర లేపి నీతో ఎప్పటికీ మాట్లాడలేను....

ఎప్పటికీ ఇలా ఒంటరిగానే ఉంటావా అంటే, ఉంటాను....
నువ్వు పంచిన ప్రేమ అంతరించే వరకు, నిన్ను వలచిన హృదయం అస్తమించే వరకు ఇలానే ఉంటాను ....

నన్ను క్షమించి మరచిపోలేవా అంటే, మరిచిపోలేను....
నువ్వు చూసే చూపుని.. నవ్వే నవ్వుని..నీ అలకని.. నిన్ను.. నీ ప్రేమని మరచిపోలేను....

నిన్ను క్షమించడానికి ఎవర్ని నేను ? నీకు ఏమి కాను....
నీ మనసు చంపుకొని మనువు చేసుకున్నావు, తనువు పంచుకున్నావు.. నువ్వే నేను, నీకు ఏమి కాను....

నిన్ను కోరుకున్న నేను ఆ దైవాన్ని కోరుకుంటున్నాను....
నా ప్రేమ నిజమే అయితే, నువ్వు ఎక్కడున్నా.. ఎవరి పక్కనున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను....

నిన్ను వీడలేని నేను ఈ కాలాన్ని వేడుకుంటున్నాను....
ఎలాంటి సందర్భంలోనూ నిన్ను చూపవద్దని, ఎంత చేరాలనుకున్నా నీ జాడ చెప్పవద్దని వేడుకుంటున్నాను....

నువ్వు నా దానవు కావు, నేను నీ వాడను కాను....
కోటి ఆశల కలల సౌధం కుప్పకులిపోయాక, నీటి రాతలు ఎండమావులయ్యాక నీ ప్రశ్నలకు సమాధానాలను....

ఏమని చెప్పను....?..సమాదానం చెప్పే పరిస్థితుల్లోలేను..ఆ అర్హత నాకు లేదు..?

కంటనీరు చిందినవేళ నేనున్నానంటూ ఓదార్పు నిచ్చావు...









స్వప్నమై వచ్చి మదిలో చేరావు...
తలపుల్లో నిలిచి మనసు తలుపులు తెరిచావు...
ఎవరిలేని ఒంటరి పయనంలో నీకు తోడు నేన్నావు...
కంటనీరు చిందినవేళ నేనున్నానంటూ ఓదార్పు నిచ్చావు...

మోడువారిన జీవితంలో వసంతాలు పరిచయం చేశావు...
జీవితమంటే అర్ధం చెప్పి ఎనలేని ధైర్యానిచ్చావు...
అర్ధం లేని జీవితానికి నీవే పరమార్థమయ్యావు...

అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోయావు...
కలనైనా నినుచూడక ఉండలేని నన్ను ఎందకు కాదన్నావు...
నీవు నాపై చూపిన అభిమానాన్ని ప్రేమనుకోవడం తప్పునుకున్నావు...
నా దానివే కావాలనుకున్న నా కోరికను ఆదిలోనే తుంచేయాలనుకున్నావు...

నాపై నీకు ప్రేమలేకుంటే ఇదంతా ఎందుకు చేశావు...
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమను నాకెందుకు పరిచయం చేశావు...

చెప్పు ప్రియా... ప్రశ్నిస్తేనే జీవితమన్నావు... నా జీవితం కోసం నేడు నిన్ను ప్రశ్నిస్తున్నాను... నా ప్రశ్నకు బదులివ్వగలవా...

మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు







మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు

నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు

ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు

మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు

వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు

సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు

ఇవన్నీ నామదిని తొలచివేస్తున్న ఆలోచనలే..
నిజంలా నిద్దుర లేకుండా చేస్తున్న పరిస్థితులు.

అన్నీ ఊరిస్తున్న ఊహలే వాస్తవదూరాలు..
కాదనుకున్నా కటినమైన వాస్తవాలు..

నిజంలాంటి నిజాలు కాకపోయినా..
ఊహల్లో ఊరిస్తున్న వాస్తవాలు ప్రియా

Saturday, April 23, 2011

జీ 24 గంటలు 2వ యానివర్సిడే మజా

కనురెప్పల అంచున చేరిన కన్నీటి చుక్క...





కనురెప్పల అంచున చేరిన కన్నీటి చుక్క...
కారనాలు అడుగుతోంది...నీవెక్కడ అంటూ
నేను ఇప్పుడు ఆ కన్నీరుకి కారణం చెప్పేపనిలేదు..
అర్దంచేసుకుంది..నా భాద తగ్గించాలంటే తానున్నానంటూ దైర్యం చెబుతోంది
నీవు గుర్తొచ్చినప్పుడల్లా అదే నాకు ఓదార్చే నేస్తం..
ప్రతిసారి వెచ్చటి కన్నీరే నాకు తోడు..చివరివరకు..
అ కన్నీరు కూడా ఇంకిపోయి నన్ను ఉడికిస్తోంది ఒక్కోసారి..
ఆ కన్నీరుకి కూడా ఒక్కోసారి నేను గుర్తుకురానేమో అవికూడా రావు..
ఆ కన్నీరుని నిలదీస్తే..వేసవికి ఇంకిపోయాని ప్రతిసారి రానంటూ కరాకండీగా చెప్పిందా కన్నీరు..
ఆప్పుడనిపిస్తుంది నేను ఒంటరినని గుర్తుచేస్తోంది కదాని
ఇలా నేనున్నానంటూ దైర్యంచెప్పిన నేస్తాలు దూరం అయితే నేనేట్టా తట్టుకోగలను..
అందుకే నాకనిపిస్తోంది...నా నిర్నయమే కరేక్టని..ఆ రోజుకోసం ఎదురుచూస్తూ..

Friday, April 22, 2011

ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించండి..

మనస్సుతో ఆటలొద్దు...? ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించండి..
ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా ప్రేమిస్తూనే ఉండండి అదే నిజమైన ప్రేమ

Hearts Can Break

అంత ప్రేమగా ఎలాఉంటారో..ఒకరినొకరు వీడలేనంతగా..?

