1) నీకై వేచిన ప్రతి క్షణం నన్ను నేను తడుముకుంటూన్నాను
నీలో ఉన్నది కూడా నేనేనా నాలో ఉన్నది నీవేనా అనే నిజం చెప్పవూ
2) నీలొ నన్ను వెతుక్కుంటూ ఒంటరైన ఈ క్షణం
నాకై ఒక్క క్షణం కూడా వెచ్చించలేని నీ ప్రేమకోసం ఏదురు చూస్తున్నా
3) నీవు నాతో లేవనే బరువైన నిజం..బాదగా నన్ను దహిస్తూ ఉంటే
నీతో మాట్లాడిన ఆ తీపి జ్ఞాపకాలు నేనున్నానంటూ ఊరిస్తూ ఉంటుంది ఎందుకో
4) ఎందుకీవేళ నా మది లోతుల్లో ఇంత కలవరం
ఏదో పోగొట్టుకున్నట్టు గుండెలు పిండుతున్న పాత జ్ఞాపకాలు
5) నన్ను వదిలిన గత జ్ఞాపకం నీకోసం వెతుకుతోంది
రేపు తలవని మనో వేదనన నీవెక్కడా అంటూ ప్రశ్నిస్తూనే ఉంది
6) అసంతృప్తి నీడల్లో ఎక్కడో గుండెల్లో జడుల నిశ్శబ్ధం
మిగిలిపోతూనే వుంటుంది బహుశా అదేగాబోలు పగటికీ రాత్రికీ తేడా చూపేది.
7) ఎన్ని సంఘర్షణలు ఎన్ని సందేహాలు ఎన్ని సమాధానాలు
వృత్తాకారంలో తిరుగుతూనే వుంటాయి అసంతృప్తి నీడల్లో నిప్పై మండుతూ
8) అప్పుడే కురుస్తున్న చినుకుల్లా వంద ఆలోచన్లగా చిందుతుంది నీ జ్ఞాపకం
9) గుండెలో బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు ఆర్తనాదం ఎవరికోసమో ఆక్రోసిస్తుంది
10) మనమద్యి చేరని పదాలు ఘనీభవించి
గొంతు లోతుల్లో పదాలు వెదుకుతూ ఒంటరిగా మిగిలిపోతాయి
11) గళ్ళు గళ్ళు మని మ్రోగిన గజ్జేల గాత్రాలన్ని
తెగిపడిన మువ్వల్లా మౌనంగా మిగిలిపోయాయి ఎందుకో
12) గడచిన క్షణం ఏం అయింది నాలో?
ఈ క్షణం? ఏమీ లేదు అంతా శూన్యం నాలో నేను లేను కదా....?
13) కలలు నిజమయ్యే వేళ రాలేదని
కను రెప్పల కౌగిలిని కనుపాపలకి దూరం చెయ్యకు నేస్తం
14) నిజాన్ని నమ్మలేకున్నా నాలో నేను కుమిలిపోతున్నా
నీవు పలుకకపోతే నీ మౌనాన్నే నా హృదయం నిండా నింపుకుని ఓర్చుకుంటాను
15) గమ్యం తెలియని గతాలు..ఎటు చూసినా దాటలేని అగాధాలు
16) నా మనసు రోదిస్తూ జ్ఞాపకం గాలితో తిరుగాడుతుంది
నింగిలో దూరంగా అలుముకున్న చీకటిలో నీవున్నావని తదేకంగా చూస్తూన్నా
17) చీకట్లో ఎమీ కాన రావడం లేదు.
నువ్వు ఎక్కడున్నావో అని మథనపడుతున్నాను.
18) నిజాలు నిస్సిగ్గుగా రంగులు మార్చుకొని స్వార్దపు బూడిద పూసుకొంటున్నాయి
19) అవమానాలు పడలేక అయోమయంలో అవస్థలు
పడేకన్నా కారే కన్నీళ్ళలో కలిసి కొట్టుకుపోవడమే సుఖమనిపిస్తుంది.
20) నిజాలన్ని కుప్పకూలి అబద్దాలుగా మారిన క్షనాన
గుండె చప్పుడులో జీవంపోయి నిర్జీవంగా మారుతుంది
21) నిజం దాగున్నప్పుడు ముందుకొచ్చిన మౌనంలో మనస్సు మదన పడుతుంది
22) అప్పుడే కురుస్తున్న చినుకుల్లా వంద ఆలోచన్లగా చిందుతుంది నీ జ్ఞాపకం
23) మేఘాలు మాత్రం ఎన్ని రహస్యాలు మోసుకెళ్ళగలవు
ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట నిజాలన్నీటిని కురవక తప్పదు..
