ఒంటరిగా వున్నప్పుడు
వినిపించే వింతశబ్దాలు
విరహమో.. వైరాగ్యమో
ఓ వైవిధ్యమైన భావమో
గతం గుర్తొస్తుంది
మనస్సుకు గురిచూసి
కొట్టిన మాటలు
ప్రతిక్షనం గుండెను
కోస్తూనే ఉన్నాయి
అప్పుడే కురుస్తున్న చినుకుల్లా
వంద ఆలోచన్లగా
చిందుతుంది నీ జ్ఞాపకం
ఒక సంఘటనకి
ఎన్ని సంఘర్షణలు
ఎన్ని సందేహాలు...
ఎన్ని సమాధానాలు
వృత్తాకారంలో
తిరుగుతూనే వుంటాయి
అసంతృప్తి నీడల్లోనూ
ఏదోక అలజడి శబ్ధం
మిగిలిపోతూనే వుంటుంది
బహుశా అదేగాబోలు
పగటికీ,రాత్రికీ తేడా చూపేది.
ప్రేమగా మాట్లాడీన
మాటలకు అర్దాలు
ఏమార్చి స్వార్దం
చూసుకొన్ని మనసులు
తెల్సి తెల్సి ఊబిలో
కూరుకపోయినా ..
ఆ మనిషి జ్ఞాపకాలు
వేదిస్తూనే ఉన్నాయి
ఎక్కడున్నావు ఇప్పుడేం
చేస్తున్నావంటు మనస్సును
గుచ్చుతూనే ఉన్నాయి
చీమచిటుక్కుమన్నా
గుర్తొస్తున్న నీ జ్ణాపకం
ఎక్కడున్నావంటూ
మనసును తొలుస్తున్న ప్రశ్నలు
రావని తెల్సి .. రాలేవని చెప్పినా
ఊరుకోని మనస్సు
మనిషిలా బ్రతకొద్దు..
మాటాలు మార్చి ..
మనసులను ఏమారుస్తున్న
ప్రేమలు.. అవకాశవాదిగా మారి
అదోపాతాలానికి తొక్కేస్తున్నాయి
ఎవరిని నమ్మాలి ..
ఎవరిని నమ్మకూడాదో తెలీని పరిస్థితి..
వినిపించే వింతశబ్దాలు
విరహమో.. వైరాగ్యమో
ఓ వైవిధ్యమైన భావమో
గతం గుర్తొస్తుంది
మనస్సుకు గురిచూసి
కొట్టిన మాటలు
ప్రతిక్షనం గుండెను
కోస్తూనే ఉన్నాయి
అప్పుడే కురుస్తున్న చినుకుల్లా
వంద ఆలోచన్లగా
చిందుతుంది నీ జ్ఞాపకం
ఒక సంఘటనకి
ఎన్ని సంఘర్షణలు
ఎన్ని సందేహాలు...
ఎన్ని సమాధానాలు
వృత్తాకారంలో
తిరుగుతూనే వుంటాయి
అసంతృప్తి నీడల్లోనూ
ఏదోక అలజడి శబ్ధం
మిగిలిపోతూనే వుంటుంది
బహుశా అదేగాబోలు
పగటికీ,రాత్రికీ తేడా చూపేది.
ప్రేమగా మాట్లాడీన
మాటలకు అర్దాలు
ఏమార్చి స్వార్దం
చూసుకొన్ని మనసులు
తెల్సి తెల్సి ఊబిలో
కూరుకపోయినా ..
ఆ మనిషి జ్ఞాపకాలు
వేదిస్తూనే ఉన్నాయి
ఎక్కడున్నావు ఇప్పుడేం
చేస్తున్నావంటు మనస్సును
గుచ్చుతూనే ఉన్నాయి
చీమచిటుక్కుమన్నా
గుర్తొస్తున్న నీ జ్ణాపకం
ఎక్కడున్నావంటూ
మనసును తొలుస్తున్న ప్రశ్నలు
రావని తెల్సి .. రాలేవని చెప్పినా
ఊరుకోని మనస్సు
మనిషిలా బ్రతకొద్దు..
మాటాలు మార్చి ..
మనసులను ఏమారుస్తున్న
ప్రేమలు.. అవకాశవాదిగా మారి
అదోపాతాలానికి తొక్కేస్తున్నాయి
ఎవరిని నమ్మాలి ..
ఎవరిని నమ్మకూడాదో తెలీని పరిస్థితి..