ప్రపంచంలోని ఏ రెండు వ్యక్తిత్వాలూ ఒకటి కావు నిజమే. అయితే, ఆ భిన్నత్వమే
ప్రేమలో ఇరువురూ ఎదిగేందుకు దోహదం చేస్తుంది. కాకపోతే ఒకరి వ్యక్తిత్వం
మరొకరిలోకి దిగిపోవడంతో, ఒకరి భావాలు మరొకరిలో కలిసిపోవడంతో కొందిరలో ఏవో
భయాందోళనలు మొదలవుతాయి. ఆ భయాల్ని నిశితంగా పరిశీలిస్తే అవి పూర్తిగా
పరస్పర వికాసానికి తోడ్పడేవేనని బోధపడుతుంది అంటారు ప్రఖ్యాత మానసిక వేత్త
గ్రెగోరీ గొడెక్.
ప్రేమలో ఏమవుతుంది? ప్రేమికులు ఒకరినొకరు హృద యపూర్వకంగా తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. అయితే కొంతకాలం దాకా ఇద్దరు ఒక్కరై జీవించడంలోని ఆనందాన్ని చ విచూస్తారు. అయితే, ప్రపంచంలోని ఏ ఏ ఇద్దరి రూపాలు ఒకటి కానట్లే, ఏ ఇద్దరి వ్యక్తిత్వాలూ ఒకటిగా ఉండవు. ఈ వ్యత్యాసమే కొందరిలో ఆందోళనను నింపుతుంది. ఒక జంకు పొటమరిస్తుంది. దీనికంతటికీ తమకే తెలియకుండా తమలో అంకురించిన కొన్ని భయాలే కారణం.
అప్పటిదాకా అవునంటే అవునని, కాదంటే కాదనుకునే స్థితి నుంచి ఒకరి అభిప్రాయాలను మరొకరు విభేదించే స్థితి ఏర్పడటమే అందుకు మూలం. ఈ విబేధాలు, ఈ వైరుధ్యాలు పోను పోను ఏ స్థితికి చేరుకుంటాయోనన్న భయం కొందరిలో చాలా ఎక్కువవుతుంది. వీటివల్ల తమ బంధం భారమైపోతుందేమోనని, జీవితాంతం కొనసాగడం కష్టమైపోతుందేమో అన్న దిగులు పట్టుకుంటుంది. అన్నింటినీ మించి ఎవరికి వారు తమదైన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నామన్న భావనతో ర గిలిపోతుంటారు. వినూత్న ప్రపంచమది ఒక సరోవరంలోకి మరో సరోవరంలోని నీళ్లు వచ్చి చేరితే ఏమవుతుంది? ఆ నీటికి ఒక కొత్త అస్తిత్వం ఏర్పడుతుంది. ఏ రకంగా చూసినా అది మునుపటి కన్నా మెరుగైన స్థితిలోనే ఉంటుంది. అప్పటి దాకా ఏక పక్షంగానే సాగిపోయే ఆలోచనలు, ఈ కలయికతో ఉభయపక్షంగా సాగుతాయి.
ఒక ఆలోచనలో మరో అలోచనలు కలిసిపోతున్న తరుణంలో ఏదో అయోమయంగా అనిపించవచ్చు. తమదైన దేదో తమ నుంచి జారిపోతున్నట్లు అనిపించవచ్చు. తానేదో పతనమైపోతున్నట్లు, తననెవరో కొల్లగొడుగున్నట్లు అనిపించవచ్చు. కానీ, వాస్తవమేమిటి? అక్కడ జరిగిందేమిటి? ఆ అస్థిత్వాలు మునుపటికన్నా బలపడ్డాయి. ఆ బలపడటంలో అక్కడొక కొత్త రూపం, ఒక కొత్త అస్తిత్వం ఏర్పడింది. సమస్య ఏమిటంటే ఆ కొత్తదనాన్ని జీర్ణించుకోవడాన్ని అతని అహం సహించలేదు. నిజానికి మరొక వ్యక్తిత్వం తనలో విలీనమై, తాను మరొకరో విలీనమైపోవడం ద్వారా మునుపటి కన్నా విస్తృతమైన, విశాలమైన జీవితం ఏర్పడింది. జీవన దృక్పథం ఏర్పడింది. కానీ, అహం కారణంగా దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సింది పోయి, ప్రతికూలంగా తీసుకోవడం మొదలవుతుంది.ఆక్కడే మొదలౌతాయి చిక్కులు
భయం ఒక విపత్తు నుంచి తప్పించడానికి, మనల్ని హెచ్చరించే ఉపకరణమే. కానీ, కొన్నిసార్లు అది ఆత్యన్యూనతా భావం లోంచి కూడా పుట్టుకొస్తుంది. ఈ ఆత్యన్యూనతా భావమే అహాన్ని పెంచుతుంది. అయినా, నీలో ఉన్న లోపాలన్నీ జీవితకాలమంతా నీతో ఉండాల్సిందేనా ? ఎదుటి వారు ఆ విషయాన్ని లేవనెత్తితే భరించలేవా? నీలోని లోపాలను ఎత్తిచూపి, నీ అస్తిత్వాన్ని నీ ముందు నిలబెడితే అందులో విలవిల్లాడాల్సిన పనేముంది? ఎవరైనా ఆ లోపాల్ని తొలగించే ప్రయత్నం చేస్తే అది నీ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం ఎలా అవుతుంది?
అయినా ఎదుటి వాళ్లను నీ హృదయంలోకి ఆహ్వానించింది నీవేగా! జీవితాంతం నీతో నడిపించుకోవాలని నువ్వేగా అనుకున్నదిమరి అంతలోనే ఏమయ్యింది? ప్రేమోద్వేగంలో ఒకరినొకరు ప్రశంసించుకోవడం తప్ప విమర్శించుకోవడం ఉండదు. అందుకే అప్పుడు ఒకరిలో ఒకరు క లిసిపోవాలనే అనుకుంటారు. కాస్త ప్రేమోద్వేగం తగ్గి వాస్తవిక దృష్టి ఏర్పడ్డాక ఏమవుతుంది? నిస్సంకోచంగా నిజాలు మాట్లాడటం మొదలెడతారు. నీ లోపాల్ని ఎత్తిచూపడం మొదలెడతారు. అది నీకు రుచించదు. నీ మనసు కప్పుకున్న పొరలు ఎవరో విప్పడం నీకు ఎంతమాత్రం సహించలేని విషయం అవుతుంది. అందుకే నీలో అన్ని భయాలు. అన్ని అసహనాలు.వీటిని అధిగమించిన్నాడు, ఆత్మ విమర్శల్లాగే పర విమర్శల్ని కూడా స్వీక రించగలిగిన్నాడు భయాలు ఉండకపోగా ఎదుగుతున్న ఆనందం కలుగుతుంది. మేఘాలు దాటి ఆకాశంలోకి చేరిన స్పృహ కలుగుతుంది. సహజీవనం ఒక దివ్యజీవనంగా అనుభూతమవుతుంది అంటాడు ప్రముఖ మాన సిక వేత్త గ్రిగోరీ గోడెక్.