Heart fail





అంత ప్రేమగా ఎలాఉంటారో..ఒకరినొకరు వీడలేనంతగా..?
ఇష్టపడటం దూరం కావడం అన్నీ ఎందుకో..ఇష్టపడి ఎందుకు దూరం అవుతారో
వాళ్ళిద్దరి మద్యి ఎలాంటి గొడవలేక పోయినా..ఎవరో చెప్పీందానికి ఇద్దరూ దూరం అవ్వడం..
ఎవ్వరూ పూడ్చలేనంత అఘాదం ఏర్పడటం..మంచి మిత్రులు శత్రువులు అవ్వడం.?
అంతా వింతగా వరుసగా జరిగిన పరిస్థితు గుర్తుకొచ్చినప్పుడల్లా..కంట కన్నీరు ఆగదు..
శత్రువుల్లా ఎంటాడుతున్న నీజ్ఞాపకాలు..ప్రతిక్షనం గుండెల్లో ఆవేదన మిగులుస్తాయి..
ఒకరిని ఒకరు విడువలేనంత గా ఎలా ఉంటారు..అలాఉండే వాళ్ళందరూ నిజంగానే అలా ఉంటున్నారా..
ఒకరిని ఒకరు క్షనం కూడా విడిచి ఉండలేనంత ప్రేమ ఒక్కసారిగా మారిపోతుందా ..ఎందుకలా జరుగుతుంది
ఏంటో అన్ని తిక్క తిక్క ఆలోచనలు..నిజాలు కాని నిజాలు అంటే ఇవేనేమో..
అందుకే అనిపిస్తుంది ...ఎన్ని అనుకున్నా గతం తిరిగి రాదు..వాస్తవం అబద్దం కాదు..
నిజం మింగుడు పడకా..వాస్తవాన్ని మర్చిపోలేక..జరుతున్నది తట్టుకోలేక..
మనం భాద పడుతూ మనసుని భాదపెడుతూ...కన్నీళ్ళతో సహవాసం చేయాల్సిందేనా..
నీవు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు..గట్టిగా ఊపిరి పీలుస్తాను
ఆఊపిరి అలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది నిజంగా...
ఎన్నాల్లని తట్టుకుంటాను నీవు లేనన్న వాస్తవాన్ని ప్రియా..
అందుకే కొన్ని సార్లు ఉన్న కన్నీరు ఆగిపోయి ..కన్నీరు బదులు రక్తం వస్తోంద్ తెలుసా..?

ఏమీ చేయలేక నిస్సహాయంగానే నిల్చున్నా.....?






మౌనాన్ని ప్రేమిస్తున్నా...
నీ మాటలు నాకు చేరడంలేదు కదా...

నిన్ను తాకే గాలిని సైతం ప్రేమిస్తున్నా...
నిను తాకి నను చేరుతోందని...

పగటిపూట కూడా నిద్ర పోవాలనుకుంటున్నా...
స్వప్నంలో నిన్ను చూడొచ్చని...

రాత్రుల్లు నిద్రలేకుండా గడుపుతున్నా..
కన్నీళ్ళలో ఉన్న నీవు కరిగి పోతావేమో అని

నీ పాద స్పర్శ తగిలిన నేలను చూచి ఈర్ష పడుతున్నా...
ఆ భాగ్యం నాకు కలగలేదని...

అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగానే నిల్చున్నా...
ఎందుకంటావా...

నిన్ను చూచినవేళ నా మాట మౌనమవుతుంది...
చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...

అయినా హృదయాన్ని వీడిపోని ఆశ మాత్రం నిన్ను చేరాలని తపిస్తూనే ఉంటుంది...
నిను చేరే భాగ్యం ఏనాటి కలిగేనో అని వేచి చూచే నా చిన్ని హృదయానికి ఏమని చెప్పను...
దాని ఆశను నెరవేర్చే ధైర్యం నాకు లేదని... జరిగే అవకాశం లేదని

Thursday, April 21, 2011

బాగున్నావా అని అడగలేనంత విరోదులమా మనం...?






బాగున్నావా అని అడగలేనంత విరోదులమా మనం...?
వేలసార్లు అనుకున్నా ...కాని సమాదానం దొరకలేదు..
నిమిషాలు,గంటలు లెక్కలేకుండా మాట్లాడుకున్న మనం ఎందుకిలా ..ఎన్నాల్లిలా..?
ఒకప్పుడు భాదపడతానని ఫీల్ అయ్యేదానివి...అన్నీ తెల్సి మౌనంగా ..
ఒక్కోసారి అనిపిస్తుంది....నిన్ను ఎప్పుడు చూశాను అదే ఆఖరి చూపేమో అని..
అప్పుడు నీవు చూడాలనుకున్నా ..మాట్లాడాలనుకున్నా....?
శాశ్వతంగా మూగ బోయిన ప్రాణం..శాశ్వతంగా మూగ బోయిన నా గొంతు..
మాటలు వినాలనుకున్నా పలుకని నాగొంతు...ఎప్పటికి కనిపించని నేను..
అలా జరిగితే నీకే మనిపిస్తుంది...ఈ మాట చెప్పటానికి భాదగా ఉంది మరి నీకు..
ఎందుకో కొన్ని కొన్ని ఆలోచనలు ఈ మద్యి..చాలా భాదపెడుతున్నాయి..
ఒకప్పుడు ఏమైనా చెయగలను అనిపించేది మరి ఇప్పుడు...
నీ విషయంలో ఎందుకిలా మారిపోయానో అర్దంకావడలేదు ..
ఒక్కోసారి అనిపిస్తుంది షడన్ గా నేను ఊహించింది జరిగీ నేను నీకు ఎప్పటికీ కనిపించలేనంత దూరంగా పోతే...?

మనం నుంచి వీవు పోయావు ..మరి నేనే మయ్యాను





మనం నుంచి వీవు పోయావు ..మరి నేనే మయ్యాను....?
ఏమో ఈ ప్రశ్న నాకే వింతగా ఉంది..తెలుసానీకు..
నీవెలా ఉన్నావు ఏమిచేస్తునావనే ఆలోచనలు తప్పించి నేనేవరో అర్దకావడంలేదు..
ప్రాణంకంటే ఇష్టమైన మనిషి కోసం..అన్నీ కోల్పోవడం ఆంటే ఇదే నేమో..
అందుకే ఒక్కోసారి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి తెలుసా..
మొన్న ఎందుకో మనం కల్సినా ఆ పార్కుకు వెళ్ళా..చిరుజల్లు కురుస్తుండగా..
వాతావరణం ఎంత చల్లగా ఉన్నా మనసులో అలజడి..నీవు దూరం అయ్యావన్న కారణం..
ఇప్పుడు ఇది నాకు కొత్త కాకపోయినా..ఈమద్యి ఎందుకో ఎక్కువైంది..
అందుకే ఈ పార్కుకికి వచ్చాకనిపిస్తావేమో అని చిన్ని ఆశతో..
ఆ పార్కులో ఎవరో ఇద్దరు ప్రేమికు ప్రేమగా ఇష్టంగా మాట్లాడుకునే మాటలు లీలగా వినిపిస్తున్నాయి..
ఎదో మాట్లాడుకుంటున్నారు అమె అంటుంది ఎంచుకు చిన్న పిల్లాడిలా ఆలోచిస్తావు అని..
నీకు నేనున్నాను ఎవరితో నాకు అవసరం లేదని ...అమె అనేవన్నీ నిజాలేనా..?
ఎందుకులే అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తున్నా నిస్తేజంగా కారణం వెంటాడుతున్న నీజ్ఞాపకాలు..

