మనస్సు బద్దలయితే
ఆ ముక్కలేరుకోవడంలోనే
ఒక్కోసారి నిజాలు
దాగున్నాయనిపిస్తుంది
మరువలేని మాటలవెనుక
నిజం దాగున్నప్పుడు
ముందుకొచ్చిన మౌనంలో
మనస్సు మదన పడుతుంది
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది...
స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే
ఎందుకో సుఖమనిపిస్తుంది..
నిజాలను అర్దం
చేసుకోవాల్సిన మనసులు
దూరం అయినప్పుడు
నిట్టనిలువునా
అగ్నిలో దహించుకపోవడం
మేలనిపిస్తుంది
గుండె చప్పుడులో జీవంలేక
ఏ నవ్వు వెనకా మమత లేక
నిజాలన్ని కుప్పకూలి
అబద్దాలుగా మారిన క్షనాన
ఆశా సౌధాలు చేజారి
అవమానాలు పడలేక
అయోమయంలో
అవస్థలు పడేకన్నా
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే..
సుఖమనిపిస్తుంది.
ఇది నిజం..
ఆ వేదన ఏరులై పారనీ..
జరిగిన గతమంతా
ఆ కన్నీటిలో కొట్టుకపోనీ
నిజాలు నిస్సిగ్గుగా..
రంగులు మార్చుకొని
స్వార్దపు బూడిద పూసుకొని
అన్నీ తెల్సి ఎదుటి మనిషి
మనస్సు ముక్కలు చేస్తూ
పొందే ఆనందం ఎంతకాలం ఉంటుంది
నిజాలు తెల్సుకున్న క్షనాన పోయిన ప్రాణం తిరిగొస్తుందా
ఆ ముక్కలేరుకోవడంలోనే
ఒక్కోసారి నిజాలు
దాగున్నాయనిపిస్తుంది
మరువలేని మాటలవెనుక
నిజం దాగున్నప్పుడు
ముందుకొచ్చిన మౌనంలో
మనస్సు మదన పడుతుంది
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది...
స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే
ఎందుకో సుఖమనిపిస్తుంది..
నిజాలను అర్దం
చేసుకోవాల్సిన మనసులు
దూరం అయినప్పుడు
నిట్టనిలువునా
అగ్నిలో దహించుకపోవడం
మేలనిపిస్తుంది
గుండె చప్పుడులో జీవంలేక
ఏ నవ్వు వెనకా మమత లేక
నిజాలన్ని కుప్పకూలి
అబద్దాలుగా మారిన క్షనాన
ఆశా సౌధాలు చేజారి
అవమానాలు పడలేక
అయోమయంలో
అవస్థలు పడేకన్నా
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే..
సుఖమనిపిస్తుంది.
ఇది నిజం..
ఆ వేదన ఏరులై పారనీ..
జరిగిన గతమంతా
ఆ కన్నీటిలో కొట్టుకపోనీ
నిజాలు నిస్సిగ్గుగా..
రంగులు మార్చుకొని
స్వార్దపు బూడిద పూసుకొని
అన్నీ తెల్సి ఎదుటి మనిషి
మనస్సు ముక్కలు చేస్తూ
పొందే ఆనందం ఎంతకాలం ఉంటుంది
నిజాలు తెల్సుకున్న క్షనాన పోయిన ప్రాణం తిరిగొస్తుందా