నీగురించి చాలా గొప్పగా ఊహించుకున్నా
అలా ఉన్నాయి నీమాటలు
నీగురించి చాలా గొప్పగా తలచుకున్నా
అలా వున్నాయి నీతలపులు
అన్ని నిజం అనేలా ఎంతబాగా నటించావు
అన్ని బ్రమలనే విషయం తెలియకుండా
నటననే వాస్తవంగా ..అచ్చు నిజమైన నిజంలా
చాలా భాగ నటించావు అన్నీ నమ్మా
ఎందుకో పిచ్చి మనస్సు
ఇప్పటికీ నిన్నే నమ్ముతుంది
మనస్సును ఏమార్చావని
అన్ని సాక్ష్యాలు కల్లముందున్నా
ఎవరో గుండెగు ఎదురేగి గురిచూసి గుచ్చినా కూడా
అదే బ్రమలో ఉంది పిచ్చి మనస్సు
నీ నటన ఇంఖా తెల్సుకోలేకపోతుంది
రాత్రుల్లు నిద్రమాని ..
కలత నిద్రతో గడిపిన రాత్రుల్లు నీకోసమా
ప్రతిక్షనం ప్రతినిమిషం
నీజ్ఞాపకాలను తడుముకొన్నా నిజం అనుకొని
ఈరోజు కాని తెలియలేదు నీవు మనిషివని ... ఇప్పటిదాకా
నాగుండెలో , నిన్ను మనిషిగా చూడలే
నిన్నో దేవతగా హృదయంలో కొలిచా
బంగపడ్డ ప్రతిసారి ..
పోనీలే అని మనసుకు సర్ది చెప్పుకున్నా
కాని ఈరోజు నీవు మనిషిలా చేసే సరికి
నమ్మలా కాని నమ్మక తప్పలా
నీవిలా చేస్తావని కనీసంకూడా ఊహించలేదు
నిజం కదూ నీవు మనిషివికదూ
నీవు ఎందుకు పరిచయం అయ్యావాని
నిజంగా ఈరోజు భాద పడుతున్నా
నిజంగా చాలా చాలా భాదపడుతున్నా
అసలెందుకు పరిచయం అయ్యావు
నాలో లేని ఆశలు రేపావు ఎందుకని
నీకూ నాకూ మఆద్యి లేది దాపరికాలు లేవు
అంతలా గుండెళ్ళో చేరి గురి చూసి కొట్టావు
అన్ని నిజాలే అన్నట్టు ఎంత తియ్యగా చెప్పావు
నీకూ నాకూ మద్యి చిన్న పొరకూడా లేనంతగా
ఉన్నాం.. అవన్ని టైపాస్ కోసం చేసావా
ఏవీ నిజాలు కావా..బలే నమ్మిచావు కదా