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలే....?





ప్రేమ హృదయాలను అర్థం చేసుకోవడం... ఆకళింపు చేసుకోవడం ఒక్క కవికే సాధ్యమని గతంలో ఎందరో చెప్పారు. ఆ కవులు ప్రేమికుల భావాలు ఎలా ఉంటాయో తెలుపుతూ ఎన్నో గీతాలను అందించారు. వాటిలో అమృతాన్ని పంచేవి, విరహాన్ని పెంచేవి, ప్రేమ మైకంలో దించేవి ఎన్నో... ఎన్నెన్నో. ప్రేమ తాలూకు తీయని మత్తు, విరహాలు ఎంత కమ్మటి అనుభూతులను పంచుతాయో... ప్రేమించిన వ్యక్తిని పొందలేనపుడు ఆ మనసు పడే వైరాగ్యం అంత బాధను మిగులుస్తుంది. వీటన్నిటి కలబోతగా ఆచార ఆత్రేయ ఓ గీతంలో అందించారు.. ఒక్కసారి చూద్దామా...!!

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలే ననీ
విరహాన వేగిపోయే విలపించే కథలు ఎన్నో || విధి ||

ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్లు గడిపెను శకుంతలా
విరహ బాధను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళా
అనురాగమే నిజమనీ మనసొకటి దాని రుజువనీ
తుది జయము ప్రేమకేననీ బలియైనవి బ్రతుకులెన్నో || విధి ||

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ యిలలో
కులము మతము ధనము బలము గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదనీ ఎడబాటి లేచినాము
మన గాథ యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలీ మరో చరిత్రా...

Wednesday, April 20, 2011

కరిగి కన్నీటి వానగా మారి పోతే బాగుండు కదా...?





ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను అనిపిస్తుంది
ఆకాలమే అయినా మనసులో అందోళన అలా అనిపిస్తుంది
ఇవ్వాళ భోరున వాన కురిస్తే బావుణ్ను
మనసు నిండా అలుముకున్న ముసురు
నీ ఆలోచనల్లా మదినిండా..కమ్ముకున్నాయి
కరిగి కన్నీటి వానగా మారి పోతే బాగుండు కదా...?
నీ కోసం గుండెలో దిగులు గూడు కట్టుకున్నా
ఇంత నిర్లిప్తత ఎందుకో ? నీవు దూరం అయ్యావనే కదా..?
ఇప్పటి దాకా కమ్ముకున్న మబ్బులు
ఒక్క టొక్కటిగా విడి పోతాయా..?
ఒక్కో నయనం నుండి చినులా జాలు వారదా
జడి వాన కురవదా ?
కమ్ము మనమద్యి ముసుర్లు తొలగవా?
అపార్థాలు తొలగి పోవా?
మనసులు తేలిక పడవా?
కుండ పోతగా కురిసి
ఈ ముసురు వీడి పోతే బావుణ్ను
హరివిల్లు విరిచి నట్టు మనం ఎప్పటిలా ఉండాలేమా..?

నా కవిత నీ కోసమే పుట్టింది తెలుసా...?






నీవు దూరం అయినప్పటి నుంచి నేను చేస్తున్నది ఇదే
అక్షరాలతో సహవాసం
ఎంత అదృష్టమో కదా !
మాటలతో చెలిమి దూరం అయినప్పుడు
మనసును ఆవిష్కరించే కుంచె కవిత కదా !
నా కవిత నీ కోసమే పుట్టింది తెలుసా...?!
గొప్ప కోసం వ్రాయడం లేదు
మనసు లోని భావాలు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నా
ఎవరి మెప్పు కోసమూవ్రాయడం లేదు
ప్రాసల ప్రయాసల కొఱకువ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
దుక్కం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
సంవేదన నా గుండెను మెలిపెట్టినపుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా !
పదాలు అమరిక..భాదతో నీడిపోతుంది
ఆత్మ తృప్తి కొఱకు ,నీ పై నాప్రేమను తెలిపేందుకు
ఆవేదన పంచుకోవటానికి
ఆలోచనల పదును పెంచటానికి
ఇలా నిన్ను గురించి ఆలోచనలు నన్ను వెంటాడుతున్నప్పుడు
ఇలా నీకోసం ఆలోచిస్తూ.. రాస్తుంటాను

Tuesday, April 19, 2011

బెంగగా నాలో నేనే ముడుచుకుని పడుకుని ఉన్నాను





ఇంత ఎందుకు ఉంటున్నానో ఈ మద్యి అర్దకావడం లేదు
ఒక్క నీ విషయంలో మాత్రమే ఇలా జరుగుతోంది ఎందుకో
చేయని తప్పులకు భాద్యున్ని చేస్తున్నారు అకారణంగా
నీ ఎదురుగా కోందరు నన్ను తప్పుడు వానిగా చేస్తున్నారు.
ఏం జరుగుతుందో అర్దంకావడంలేదుకొంచెం కూడా ధైర్యం రావడంలేదు
బెంగగా నాలో నేనే ముడుచుకుని పడుకుని ఉంటున్నాను
ఈ భూప్రపంచం మీద నాకెవరూ లేరంటూ
నా కన్నా ఒంటరి ఇక ఎవరున్నారంటూ?
పిచ్చి పిచ్చి ఆలోచనలతో నేను ఆందోళనలో ఉన్నాను
నేనో చిన్న ఓదార్పు కోసం చూస్తున్నా అది ఎవరోకాదు
అటువంటప్పుడు సొంత వాళ్లో, పరాయివాళ్లో కాదు
ఎవరోకాదు అది నీకూ మాత్రమే సాధ్యి ప్రియా
ఒక్క దయగల నీ చూపు చాలు నాకు
సర్వ భయాలనించీ సదా విముక్తిడినయిపోతాను
ఇక పాత జ్ఞాపకాల రైలుబండి
పట్టాలమీద మళ్లీ వచ్చి నిలబడుతుంది
లక్షల వేల కోట్ల అసంఖ్యాక బంధాలలో
నీ చిరునవ్వుతో కూడిన ఒక్క చిన్న పలుకు చాలు
ప్రేమ నిండిన నీ ఒక్క స్పర్శ చాలు
ఇక ఆగిపోయిన బతుకు నావ
కాలం వాటుగా సాగిపోతుంది
అటక మీద తుప్పుపట్టి పడున్న
ఇనప్పెట్టె లాంటి నా మది
స్వర్గలోకపు దారుల్లోకి
ఇక వడివడిగా తెరుచుకుంటుంది
అది ఎవ్వరో తెలుసా నీవే అది నీకు మాత్రమే సాద్యిం..

Monday, April 18, 2011

ప్లీజ్ ఒక్క నిమిషం అయినా నన్ను గెలిపించవా...?





