. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 13, 2013

ప్రేమకు ఆరంభమే ఉంటుంది తప్ప అంతం ఉండదు ( ఓడిపోయిన ప్రేమ పై నా విష్లేషన)

ప్రేమకు ఆరంభమే ఉంటుంది తప్ప అంతం ఉండదు. అందుకే మా శరీరాలకే గానీ, కాల పరిమితి ప్రేమలకు లేదంటారు ప్రేమికులు. ఆ కారణంగానే తమ మరణానంతరం కూడా తాము ప్రేమించిన వారి పట్ల ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని బలంగా నమ్ముతాను. అంతే కాదు. భగవంతుడే వచ్చి నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాను. ఇక నీ ప్రియురాలును మరిచిపో అంటే 'నా ప్రియురాలే లేని స్వర్గం నాకెందుకు? ఆ స్వర్గానికి  బదులుగా నా ప్రియురాలిని నాకు ఇవ్వు చాలు' అంటారు. నిజానికి అసలు భావోద్వేగాలకు భౌతిక రూపాలే ఉండవు. భౌతికం కాని వాటికి జీవిత కాలం, ఓ కాల పరిమితి అంటూ ఏముంటాయి? ప్రేమే కావచ్చు. మరొకటి కావచ్చు. భౌతికం కానివి ఏవైనా అనంత కాలం ఉంటాయి. ఈప్రేమికుడు అనేదీ అదే. దేహం భౌతిక మైనది కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోతుంది. కానీ, ఈ అభౌతికమైన, ఆత్మగతమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అంటాడా ప్రేమికుడు.ఉద్వేగము బావోద్వేగాల మద్యి జరిగే  సంఘర్షన ..హృదయంలో జరిగే రాపిడికి రాలే కన్నీటి బొట్లవిలువ తెల్సుకోవడం ఎవరి తరమో.. మనసెరిగిన మనిషికే తెలుస్తుంది

జమానా తో కర్‌వట్ బదల్‌తా రహేగా
నయీ జిందగీ కే తరానే బనేంగే
మిటేగీ న లేకిన్ ముహబ్బత్ హమారీ
మిటానే కే సౌ సౌ బహానే బనేంగే
హకీకత్ హమేశా, హకీకత్ రహేంగీ
కభీ భీ న ఇస్‌కా బహానా బనేగా / మేరా ప్యార్/
(లోకానిదేముంది ఎప్పటికప్పుడు పరదాలు మారుస్తూనే ఉంటుంది. ఏ రోజుకారాజు కొత్త కొత్త రాగాలు సిద్ధమవుతూనే ఉంటాయి. కానీ, ఎవరొచ్చి తుడిచేసే వందలాది ప్రయత్నాలు ఎన్ని చేసినా మా ప్రేమ ఎప్పటికీ మాసిపోదు. సత్యం ఎప్పుడూ సత్యమే. దాన్ని రూపుమాపే కుయత్నాలేవీ చెల్లవు.)


ప్రేమపుట్టింది మొదలు దాన్ని చెరపడానికి ఎన్నో శక్తులు అడ్డు పడుతుంటాయి..మనల్ని అశక్తుల్ని చేసి ఆడుకుంటాయి.. ఎన్నొచ్చినా నిబ్బరంగా ప్రేమను నమ్మినప్పుడే ఆ ప్రేమ శాశ్వితంగా నిలచి పోతుంది... ఎవరో చెప్పుడు మాటలు విని ప్రేమనే అవమానిస్తే మిగిలేది వంటరితనమే...నిజానికి  అబద్దానికి తేడా తెల్సుకోలేకపోయావంటే  నీలో అబద్దపు నీలి నీడలు య్శాశిస్తున్నాయన్నమాటేగా..నమ్మని ప్రేమకు ద్రోహం చేస్తూ అవమానిస్తున్న ప్రియురాలు చేస్తున్న వింతవాదనలు గుండెకు చిల్లులు  పెడుతూనే ఉంటాయి చిరకాలం నిలచి ఉండాల్సిన ప్రేమకు చిరుగులు మొదలైనట్టే కదా...మన అనుకున్న ప్రియురాలు మరొకరి బాహుబందాల్లో చేరి మనల్ని అవమానించడం  వాడీతో అనరాని మాటలు అనిపించడం అంటే ఆ భాద అనుభవించినోడికే తేలుస్తుంది  కొందరికి జీవితం అన్నా జీవితంలో తారసపడ్డ మనుషులన్నా .. నిజాతీ గల ప్రేమ అన్న చులకన ...వాళ్ళు చేసిందే నిజం చెప్పిందే వాస్తవం ఎదుటి మనిషి తానిష్ట పడ్ద మనిషి అయినా లెక్కలేని తనం మొండీ వితండవాదన నిన్ను నమ్మిన మనిషి ఒకప్పుడు తాను ప్రేమించిన వ్యక్తి అయినా తాను ప్రానంగా ఇష్ట పడ్ద వ్యక్తీయినా  లెక్కచేయదు ఆ ప్రేయసి జీవితంలో అల్లకల్లోలం రేపుతుంది ప్రేమను లైట్ తీసుకునే మనుషులు ఎందుకు షడన్ గా మారతారో అర్దంకాదు .. 

