'ప్రేమించడం కన్నా ప్రేమించబడటంలోనో గొప్పతనం ఉంది' అంటూ ఉంటారు. నిజమే మరి! ప్రేమించడానికి ఏముంది? మనకు ఏ యోగ్యతలూ లేకుండానే ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమించబడటానికే ఎన్నోయోగ్యతలు ఉండాలి. అలా ఏమీ లేనప్పుడు ఎవరైనా నిన్ను ఎందుకు ప్రేమిస్తారు? ఎవరైనా నిన్ను ప్రేమించారూ అంటే నీలో ఏవో యోగ్యతలు ఉన్నట్లే మరి! ఓ నవయువకుడు తన ముందు నిలుచుని " నేను నిన్ను ప్రేమిస్తున్నాను'' అనగానే ఆనందపరవవశమైన ఓ యువతి భావోద్వేగాల్ని చిత్రించే పాట 'అన్‌పఢ్' సినిమాలోఉంది
మీ చూపులు నన్ను మీ ప్రేమకు యోగ్యురాలిగా భావించాయి. ఓ హృదయ ధ్వనీ కాస్త ఆగిపో నాకు నా గమ్యం దొరికిపోయింది. తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తే తనను ప్రేమించి ఆ మాటను తానే ముందుగా తన ముందు పెడితే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? అతని ప్రేమకు తనను యోగ్యంగా భావించి తన జీవితంలోకి ఆహ్వానించే ప్రేమమూర్తికోసమే ఎదురు చూసే వారికి నిజంగానే అలాంటి వ్యక్తి తారసపడితే ఇంకేం కావాలి? అది వారికి తమ జీవిత గ మ్యం లభించినట్లు జీవిత గమ్యాలు అనేవి వ్యక్తిగతమే గానీ, సార్వత్రికం కాదు. అందుకే ఎవరి జీవిత గమ్యాల్ని వారే నిర్ణయించుకుంటారు. ఒకరి గమ్యం మరొకరికి గొప్పగా కనిపించకపోవచ్చు గానీ తమ గమ్యం తమకు ప్రపంచంలోకెల్లా గొప్పదిగానే కనిపిస్తుంది.
నన్ను మీ ప్రేమయోగ్యంగా భావించిన మీ నిర్ణయం నాకు సర్వదా ఆమోదం. ఈ భవదీయురాలి ప్రతిచూపూ హర్షాతిరేకంతో కృతజ్ఞతలు తెలియచేస్తోంది. ఒక నవ్వుతో మీరు మీ జీవన క్షేతంలో నన్నుచేర్చుకున్నారు మనం ప్రేమించే వారే ఆ ప్రతిపాదన చేసి నువ్వు ఏమంటావో చెప్పు అన్నట్లు చూస్తే ఏం చెప్పగలం? నాకు ఆమోదమే నని వేరే చెప్పాలా? హర్షాతిరేకంతో ఊగిపోయే మన చూపుల్ని బట్టే వారు అర్థం చేసుకోవాలి. ప్రేమోద్వేగంలో అప్పటిదాకా తనలోతాను ప్రవాహంలా మాట్లాడుకున్న మనసే తీరా ఒక సందర్భంలో ఏమీ మాట్లాడలేని స్థితిలో పడిపోతుంది. ఆ స్థితిని ఆ ప్రేమమూర్తి అర్థం చేసుకోవలసిందే.. మాటల ద్వారా వ్యక్తం కాలేని భావాలు మౌనంద్వారానే కదా వ్యక్తమవుతాయి!
ఇప్పుడిక మీ జీవన గమ్యాన్ని నేను, నా జీవన గమ్యం మీరు, ఇంకా తుఫాన్‌లతో నేనెందుకు భయపడాలి? నా తీరంగా మీరు ఉన్నారుగా! ఈ సమయంలో తుఫాన్‌లతో ఎవరైనా నాకు నా జీవన తీరం లభించిందని చెప్పేస్తే బావుండేది.ప్రేమ బాహువుల మధ్య ఒదిగిపోయిన వారికి నిజంగా ఎంతో ధీమా వచ్చేస్తుంది. 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అనే మాట నువ్వు నా జీవన తీరానివి అన్నట్లుగా వినబడుతుంది. ఇద్దరికీ ఆ మాట ఒకేసారి, ఒకేలా వినబడుతుంది. అందుకే ' నీ జీవన తీరాన్ని నేను. నా జీవన తీరాని నువ్వు ' అనే మాటల్ని ఇరువురూ ఒక పారవశ్యంతో చెప్పేసుకుంటారు? అంతే కాదు ఇప్పుడు తూఫాన్లు వచ్చినా ఇక తమనేమీ చేయలేవనే ధీమాతో ఉండిపోతారు.