24) కొన్ని ఏకాంతాలు అద్భుతంగా తోస్తాయి
కొన్ని జ్ఞాపకాలు ఆకస్మికం గా దాడి చేసి గాయాలు చేస్తూనే ఉంటాయి
25) నీవు బంధించిన భావానికి పదాలు పేరిస్తే అర్దాలన్నీ అపార్దాలై పొడుస్తున్నాయి
26) నీకూ నాకూ మధ్య నిశ్శబ్ధం లాంటి ఓపొర అగ్నిగామారి తగలబెడుతూనే ఉంది
27) ప్రతిరాత్రి నా నిద్రపై పెత్తనం చేస్తున్న నీ జ్ఞాపకం నన్ను వేదిస్తూనే ఉంది
28) కనిపించని కారనం సమాధానపడని ఓ నగ్నజ్ఞాపకం గుండెని సర్రున కోస్తూనే ఉంది
29) తడి ఆరని జ్ఞాపకాలు తరుముతూనే వుంటాయి ప్రతిక్షనం
30) ఏదో తెలియని శక్తి నాలోని నిర్లిప్తతని బెదిరించి నను బయటకు లాగి చంపేసింది
31) నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు ఎందుకో చెప్పవూ..?
32) గుండె చీల్చుకొని నేను పేట్టే ఆక్రందన నిశ్శబ్దంలో కల్సి కన్నీరు పెడుతున్నాయి
33) నీ ఆలోచనలు నన్ను వెక్కిరిస్తుంటే నాలోకి నేను చూసుకోటానికే భయపడుతున్నా.
34) ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో నా తనువంతా కన్నీటితో తడిచిపోయింది
35) నీ జ్ఞాపకాల చిత్తడి లో వెలసిపోయిన విలువలేని రంగుగా మార్చవెందుకనో..?
36) వేల నిముషాల ప్రయాసలో నీకు నాకు మధ్య బంధానికి బలే మీనింగ్ చెప్పావు గా
37) నీ ఆలోచనలు మనసంతా ఉక్కిరిబిక్కిరిగా చేసి ఊపిరాడకుండా చేస్తుంది ప్రతిక్షనం
38) నీ జ్ఞాపకాల రాపిడికి కరిగిపోయి మన మధ్య దూరం అందుకోలేనంతగా పెరికిపోయింది
39) ఎందికీవేల ఈ అలజడి వేడిగాలి తుప్పర్లు జల్లు కురిసినట్టు నా మనస్సులో ఆందోళన
40) దూరం....మోయలేని భారం..నిన్ను మరిచే మంత్రం ఏదైనా ఉందా కాస్త చెప్పవూ
41) పెనం మీద పడ్డ నీటిబొట్లలా నా ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేసావు నీకిది న్యాయమా
42) నా ఆలోచనలన్నీ ఏ వైపుకు మరల్చిన..అయస్కాంతంలా నీవైపుకు లాగేస్తావ్
43) నువులేని రేపటిని తలచలేక నేటిని మరచి నిన్నల్లోనే నిదురోతున్నది మౌనం
44) కలలైనా కన్నీరైనా నీవల్లనే....కలలైనా కన్నీరైనా నీవల్లనే
45) నిజం నీరుకారిపోయినప్పుడు.. అబద్దపు మంటలు ఆకాశాన్నంటవు మరీ
46) అప్పటిదాకా నాతో మాట్లాడి ...ఎవరండీ మీరంటే ఏమని చెప్పను నా అడ్రస్
47) ఎదురొస్తున్నావనుకున్నా కాని ఎదురు తిరుగుతావని ఊహించలేదు
48) నీవు చెబుతున్నవన్నీ నమ్మా .....చివరిలో నేనేం చెప్పలేదే అంటే ఏం చెప్పను..?
49) నా పక్కనున్నావని దైర్యంగా నేనుంటే..
తిరిగిచూసేసరికి మరొకరి కౌగిలిలో నీవు ఇది నిజమా...?
50) ఓయి అది నా "గుండెరా".. ఫుట్ బాల్ కాదు ప్లీజ్
51) వందేళ్ళ జీవితాన్ని ..ఒక్కనిమిషంలో తేల్చేశావు..నీవు చాలా గ్రేట్
52) ఎవరని అడిగితే ఏమని చెప్పను .. నీవు మర్చిపోయిన నిజాన్ని అని
53 ) గురి చూసికొడుతున్నావని సంతోషపడ్డా
నా గుండెకు గాయం అయ్యాక అసలు నిజం తెల్సింది..