ప్లీజ్ ఒక్క నిమిషం అయినా నన్ను గెలిపించవా...?
అవును నీవు నన్ను ఎప్పుడూ ఓడిస్తున్నావు..
ఎదిటి వాన్ని గెలిపించాలంటే నీవు నన్ను ఓడించాలి..
అతను గెలవాలనుకుంటుంన్నావు కాబట్టీ నన్ను ఓడిస్తున్నావు..
అప్పట్లో తట్టుకోలేకపోయినా అదేనిజం కాబట్టి తప్పదు..
పర్లేదు ఓటమి .... నాకు ఇచ్చింది నీవు కాబట్టీ ...?
నీకోసం ఎన్ని సార్లయినా ఓటమిని భరిస్తాను భారంగా..?
కాని ఎందుకో ఒక్కనిమిషం అన్నా గెలిపించవా అని అడగాలని ఉంది..
ఒకే ఒక్క నిమిషం చాలు ..ఎందుకంటే అంతకంటే నాకు అర్హత లేదుకదా..
నీకు ఇష్ట లేదు కదూ అందుకే ఓ ఆలోచన చేశా..!
ఎటు ఇది ఏప్రెల్ నెలకాబట్టి..ఒక్క నిమిషం గెలిపించి..?
ఏప్రెల్ ఫూల్ అని అనొచ్చు నీవు..ప్లీజ్ ఒక్కనిమిషం గెలిపించు చాలు..?
నా ఐడియా బాగుందికదా...ప్లీజ్ ఒక్కనిమిషం అన్నా గెలిపించవా ...!

Sunday, April 17, 2011

నాహ్రుదయానికి తగిలిన గాయం మానేలా లేదు





నా హ్రుదయానికి తగిలిన గాయం మానేలా లేదు..
ఎందుకో తెలీదు నీవంటే నాకంత ఇష్టం..
ఎందుకో నీవు నాకు అలా దూరం అయ్యావు..
దగ్గరగా ఉన్నప్పుడే భయపడే వాడిని ఇంతగా ఇష్టపడుతున్నా దూరం అయితే...?
ఆలోచనే అప్పుడు అంత భయకరమనిపించిది అప్పుడు..
కాని అదేనిజం అయింది..నీవు నన్ను అసహ్యించుకునేంతగా..
మరి నాహ్రుదయం ఎంత గాయపడుతుంది చెప్పు..
అదీ నీవు అసహ్యించుకునేంతగా అంటే నేను ఎలా తట్టుకోగలను చెప్పు..
ఇప్పటికీ నీవంటే ప్రాణం అని మాత్రం చెప్పగలను..
నీకోసం ప్రాణం అయినా ఇవ్వగలను కాని ఇప్పుడు నేనంటే నీకు అసహ్యంకదా...?
వద్దు నీవులేని నాజీవితం వద్దు...బ్రతకాలని అస్సలు లేదు..
అదీ నీవు నన్ను అసహ్యించుకుంటున్నావు అని తెల్సి ఎలా బ్రతకను చెప్పు..
నీవు అసహ్యించుకునే జీవితాన్ని నేను ఎలా జీవిస్తాను చెప్పు ప్రియా..

ప్రతిక్షనం నీతలపులే





నువ్వెవరని వర్తమానం నన్ను వెక్కిరిస్తుంది...?








వర్తమానాన్ని తన జ్ఞాపకాల పుటల్లోకి ఆహ్వానించేది గతం.
ఆ తాలూకు అనుభవాలతో భవిష్యత్ని అనుకూలంగా
మార్చుకొవలనుకొనె అమాయకపు వర్తమానం.
వర్తమనపు అంచనాలకై నిరీక్షించింది భవిష్యత్.
భవిష్యత్ నుండి వచిన నేటి వర్తమానంతో పోల్చుకుంటే
నాకు గతం మిగిల్చిన ఆనందం ఎక్కువ.
జరుతుగున్న పరిణామాలు నాకు అర్దంకాకుండా ఉంది .
గతమే శాశ్వతం ఐతే మొన్నటి భవిష్యత్ అంటే నేటి వర్తమనాన్ని..
నమ్మాలో వద్దా ఏంజరుగ బోతోందో తెలియడంలేదు
మొత్తానికి ప్రస్తుతం కాలం మాత్రం నన్ను నేరస్తున్ని చేసింది
నువ్వెవరని వర్తమానం నన్ను వేక్కరించ్చింది వర్తమానం ఎందుకో.
అప్పుడు గుర్తుకొచ్చింది గతం నీలో వెతికినా సహజత్వం..
నీతో పంచుకోవాల్సిన మాటలు మనసులోనే సమాది ఐపోయాయి
కానీ నీ నీడని నాకివ్వకుండా మరెవ్వరికో తోడు అయ్యావు
కానీ నేనంటున్నాను నేనెవరంటే నీ స్వచ్చమైన నేస్తాన్ని
ఈ భావం నీ దరి చేరితే వచ్చే జన్మకు అయిన నీ తోడు అవ్వాలని
ఈ జన్మకు నీకేమౌతానో ప్రియా నీవే సమాదానంచెప్పాలి...

Saturday, April 16, 2011

ఇద్దరి స్నేహితుల మద్యి...మౌనం పెద్ద నరకం






ఇద్దరి స్నేహితుల మద్యి...మౌనం పెద్ద నరకం..
అసలు ఇద్దరు ఎందుకు కలుస్తారు.. ఎందుకు స్నేహితులవుతారు..
ఒకరికొకరుగా..ఎంతో ఇష్టంగా ఒకరికి ఒకరు కష్టపెట్టకుండా ఉండి ఎలా మారతారు..
అంతలా ఇష్టపడ్డ రెండు మనసులు దూరం అయితే వారి మద్యి రాక్షసిలా చెరుతోంది మౌనం ..
ఆ ఇద్దరి మద్యి మౌనం...రెండు హ్రుదయాల్ని ఎంతగా గాయపరుస్తుందో కదా..?
ప్రపంచంలో ఆ స్నేహితులకు చెప్పుకోలేని నరకం అంటే ఇద్దరి మద్యి మౌనమేకదా...?
ఎందుకు వీరిద్దరి మద్యా మౌనం చేరుతుందోకాని..ప్రతినిమిషం వారిని చంపేస్తుంది...
అంతగా వారికి వేదిస్తున్న మౌనం కన్నా పెద్దనరకం ఇంకోటి ఉండదు మరి
ఒకేసారి ప్రాణం పోయినా బాగుంటుంది కాని ఇద్దరి మద్యి మౌనాన్ని భరించలేరు..
ఇద్దరూ ఒకరికొకరు అనుకుంటారు మామద్యి ఏర్పడ్డ అఘాదన్ని ఎవరైనా వచ్చి తీర్చకుడదూ అని..
ఇద్దరిని విడదీయటనికి ఏంత శ్రమపడతారో...ఎన్నో చెప్పి విడదీస్తారు..వారేంసాదిస్తారో తెలీదు..
నిజంగా ఒకప్పుడూ అన్నీ షేర్ చేసుకుని ప్రతినిమిషం మాట్లాడుకునే స్నేహితులకు మౌనం ఓ శాపం..
మౌనం మనిషిలోని మనస్సును దారుణంగా చంపేస్తుంది...బ్రతికించలేనంతగా..
నేనున్నానంటూ దైర్యించెప్పిన మనిషి మౌనంగా ఉంటే చెప్పలేని భాద
ఇద్దరి మద్యి మౌనానికి సరైన శిక్ష మరణమే..ఎందుకంటే..?
మరణం మనిషిని ఒక్కసారే చంపేస్తుంది...కాని మౌనం ఇద్దరి స్నేహితుల్ని ప్రతిక్షనం చంపేస్తుంది దారుణంగా

అనుకోకుండా ... అతిచేరువగా...?