తుమ్హే ఛీన్ లే మేరీ బాహోఁ సే కోయీ
మేరా ప్యార్ యూఁ బేసహారా నహీఁ హై
తుమ్హారీ బదన్ చాంద్‌నీ ఆకే ఛూలే
మేరే దిల్‌కో యే భీ గఁవారా నహీఁ హై
ఖుదా భీ ఆగర్ ఆకే తుఝకో మిలే తో
తుమ్హారీ కసమ్ హైఁ మేరా దిల్ జలేగా / మేరా ప్యార్/
( నా బాహువుల్లోంచి ఎవరో వచ్చి బలత్కారంగా నిన్ను తీసుకుపోవడానికి నా ప్రేమ అంత నిస్సహాయమైనదేమీ కాదు నీ తనువును వె న్నెలే వచ్చి తాకినా నా హృదయానికి అది భరించరాని విషయమే అవుతుంది. మనిషి మాటెందుకు? దేవుడే దిగి వచ్చి నిన్ను కలుసుకున్నా నీ మీద ఒట్టు. నా మనసు మండిపోతుంది)

                                  కాలం నిరంతరం మారుతూ ఉంటుంది. కాలంతో పాటు లోకమూ మారుతూ వెళుతుంది. అవసరాలకు, పెరుతుతున్న ఆశలకు ఆనుగుణంగా ప్రపంచంలోని పలు విషయాలు నిత్యం మారుతూ వెళుతూ ఉంటాయి. ఆ క్రమంలో అప్పటిదాకా ఆలపించిన వాటికి భిన్నంగా ఒక్కోసారి పూర్తి విరుద్ధంగా కూడా అది కొంగొత్త రాగాలు ఆలపిస్తుంది. లోకం విషయం ఏమైనా కావచ్చు. అది ఎన్ని రకాలుగానైనా మారవచ్చు. ప్రేమ విషయంలో అవేవీ జరగవు. ప్రేమ ఒక పరమ సత్యం. సత్యం మారడం ఉండదు కదా!. ఎవరెన్ని ఎత్తులు వేసినా దాని తుడిచేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. భౌతిక రూపాలలకు నిరంతరం రూపాంతరం చెందడం ఒక సహజలక్షణం. కానీ, ఆత్మల పరిస్థితి అది కాదు. భౌతిక ప్రపంచానికి ఈ ఆత్మలోకం పూర్తిగా భిన్నమైనది. ఆ భిన్నత్వమే ఆ ప్రేమను ఆ ప్రేమించే ఆత్మలను అమరం చేస్తుంది.

                                           ప్రేమికులు దేనికైనా భయపడుతున్నారూ అంటే ఇంకా ఆ ప్రేమ అసమగ్రంగా ఉందనే అర్థం. సంపూర్ణమైన, సర్వసమగ్రమైన ప్రేమ దేనికీ భయపడదు. అందుకే, పరిపూర్ణంగా ప్రేమించిన ఒక ప్రియుడు తన ప్రియురాలిని ఎవరో వచ్చి తనకు దూరంగా పొదివి పట్టుకొని  తీసుకు వెళుతుంటే ఏ ప్రేమికుడూ నిస్సహాయంగా ఉండిపోలేడు. మనిషే అని కాదు చివరికి గాలి, నీరు, వెన్నెల ఇలా ప్రకృతిలోని ఏదీ తన ప్రియురాలిని తాకడాన్ని భరించలేడు. అంతే కాదు. చివరికి తన ప్రియురాలితో ఆ దేవుడే వచ్చి కలిసినా ఆ ప్రియుడి గుండెలు మండిపోతాయి. నిప్పు రవ్వల్లా ప్రేమించిన గుండె మండుతూనే ఉంటూంది .. కాని ప్రియురాలు కొత్త స్నేహపు ముసుగులో మోసపోతూనే ఉంటుంది.. గతంలో తన ప్రేమను అస్సలు గుర్తుకు తెచ్చుకోలేనంతగా గుర్తుపెట్టుకోలేనంతగా ఈ మార్పు తట్టుకోలేని ప్రేమ అగ్నిగుండం లో ఆహుటి అవుతూనే ఉంటుంది