54) నా మదిలో నీవున్నావులే అనుకున్నా ..
ఆమదిగోడలు కూలుస్తున్నది నీవని తెల్సుకోలేకపోయా
55) నిజం అనుకొని అబద్దాల ఊబిలో చిక్కుకపోయాని లేటగా తెల్సుకున్నా
56) కదిలే కాలాన్ని అక్షరాల గోడలతో అడ్డుకోగలమా...?
57) జ్ఞాపకానికి జ్ఞాపకానికీ మద్యి దూరం ..జీవితకాలమా...?
58) వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ తన్నుకొస్తున్న కనబడని నా కన్నీళ్ళు
59) జ్ఞాపకాలకి, నిజాలకి మద్య ఘర్షన
నిన్నటికి, నేటికి మద్య పొంతనలేని ఘటనలు
60) కనులముందు కరిగిపోతున్న కాలం
మనసులో నిండిపోతున్నకారనాల కన్నీళ్ళు
61) నీ జ్ఞాపకాలు విరహమై నను వేదిస్తున్నా.
దూరమైన నిన్ను ప్రతిక్షనం గమనిస్తునే ఉన్నా
62) ప్రేమ పంచన చేసి నిజమని నమ్మించి
కరిగిన గుండెలో తడిసిన కంటిలో ఓర్చుకోలేని వేదన మిగిల్చింది
63) అందరూ మంచివాళ్ళే
ఎవరిస్వార్దం వాళ్లది ఎవరి ప్రేమ వాళ్ళది మద్యలో "Who am I "
64) విధి విసిరిన వేగానికి మనస్సు రెక్కలిరిగి
బ్రతుకుబారంగా గడిపేయ్యాలని లేదు..గతం నన్ను కాల్చేస్తోంది
65) మనసును అనరాని మాటలతో తూట్లు పొడిచావు
రక్తం అక్షరాలుగా మారి ఇలాంటి భావాలే కవితలై కన్నీరు పెడుతున్నాయి
66) మానిన గాయాల్ని రేపడం నీకలవాటని నాకు తెలియదు
నీవన్న ప్రతి అక్షరం నమ్మి ప్రతిక్షనం నాలో నేను నలిగిపోతూనే ఉన్నా
67) గతాన్ని గుండె లోతుల్లో సమాధి చేసి మనసు గోడలను పగులగొట్టీ
తడి కళ్ళతోలో జారిపోతున్న గతాన్ని వదలి..శిదిలమైన శరీరాన్ని వదిలేస్తున్నా ప్రియా
68) నిన్ను నా ఊహల్లో నింపి నేనోడి నిన్ను గెలిపిస్తున్నాను
నీ బాటన ఓడిన నా ప్రేమ గులాబీలు పరుస్తున్నా నీకాళ్ళు కందిపోకూడదని
69) గుండెలు పగిలి, మనసు విరిగిపోయి మతి చెలించి
నోరు తడారిన తరుణంలో అయినా నా మూగ ప్రేమను అర్దం చేసుకోవా
70) జారే కన్నీటి ధారల్లో నిజాలున్నాయి
అందుకేకాబోలు అవి చెక్కిల్లలై చారికలుగా మిగిలిపోయాయి
71) నా గుండె లోని గాయాలు పచ్చిగా ఉండి
నా మనస్సు ఎప్పుడూ భాదపడితేగాని కొందరి కసి తీరేట్టుగా లేదు
72) నిండిన కళ్ళు, తడి చెక్కిళ్ళు గద్గదమయిన స్వరమూ
ఈ తడీఅరిన గొంతుకతో పలుకలేని మాటలు ఇవన్నీ నీవదలిన జ్ఞాపకాలేగా..?
