నేను నడుస్తుంటే వెనకగా నా అడుగులో అడుగు వేస్తూ వస్తానంటావా? వద్దు
మిత్రమా, వద్దు. నేను నీ గమనాన్ని నిర్దేశించలేను. నాకంటే ముందు
నడుస్తానంటావా? అయినా నేను నిన్ను అనుసరించలేను. కాబట్టి పక్కపక్కనే
నడుస్తూ కలిసికట్టుగా జీవనయానాన్ని కొనసాగిద్దాం. జీవితాంతం స్నేహంతో
మసలుకుందాం. చూశావా, మిత్రమా! ఇదే స్నేహమంటే!''"మనిద్దరికీ ఒకరిపై ఒకరికి
గౌరవం, నమ్మకం సడలనంత కాలం స్నేహం నెలకొనే ఉంటుంది. ఈ రెండంశలూ మన జీవితాలు
కడతేరే వరకూ ఒకదాన్ని వెన్నంటి మరొకటి ఉండాలి మిత్రమా! "మిత్రమా!
ప్రాపంచిక వివరణకు మన స్నేహాన్ని దూరంగా ఉంచుదాం. బడి పాఠాలలో స్నేహధర్మం
గురించి బోధించారో లేదో? బోధించినా మనం అందుకోలేక పోయామేమో! కనీసం బతుకు
బాటలోనైనా స్నేహానికి అర్థాన్ని నేర్చుకోలేకపోతే, జీవితంలో మనమేమీ
నేర్చుకోనట్టే కదా మిత్రమా!''
స్నేహితుల మధ్య మౌనమే నిజమైన భాషణం. చెప్పినదాని కంటే చెప్పనిదే భూషణం. అంటే మనసు విప్పిన మౌనానికే భావనా బలం అధికమన్న మాట. దాన్ని 'మౌన ప్రతిజ్ఞ' అనవచ్చు. పై సంభాషణలన్నీ మౌన ప్రజ్ఞలోని స్నేహ సంపదలే. ఆనందాశ్రువులతో సంబరపడుతున్నా, దుఃఖాశ్రువులతో కుంగిపోతున్నా, స్నేహితుడు మన వెంటే ఉన్నాడన్న భావన గాఢమవుతుంటే, అదొక ఆనందం. "నిన్ను నిన్నుగా తెలిసినవాడు, నువ్వేమిటో తెలిసినవాడు, ఏం కాగలవో తెలిసినవాడు, అయినా వీటన్నిటికీ సాక్షిగా ఉంటూ నీ ఎదుగుదలను కాంక్షించేవాడు స్నేహితుడు'' అన్న విలియమ్ షేక్‌స్పియర్ మాటలు వర్తమాన వాస్తవాలనిపిస్తుంటాయి. అవును. స్నేహితుడు ఎప్పటికీ మంచి అద్దం లాంటివాడే. ఆ స్నేహంలో మనం స్పష్టంగా ప్రతిబింబిస్తూనే ఉంటాం, ప్రత్యక్షమవుతూనే ఉంటాం. మంచి స్నేహితుడు ఒక ప్రపంచంతో సమానం. స్నేహితుడు మన జీవితంలోకి ప్రవేశించే వరకూ అటువంటి ప్రపంచం ఒకటి ఉందని కూడా తెలియదు. కలయికలోనే ఆ ప్రపంచం రూపుదిద్దుకుంటుంది. మన స్వభావానికి ఆ లోకం ఎంత సామీప్యంగా ఉందో అర్థమవు తుంది. పాలూ నీళ్లలా కలిసిపోయి, స్నేహాని కి ఆత్మీయతను జోడిస్తూ, మన స్పేస్‌లో మనం ఉంటూ, స్నేహితుడి నుంచి ఎటు వంటి ప్రతిఫలాన్నీ ఆశించం. పైగా మిత్రుడి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ జీవిత పర్యంతం స్నేహబంధం కొనసాగాలని తపిస్తుంటాం.