When you say, 'I'm sorry,' look the person in the eye..

When you say, 'I love you,' mean it.

"Champions aren't made in the gyms.
Champions are made from something they have
Deep inside them - a desire, a dream, a vision."



అనుకోకుండా ... అతిచేరువగా ..
కొన్ని పరిచయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ..
అది ఎంతగా అంటే ..
కష్టానైన .. సుఖానైన ..
బాదనైన .. సంతోషనైన ..
లాభానైన .. నష్టానైన ..
చివరికి ... నిజమైనా.. అబద్దమైనా ..
ఆలాంటి బందం దూరం అయితే మాత్రం చావాలనిపిస్తుంది కదా..?
అవును నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ..ఆస్నేహం గురించి.చెప్పేస్తూ వుంటాం ...
ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?.. సమాదానం మాత్రం .. ఏమో ..అది మనస్సును హత్తుకున్న ఫీలింగ్
" కొందరు అంటున్నారు మనిషిలో సొంతం , బందం అన్న మాటకి ఈ రోజుల్లో అర్ధం లేదని ....
కాని నేను చెబుతున్న "friend" అనే పేరుతో అవి శాశ్వతంగా మిగిలే వుంటాయి అని

చేతిలోన చెయ్యేసి చెప్పేయవా ...ఎన్నడూ విడిపోనని

నిజమైన ప్రేమికులు..చెప్పుకునే ఊసులు ఇవే..ఈ పాట వీడియోలో పచ్చదనం బాగుంది..ఎప్పుడూ .ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోకూడదని ..ప్రేమికులు ఒకరికి ఒకరు చెప్పుకునేఇ ఫీల్ అయ్యే పాట ప్రేమికులకు ప్రతిక్షనం అనేక సమస్యిలు వచ్చినా ఇద్దరూ ఓక్కటిగా ఎదుర్కోవాలి..ఇద్దరూ వేరుకాదు ఇద్దరి ప్రానాలూ ఒక్కటే అని చెప్పేపాట

పల్లవి :
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని ॥
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ...


చరణం : 1
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ...


చరణం : 2
నిన్నుతాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం

Friday, April 15, 2011

చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావు..




చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావు
మండుటెండనైనా పండు వెన్నెలగా మార్చేస్తావు

కనుమూయగానే కలల అలవై వచ్చి సంతోషంలో ముంచేస్తావు
ఆరాటపడే మనసుపై అమృత చినుకుల్ని చిలకరిస్తావు

కనిపించకుండానే అనుక్షణం నన్ను కవిస్తావు
అందుకే... నీ మాయ సోకిన నా మనసు నను నిలవనీయనంటోంది
నినుచేరి తరించాలని అనుక్షణం నా మనస్సు నన్ను వేధిస్తోంది

మృత్యు లేఖ ....





మృత్యువుతో పోరాడుతున్న క్షణం లో నీ పలుకుల కోసం తపించాను

నీ మాటల తియ్యదనం తో ఐనా చావుని చావునుంచి బ్రతికిస్తావో అని ...

నా మరణ శయ్య పై పుష్ప గుచ్చాన్ని ఉంచుతావని ఆరాటపడ్డాను

నీ చేతి స్పర్సతో ఐనా పునరుజ్జీవుడను అవుతానేమో అని ...

చితిలో కాలే క్షణం లో కూడా నీ వైపు నిస్తేజం గా చూసాను

నీ కన్నీటితో నా చితి మంటలను ఆర్పెస్తావేమో అని ...

మనసున్న నీవు ఇలా ఎందుకు మారావో అర్దంకావడంలేదు

లేని నీ హృదయాన్ని కోరిన నేరానికి నాకిలా జరగాల్సిందే కదా

ఇక ఎప్పటికీ తిరిగిరాని మృత్యువు ఒడిలో హాయి గా సేద తీరబోతున్న తరుణం ఆసన్నమైంది

....... ఇట్లు
........నీకెప్పటికి ఏమి కాలేని ..

స్నేహం,ప్రేమ...మోసం,ద్వేషం..అన్నీ రెండు అక్షరాలే






స్నేహం,ప్రేమ...మోసం,ద్వేషం..అన్నీ రెండు అక్షరాలే ..
ఈ రెండు అక్షరాలు మనసుల్లో ఎంత ఆదోళన్ చేస్తాయోకదా..
ఆ రెండు అక్షరాలను అంత పదునుంది అన్నీ కత్తుల్లంటివే..

స్నేహం ప్రేమ ఇవిరెండూ మనకు తెలియకుండానే ఇద్దరి మనుష్యుల్ని దగ్గర చేస్తాయి..
ఇవి రెండూ ఉన్నంత వరకు ఇద్దరి మనుష్యుల్లో చెప్పలేని ఆనందం..

ఓకరికి ఒకరు తోడుగా ప్రపంచంతో సంబందం లేకుండా రెండు మనసులు ఎన్నో ఊసులాడు కుంటాయి..
ప్రతిక్షనం ఒకరికోసం ఒకరు అన్నట్టు బ్రతుకుతారు ఒకే ప్రాణంగా

ప్రతిక్షనం ఒకరికోసం ఒకరు అన్నట్టు బ్రతుకుతారు ఒకే ప్రాణంగా..
ఇద్దర్ని ఎలా విడదీయాలాని అనేక ప్లాన్లు వేస్తుంది..వీరి ప్రేమ మందు వాడు ఓడీపోతాడు

కాని చివరకు కాలం గెలుస్తుంది వీరిమద్యి మోసం ,ద్వేషం అనేవి పెట్టి దూరం చేస్తాడు..
శాడిష్టులా ఇద్దర్నీ విడదీసి ఆనందం పొందుతుంది కాలం ఎంత అన్యాయంకదా
ఈ ఘోరాన్ని తట్టుకోలేని రెండు మనసుల్లోని ఓ మనస్సు తనువు చాలిస్తుంది..
రెండు మనస్సులు ఆనందగా ఉండటం తట్టుకోలేని కాలాన్ని ఏమనాలి..
వింత ఏమిటంటే సంతోషపెట్టేవి రెండు అక్షరాలే దగ్గరచేసేవి రెండు అక్షరాలే..దూరం చేసేవి అవే రెండు అక్షరాలే..?..?