73) అసలు వాస్తం కర్సైంది..నిజం నీరుగారి పోయినా
నిన్ను చేరే ఘడియల కోసం నా ఉపిరి దారంతో కాలాన్ని కొలుస్తున్నాను
74) ఎక్కడో నువ్వున్నవనే వెర్రి ఆశతో
నా ఉనికిని గుండె గా మార్చి సడి నీకు వినిపించాలని చూస్తున్నా
75) నా మనస్సు పరిగెత్తుతూనే ఉంటుంది గమ్యింలేదని తెల్సికూడా
నువ్వున్న చోటుకి చేరుకోలేనని తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను
76) భగ భగ మని గుండె వేదన సాక్షిగా
నా కన్ను ఉప్పునీటి ఏరై ఆగకుండా ఉప్పొంగుతుంది
77) నామనసు ప్రతిబింబంలో నీవు వేయి సార్లు జవున్మిస్తావు
నను కాదని నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తూనే ఉన్నాను
78) తెల్సుకోలేకపోయావు నేనేంటో నాలో నువ్వెంతో
గుట్టు చప్పుడు కాకుండా మ్రోగే నా గుండె లోని ప్రేమను అవమానించావు
79) పెదవి మాటన దాగి ఆగిపోయిన మాటల ప్రవాహం
ఉప్పు జలపాతాలయిన కన్నులు నిజాన్ని దాచలేకపోయాయి
80) వెల్లండి వెల్లండి నా కలలకి రెక్కలు కట్టాలి,
వాటికి వాస్తవాల లనే బ్రమలు తగిలించి కాస్త నిద్రపోవడానికి ట్రై చేయాలి
81) నాలో నీ జ్ఞాపకాలు భస్మం కావటానికి,
నా గుండెలో అవమానమనే మంటలు రగిలించావా
82) స్పందనలేని కాలాన్ని కదల్చటానికి,
కాల్పనలు కరువై నిజాలనీడలు నన్ను ప్రశ్నిస్తున్నాయి
83) ఎప్పుడో నీకోసం చనిపోయిన నేను
నీశ్వలో నాశ్వసగా మిగిలిపోతున్నా నీకు తెల్సా..?
84) పారిపోయిన గతానివి నీవనుకున్నా
మారిపోయిన నేస్తాని వై మృత్యువుగా మారావెందుకనో..?
85) ఎందుకీ మౌనం ,ఏల ఈ తిరస్కారం?
ఏంటీ చీత్కారం?..ఎందుకీ దైన్యం, ఏది పరిష్కారం?
86) ఘనీభవించిన కాలాన్ని కరిగించకు
ఆ కాలమే నాచితికి పెట్టే కట్టెలైపోయాగా ఇప్పుడు
87) ఒకప్పుడు నా మనసు మళ్ళియ అన్నావు
ఇప్పుడు మనస్సు నరాలను పట్టిలాగి చంపాలని చూస్తున్నావు..
88) మనస్సు రోదనలో తెగిపడుతున్న నరాలు
వేదనతో వెర్రిగా అరుస్తున్న ఆలాపనలు నీదరి చేరలేదా.?
89) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా
90) నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం
నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం అన్ని జన్మలకు
91) ప్రతి రొజు నిజాన్ని కన్నీటి పొరలతొ కప్పుతుంది జ్ఞాపకం
నేను ఊహించిన అద్బుతమైన నిజాలన్నీ అవిరౌతున్నాఎందుకో ..?
92) గుండెకు గుచ్చుకున్న తన జ్ఞాపకాల మువ్వలతొ...
తన జీవితం మీద తానే నిద్రపొయింది ఏం చేయాలో తెలీక
93) మరు మల్లెపూల ఫానుపు మీద పడుకునే నీకేం తెలుసు...
నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి నిద్ర లేని చీకట్ల గురించి
94) నిన్ను నువ్వే బంధించుకొని...అవే నిజాలనుకొన్న క్షనంలో
కన్నీటి రూపంలొనిజాలన్నీ నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నాయి
95) నీ మౌనంతో కాలిపోతున్న నా మది చితి ఇంకా ఆరక ముందే
నన్ను నీ నుంచి నీ జ్ఞాపకాల నుంచి వేరుచేయడం ఏలా సాధ్యం అనుకొంటున్నావు
96) నీవు నన్ను పట్టించుకోనప్పుడు....
నిశ్శబ్దాన్ని గుండెలమీదేసుకుని జోకోట్టిన ఏకాంతాలెన్నో.
97) నీ సమక్షంలో ఒక్క క్షణం గడిస్తే చాలు
నీ కనురెప్పల చాటున చేరి ఓ స్వప్నం లిఖించడానికి
98) ఏం చేయను మౌనమై పోవడం తప్ప
కానరానని తెల్సి నీ కళ్ళల్లో నన్ను వెతుక్కోవడం తప్ప
99) ఎవరన్నారు నేను ఫ్రేమలో ఓడిపోయానని..
నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఘోరంగా ఓడి నన్ను వీడిపోయావు
100) గాయం మానలేదనుకుంటే మరో గాయానికి గురి చేస్తున్నావు..
పొరపాటుగా చేస్తున్నావో అలవాటు గా చేస్తున్నావో అర్దంకావడం లేదు