పదహారేళ్ల ప్రాయమంటే రంగు రంగుల పూలతోటలో విహరించడమే. ప్రతి పువ్వూ అందంగానే కనిపిస్తుంటుంది. ఎంత మంది స్నేహితులుంటే అంత గొప్పని అంతా అనుకుంటారే తప్ప, "అందరూ స్నేహితులైతే ఏ ఒక్కడూ స్నేహితుడు కానట్టే'' అని అరిస్టాటిల్ చెప్పిన మాటలు మాత్రం గుర్తుకు రావు. శారీరకంగా పరిణతి, పరిపక్వత సాధించినంత మాత్రాన, పదహారేళ్ల వయసులో మానసికంగా కూడా పరిపక్కత సాధిస్తారనుకుంటే పొరపాటే. అందుకే తడబాట్లు, పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. తడబాట్లు, పొరపాట్లు అని ఎందుకు అనుకోవాల్సి వస్తోందంటే, టీనేజ్ స్నేహానికి బాయ్ ఫ్రెండ్, గర్ట్ ఫ్రెండ్ అన్న ట్యాగ్ ఇట్టే సరిపోతుంటుంది. పదహారేళ్ల వయసులో స్నేహాన్ని ఉంటున్నామన్న చింత కూడా తగ్గుతుంది. ఒత్తిడీ తగ్గుతుంది. మనసు మెచ్చిన స్నేహం మనల్ని సంఘటితపరుస్తూనే ఉంటుంది. జీవితంలో ఆటుపోట్లు సహజమే. అయినా, మనల్ని వదలక, మనల్ని మనకు అందించేది స్నేహమే.
నిజాయితీగా ఉండే స్నేహం.. నిబ్బరంగా దైర్యం చెప్పేస్నేహాలు ఇప్పుడున్నాయా..అంతా నటనే..నచ్చినమనిషి భాదపడితే తట్టుకోలేనిదే స్నేహం మరి అదే మనిషి మరొకరి వంచన చేరి భాదపెడితే దాన్నీ స్నేహం అంటారా..నీవు నమ్మిన స్నేహం పై చెప్పుడు మాటలు వింటూ స్నేహాన్నీ అవమానిస్తున్న క్షనంలో నిజాలు ఎందుకు గుర్తుకురావు.వాస్తవాలు అర్ద చేసుకున్న అప్పటీ నీ మనస్సు ఏమైంది... చచ్చుబడీపోయిందా..చచ్చిపోయిందా.. మరో మనిషి ఎదురుగా అవమానించి అతన్ని సపోర్టు చేస్తూ స్నేహాన్ని ఎవడో వేష్టుగాడు ప్రశ్నించిన క్షనాల్లో మనసు పడే భాద ఆమనస్సు ఎంత రంపపు కోతకు గురైపోతుందో తెల్సా..నిజమే అన్నీ నీకు తెల్సు తెల్సే చేస్తున్న నీస్నేహాన్ని ఏమని ప్రశ్నించను ..."స్నేహం" అనే రెండు పదాల్లొ కొత్త అర్దాలు .. అపార్దల్లొ అవమానించిన నీవు మనస్సాక్షి అనేది లేకుండా ఎలా వున్నావు.. నీవు నీవేనా .. అప్పటి నీకు ఇప్పటి నీకు ఎంత వత్యాసం ..ఎందుకీ మార్పు..ఎవరికోసం .. మనిషిని మనస్సును వేదిస్తే నికేం వస్తుంది నీవేం సాదించావు పొగడ్తలు మనసుకు ఆయువునీయ్యవు.. స్వచ్చమైన స్నేహమే అన్నిటీకీ కాని నీవు నీవుగా ఎందుకు కోల్పోయావు కోల్పోతున్నావు అర్దం అవ్వడం లేదు అర్దం చేసుకునేంత గొప్ప మనస్సు నాకు లేదేమో ..ఎదురు పడ్డ ప్రతిసారి అవమానమే ఎదురౌతుంటే సమాదానం లేని ప్రశ్నలు గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి...నీపరిచయం నాకు మిగిల్చిన వేదన.. ఇది చేసి నీవేం సాదించావో తెలీదు