చెలీ…………………..
నీవు నా చెంత ఉంటే ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా, నీవే లేని వేళ ఈ ప్రపంచాన్ని విడిచిపోతున్నా చెలీ నీ పరిచయం ఎడారిలో నీరులా సునామిలో రేవులా సముద్రం లో నావలా నిశీదిలో దివ్వెలా నాలోని ఎన్నొ ఆశలకు ఆశయాలకు చెయూత నిస్తుంది. నీ ప్రేమ సాగరంలో కాలం అనే సుడిగుండంలో,దిక్కు తొచక గమ్యం మరచి, క్షణ క్షణానికి నా మీదనాకే విశ్వాసం సన్నగిల్లుతున్నవేళ, నువ్వు ఉన్నావనే చిన్ని జ్ఞాపకం నాకు దిక్సూచి. తీరం చేరే వరకైనా నడిపించవా నేస్తమా…కను రెప్పలు వాలి పోతున్నా…కనుపాప నీ రూపాన్నే చూస్తుంది.
గుండె చప్పుడు ఆగిపోతున్నా మనసు మాత్రం నిన్నే అరాధిస్తోంది. … నాలో వేసే ప్రతి ప్రేమ చిగురుకు వసంతానివి నీవే,నాలో కురిసే ప్రతి ఆనందపు చినుకుకి ఋతుపవనానివి నీవే .నీవులేని నాజీవితం తీగ లేని వీణతో సమానం.నాతో ఉంటూ రాగాల్ని పలికిస్తావో,దూరంగా వెళ్ళి మౌనాన్ని మిగిలిస్తావో…..నిర్ణయం నీదే ప్రియా !