Thursday, April 14, 2011

ఒక ఆశ నిరాశై నన్ను వెక్కిరిస్తున్న...వేళ..





ఒక ఆశ నిరాసై నన్ను వెక్కిరిస్తున్న...వేళ ..నాకు నేనుగా ఘోరంకా ఓడీపోయిన వేల
ఒకప్పుడు నేనున్నానంటూ దైర్యం చెప్పిన స్నేహం దూరమై ఈరోజుకు 220 రోజులు..

నెలలు రోజులు క్షనాల్లా గడుస్తున్నాయి.. భారంగా
ఎందుకిలా జరిగిందో తెలియదు..జరుగుతుందో తెలియదు..

ఒక్కోసారి పెద్దగా అరవాలనిపిస్తుంది నీదగ్గరకు వచ్చి నన్నెందుకిలా చేశావు అని..
మళ్ళీ అనిపిస్తుంది అర్హతలేదు నాకు నిన్ను అడిగేందుకు అని నిజమేకదా ..

అవును నాకో విషయం తెలీదు..నేను ఓడిపోయానా ఓడించావా..?
ఏముంది ఓడించినా ..ఓడీపోయినా ఘోరంగా బలైంది నేనేగా..

కాని ఒక్కటిమాత్రం గుర్తుంచుకో..నేను ఎన్ని సార్లు అయినా ఓడిపోతా..
నీవు మాత్రం ఎప్పుడూ గెలవాలి..ఓటమి నీదరిదాపులకు రాకూడదు.

అందుకే ఈమద్యి నాకనిపిస్తుంది ..నీకు విజయం శాశ్వితం కావాలంటే..
నేను శాశ్వతంగా ఈ లోకంనుంచి పోవాలి అదే నీ గొప్పవిజయం కదా..?
అప్పుడు నీవు ఇంకా ఆనందంగా ఉంటావా..పెదాలపై చిరునవ్వు చెరగకుండా ఉంటుందా..?..
నీ చిరునవ్వంటే నాకు ప్రాణం ఆనవ్వు కోసం ఏమైనా చేస్తాను..ప్రాణమైనా ఇస్తాను ..

అన్నీ నీవే అనుకున్న నేను ప్రపంచాన్ని పూర్తిగా మరిచాను





ఎప్పుడొచ్చావు నా గుండెలోకి... చప్పుడైనా చేయకుండా...
ఏమి చెప్పావు నా మనసుకి... నాకేమాత్రం తెలియకుండా...

ఏ మంత్రం వేశావు నామదికి... నీవు తప్ప మరో ఆలోచన లేకుండా...
ఏ మాయ చేశావు నాలోని తలపులకి... నిత్యం నీ ధ్యాసే తప్ప మరేదీ రాకుండా...

అన్నీ నువ్వు చేస్తావు..కానీ నా మాట మాత్రం పట్టించుకోనంటావు...
ప్రేమంటే తెలుసానీకు... కానీ నీతోటి ప్రేముంటేనే జీవితం నాకు...

గూండెల్లో చేరావు..అలజడి స్ర్తుష్టించావు ఆందోళన్ రేకెత్తంచావు..
అన్నీ నీవే అనుకున్న నేను ప్రపంచాన్ని పూర్తిగా మరిచాను ..

నీవు నాతో ఉన్నప్పుడు ఏప్పుడూ నాకు నేను అనుకునే వాడిని ..
ప్రపంచంలో కేల్లా నేనొక్కడినే అద్రుష్టవంతుడిని నేనే అని..

అప్పుడనిపించేది ప్రపంచం అంత చిన్నగా ఉండేదా అని..
ప్రతిక్షనం ప్రతినిమిషం అప్పుడూ ఇప్పుడూ నీ ఆలోచనలే...

నీ పలుకే విననంత దూరంగా నేను బద్దశత్రువుల్లా దూరంగా ఎందుకో..
ఈ విషయాన్ని ఎప్పూడూ ఊహించలేదు..కాని జరిగిపోయింది..

అప్పుడు అనుకున్నది తప్పు ప్రపంచంలో కెళ్ళా దురద్రుష్టవంతున్ని అని..
ఇప్పుడు నీతో మాట్లాడే వాల్లే అలాంటి అద్రుష్టవంతులని నెనెప్పటీకీ కాదని..

నీకు తెలుసా నాలో నేను లేను పూర్తిగా మారిపోయాను..
నీవు గుర్తుపట్ట్లేనంతగా...ఉన్నాను చూసి ఎవరూ అంటావు అలావున్నాను..

ఇక కొద్దిరోజులే మిగిలి ఉంది..నీవు కనిపిస్తావనే ఆశ చచ్చిపోయింది..
నా ప్రయాణం చివరి మజిలీలో ఉంది..అనినీకూ తెల్సు కాని...?

Wednesday, April 13, 2011

నీ జ్ఞాపకాలు ..పదునైన కత్తుల్లా గుండెల్లో గుచ్చు కుంటున్నాయి





నీ జ్ఞాపకాలు ..పదునైన కత్తుల్లా గుండెల్లో గుచ్చు కుంటున్నాయి..
నిజమే గంతంతాలూకా నీ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు చెప్పలేని భాద..
నీ గుర్తులు ఎక్కడ ఉన్నావంటూ నన్ను ప్రతిక్షనం వెక్కిరిస్తున్నాయి నీ వెక్కడ అంటూ..
మనం కల్సిన మొదటి క్షనం నుంచి ఇప్పటిదాకా ప్రతిజ్ఞాపకం పదిలంగా ఉంది..
నీ ప్రతి జ్ఞాపకం పదునైన కత్తుల్లా గుండెల్లో దిగబడ్డాయి..రక్తం ఏరులైపారుతోంది..
ప్రాణం విలవిల లాడుతోంది ఏక్షనం అయినా ,ఏ నిమిషం అయినా ప్రాణం పోవచ్చు
ఒక్కోసారి అనిపిస్తుంది నీవు నాతో ఎందుకు మాట్లాడవని ..నాకు ఆర్హత లేదేమో కదా..
నిజమే ఎందుకు మాట్లాడాలి ఇప్పుడున్న నీస్నేహితుల ....?నేను వేష్టుగాడిని కదా..
ఇప్పుడు నీవు మాట్లాడే స్నేహితుల్లో ...నేనే వేష్టుగాడిని కాబట్టే నాతో మాట్లాడటం లేదు కదా..
పాతజ్ఞాపకాలు ఇప్పటికే గుండెళ్ళో పెద్ద పెద్ద గాయాలు చేశాయి బ్రతికే అవకాశం లేనంతగా..
వాడిపోయిన చెత్తకాగితం లాంటి నా లాంటి స్నేహితులు నీకెందుకులే కదా అనిపిస్తుంది నాకెప్పుడూ..
ఎందుకో ఈమద్యి జ్ఞాపకాల తాలూకా భాద ఎక్కువైంది..అయినా ఏమి చేయగలను భాదపడటం తప్ప..
పాత జ్ఞాపకాలు రంపపు కోతల్లా గుండేను ప్రతిక్షనం నిలువునా కోస్తున్నాయి నీ వెక్కడంటూ..
అప్పటినుంచి ఇప్పటివరకు అన్నీ మదుర జ్ఞాపకాలే..అయినా ఎందుకో అవి భాదిస్తున్నాయి..
అన్ని జ్ఞాపకాలు నీ వెవరంటూ వెక్కిరిస్తున్నాయి..నీగురించి ఆలోచించే అర్హ్జత లేదంటూ వార్నింగ్ ఇస్తున్నాయి..

