వర్షపు చినుకుల
చలిరాతిరి వెలిగించుకున్న
కౌగిళ్ళ నాకివ్వవా
నీలో నన్ను కరిగించి
వేడి నిట్టూర్పుల్లో మరిగించవా
కనురెప్పల ఊసులు
నీ ఎర్రని పెదాలపై నేవేసిన
తడి ఆరని తమకపుముద్రికలు
మరుమల్లెలపై మనం చేసిన బాసలు
ఇచ్చుకున్న మనసులు
మెచ్చుకున్న సొగసులు
మది పిచ్చెక్కించే నీ ఎదపరువాలు
ఆ తీపి గురుతులు నాసొంతం చెయ్యవా
నేనలిగినవేళ నువ్వు నాన్నవై
నేనలిసిన వేళ నువ్వు అమ్మవై
నీ వెచ్చని ఒడే నాకు తలగడై
ఆబంధమే మనఇద్దరి మనుగడై
సేదతీరిన మధుర క్షణాలను ....
నా కివ్వవా ప్రియతమా