నా డైరీలో ఓ అమ్మాయి పేజి..( Its Real )..Part-1





సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి కాని...మనకెందుకులే అనుకుంటాం..కొని విషయాలు మనసుల్ని కలచి వేస్తాయి..రిపోర్టర్ గా ఎందరినో కలుస్తుంటాం రకకాల కధలు తెలుస్తుంటాయి...ఇది ఓ గోల్డ్ మెడలిష్టు రియల్ ష్టోరి..ఎందుకు చెబుతున్నాను అంటే నిజంగా ఇలా జరుగుతున్నాయి...పైకి పెద్ద మనుష్యుల్లా ఉండి అమ్మాయి ఒంటరిది ..అని తెలిస్తే మాత్రం ఎదోవిదంగా అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అని చూస్తున్న పెద్ద మనుష్యులున్నారు.. పైకి పెద్ద మనిష్యులు నీతులు చెబుతుంటారు.... మనిషిలోపల మరో మనిషి ఎదుటి వాళ్ళ అవసరాన్ని క్యాష్ చేసుకుందాం అని చూసే కుక్క బుద్ది....ఎదుటి మనిషి ఆపదలో ఉంది ...దుక్కంలో ఉంది అన్న ఇంగిత జ్ఞానం లేకుండా లేకుండా ప్రవర్తించిన ఘటన ...తనకు ఇంత కూతురు ఉందన్న ద్యాసకూడాలేని మనిషి ఓ అమ్మాయిని పెట్టిన మానసిక వేదనకు ప్రతిరూపమే ఇది...

తండ్రి చాటు బిడ్డ సరస్వతీ పుత్రిక... చదువు లో ఫష్టు..ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు ...హాయిగా చదువుకొంటూ అందరి మన్ననలు పొందిన ఓ అందాల బొమ్మ కధ ఇది..పూర్తిగా ఇక్కడ చెప్పక పోయినా నిజాలు చెబుతున్నా ..యూనివర్సిటిలో గోల్డ్ మెడల్ సాదించి హైదరాబాద్ చేరుకుంది...మధురిమ ( పేరుమార్చాను)హైదరాబాద్ అనగానే మధురిమ తండ్రి గుండెల్లో రైల్లు పరిగెత్తాయి..నడక నేర్చిన లేడిని ఎన్నాళ్ళని కాపాడతాం తనకు కష్టాలు సుఖాలు తెలియాలని గుండె దిటవు చేసుకోని ఉద్యొగం కోసం అని హైదరాబాద్ పంపాడు మధురిమ ను మొదట బాగానే ఉంది అమ్మాయి సౌమ్యురాలు అంటూ పొగిడారు..అందులో చదువులో గోల్డ్ మెడలిష్టు కాబట్టి ..సదరు ఆఫీసులో అందరూ ఎంకరేజ్ చేసేవారు...ఇలా అందరూ తనను పొగుడుతుంటే అమ్మాయి మధురిమ ఆనందం అంతులేదు ..ఆఫీసులో ఓ పెద్దాయన ఈ మధురిమ పై ప్రత్యెకశ్రద్దచూపిస్తుంటే తన తండ్రిలాంటి వాడనుకోని అన్ని విషయాలు అడిగి తెల్సుకునేది..ఆ పెద్దమనిషే ఓ సారి చెప్పాడు తనకు అమ్మాయి మధురిమ ఆనందం అంతులేదు ..ఆఫీసులో ఓ పెద్దాయన కు మధురిమ అంత కూతురు ఉందని..సో తనను సొంత కూతురిలా చూసుకుంటున్నాడనుకోని సంతోష పడించి మధురిమ అందుకే ప్రతివిషయాన్ని ఆ పెద్దాయనని అడిగి తెల్సుకునేది.. ఆయన దగ్గరుండి అన్నీ చెప్పేవాడు..ఈ విషయాలన్ని తండ్రి రోజూ ఫోన్ చేస్తున్నప్పుడు పూసగుచ్చినట్టు చెప్పేది మధురిమ మధురిమ తండ్రికూడా హేపీగా ఫీల్ అయ్యాడు...కాని ఇక్కడే ఆ పెద్దాయన మనసులో ఈ అందాల బొమ్మ పై కన్నేసి కబలించాలని చూస్తున్నాడని తెల్సుకోలేకపోయింది మధురిమ..ఈ లోగా మదురిమ జీవితంలో కోలుకోలేని దెబ్బ...తండ్రి అనుకోకుండా అకాలమరణం మదురిమను ఎంతోకుంగ దీసింది..ఆ ఫీసులో ఆపెద్దాయన తండ్రి పోయాడని సానుభూరి చూపిస్తుంటే తండ్రిపోయినా ...దేవుడు మరో తండ్రిని ఇచ్చాడని భాధలోను ఆనంద పడింది.. అలా ఓరోజు ఆ పెద్దాయన మధురిమను ఇంటికి రమ్మన్నాడు... భాదలో ఉన్నావు ఇంటో నాకు నీ అంత కూతురు ఉంది కాస్త ఉపశమనం ఉంటుంది అని..బంగారు లేడి మధురిమ నిజమే అని నమ్మి ఆయనతో వెళ్ళింది.... ఇంటికి వెల్లగానే అక్కడేవ్వరూ లేరు అదేంటిసార్ ఇంట్లో ఎవ్వరు లేరు అని అడిగితే ఇప్పుడే వస్తారని చేప్పి సదరు పెద్ద మనిషి.. తన నిజస్వరూపాన్ని చూపెట్టడం మొదలు పెట్టాడు..అంతే బెదిరిపోయిందా బంగారు లేది మధురిమ ఏంచేయాలో అర్దం కాలేదు...మంచినీళ్ళుకావాలని అడిగి ఇదే అదును గా చూసుకోని బయటకు పరుగెత్తింది..అలా పరిగెత్తి పరుగెత్తి ఎప్పుడు ఇంటికి చేరుకుందో తెలీదు..గుండెనిండా భాద మనసులో ఆందోళన ...రేపు ఆఫీసుకు వెలితే తండ్రిలేని ఒంటరిని చేసి ఎమైనా చేస్తాడని బయం ఆవరించిదా అమ్మాయి రాత్రంతా ఏడుస్తూనేఉంది.....ఎంత ఏడ్చినా ఎంత భాదపడినా జరిగిన వాస్తవం అబద్దం అవ్వదుకదా..?..ఆలా రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఒంటరిగా ఏడుస్తూ ఉండిపొయింది...ఏందుకో ఆక్షనాన చనిపోదమనుకోని తల్లికి ఆసరాగా ఉండాల్సిన తను ఇలాంటి నిర్నయం తప్పు అని తమాయించుకోని తనకు తానే దైర్యం తెచ్చుకోని ఆఫీసుకు వెళ్ళింది సదరు పెద్దమనిషి అంతకు ముందు ఏమీ జరగనట్టే ఎమైంది అలాఉన్నావు అంటూ అందరిముందు పెద్దమనిషి తరహాలో మాట్లాడుతుంటే మనుష్యుల మీద అసహ్యింవేసింది మదురిమకు .....

( మధురిమ రియల్ ష్టోరి మిగతా ష్టోరి ...తరువాత ఫోష్టులో పెడతాను ... ఎన్నోనిజాలు ప్రత్యెక్షంగా తెల్సుకున్ననేను ఇప్పుడు ఇంత కంటే చెప్పలేకపోతున్నా )

నా బ్లాగ్ పై ఓ అమ్మాయి కామెంట్...?

mi bloog chusi scrap cheyyakunda undalekapothunnaanu

mi kavithalu chaduvuthunte na feelings ni nenu chedhuvukuntunnatlu undhi

Tuesday, April 12, 2011

నేనేం చెప్పలేనిక..జరిగేది చూడు నీవిక



నేనేం చెప్పలేనిక..జరిగేది చూడు నీవిక
చెప్పటానికి నా భాషకు భావం దూరం అయింది
ఇక చెప్పే దేమిలేదు..జరిగేది చూడు
ఎప్పుడు ,ఎక్కడ అని అడక్కు ..
ఎప్పుడైనా ,ఎక్కడైనా , ఏనిమిషమైనా జరగొచ్చు..
ఇక అన్నిటీకీ మౌనమే సమాదానం ఎప్పటికీ..
ఊపిరి ఆగే వరకు మాత్రం నీ ఆలోచనలు ఆగవు ఆవిషయం నీకు తెల్సు..
తెల్సుకోవాలని ప్రయత్నించకు ..?..ఉపయోగం ఉండదు
తెల్సుకోని నీవు చేసేది ఏముందిక.. అంతా అయిపోయింది..
ఒక మనిషిమీద ఇష్టం ఇంత దారుణంగా ఉంటుందని తెలీదు అప్పుడు..
ఆవిషయం తెల్సుకునేసరికి ... అంతా అయిపోయింది..
నాకు ఇష్టపడటమే తెల్సు ఎప్పుడూ కష్టపెట్టాలనుకోను..
నీ ఆనందంకోసం ,ఏన్నో కష్టాలు పడ్డాను ఇంకా పడతాను కూడా..
ఎందుకూ అని ప్రశ్నించకు ..అది నా మనస్సుకు సంబందించిన ప్రశ్న..
మనిషిగా ఎదుటివారికి ఇచ్చిన విలువకూడా నాకు లేదు..
అందుకే వెలుతున్నా..ఎప్పటికీ కానరానంత దూరంగా..
ఇప్పుడు నాకు "వేదనా , రోదనే " నీవు నా కిచ్చిన బహుమతులు..
ఇలాంటి అద్బుతమైన గిఫ్ట్ లు ఎన్నోఇచ్చావు ఈ జీవితానికి ఇక నాకుఇవి చాలు.. GUD BYEE

ఇక ఇక జీవించాలని లేదు...?

అవునా...?


నాకోశం ఎదురు చూస్తున్నది ....అదే మరణం.







కాలం నన్ను మోసం చేసింది, నిన్ను నానుండి దూరంచేసి
మనసు నన్ను మోసం చేసింది నన్ను వదిలేసి నిన్ను చేరి
చివరికి నువ్వు కూడ నన్ను మోసం చేశవు నన్ను ఒంటరిగా వదిలేసి
ఆ మరణాన్ని అడిగాను నన్ను తనదగ్గరకు తీసుకపొమ్మని
గట్టిగా నిలదీశాను నన్ను తీసుకెళ్ళటానికి ఒప్పుకుంది
బహుశా అది కూడ నా జీవితంలో ఓడిపోయిందేమో నాభాద అర్దం చేసుకుంది
ఇక ఎవ్వరికోసం ఎదురు చూడను..ఓటమని తెల్సి ఎదురు చూడటం పిచ్చితనమే కదా..?
ఇప్పటికే ఓటిపోయాను ..ఓటిపోతున్నాను ..ఓడిపోతాను ..?
చూశావా నామీద నా స్నేహం మీద నాకు ఎంత నమ్మకమో...
క్షనాలు ,ఘడియలు నిమిషాలు లెక్కించుకుంటున్నా..తెలుసా..?
ఇక నీకు ఎప్పటికి కనిపించనేమో..ఆరోజెప్పుడాని ఎదురుచూస్తున్నా..?
నేను పడ్డ ఆవేదన ఏనాటి కైనా తను అర్దం అవుతుందన్న ఆశ చచ్చిపోయింది
నాకోశం ఆశగా ఎదురు చూస్తున్నది పరితపిస్తుంది ఒక్కటే అదే మరణం.

కారణం..తెలీదు.....?






కారణం..తెలీదు..ఎందుకోతెలీదు..ఎంజరుగుతుందో తెలీదు..
మానసిక ఘర్షన...తెలీని ఆందోళన..ఎందుకోతెలీదు..
ప్రపంచంలో ఇలా ఎందరికి జరుగుతుందో తెలీదు కాని అర్దకాని పరిస్థితి..
నిజమేది అబద్దం ఏదో తెలీని పరిస్థితి కారణం ఏంటో తెలీదు..
ఆందోళనా..ఆవేదన తప్ప ఏమీ అర్దకాని పరిస్థితి..
ప్రతి క్షనం..ప్రతి నిమిషం ఎవేవో ఆలో చనలు..
చెప్పటానికి మాటలు రావడంలేదు...
చెప్పేందుకు నావద్ద మాటలు లేవు..
నాకు కనిపించేది అంతా సూన్యిం..అంతాచీకటి