. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 16, 2013

ఏ మనిషైనా ప్రేమకోసం తపించిపోతాడు..తనని తాను గా ప్రేమించే గొప్ప ప్రేమకోసం ఆరాటపడిపోతాడు

ఏ మనిషైనా ప్రేమకోసం తపించిపోతాడు.    అలాంటి ప్రేమకోసం మరనించాలి అనుకొంటాడు .ప్రేమ ఒక గొప్ప పారవశ్యాన్ని కలిగించడమే అందుకు కారణం. ఆ ప్రేమ పారవశ్యం కోసమే ఎంతో మంది మిగతా జీవితాన్నంతా వదిలేసుకోవడం మనం చూస్తున్నదే. దీనికి తోడు ప్రేమ ఒంటరి తనం నుంచి విముక్తం చేస్తుంది. అంతే కాదు ఒక వ్యక్తి నుంచి మొదలయ్యే ప్రేమ ఒక దశలో రుషులు, కవులు దర్శించే విశ్వవాపకమైన అనుభూతిలోకి తీసుకు వెళుతుంది. అనంతంగా విస్తృతమయ్యే ఆ ప్రేమే సాటి మనిషి సంక్షేమాన్ని కోరే సమున్నత స్థాయికి తీసుకువెళుతుంది.ఒక వక్తిని ప్రేమించే దశనుంచి ఒక హృదయం విశ్వవ్యాప్తం ఎలా అవుతుంది? సమస్త మానవాళి సంక్షేమం గురించి ఆలోచించే స్థాయికి ఎలా వెళుతుంది? అంటే ప్రేమ అనేది జ్ఞాన సమన్వితం కావడమే అందుకు కారణం. వాస్తవానికి ఏ జీవితమైనా సఖ్యంగా, సవ్యంగా సాగిపోతోందీ అంటే, అది ప్రేమతో స్పూర్తి పొంది, జ్ఞానంతో మార్గనిర్దేశితమైనదే అయి ఉంటుంది. అలాంటి ప్రేమ, జ్ఞానాల అంతిమ ఫలితమే ఆనందం. 
                                         ఎప్పటికైనా ఆనందానికి చేర్చే సాధనాలు ప్రేమ, జ్ఞానాలే. జ్ఞానవంతమైన ప్రేమే అద్భుతమైన నైతిక జీవితానికి కూడా నాంది అవుతుంది. సాటి మనిషిని కూడా తనలో భాగంగా చూసుకునే జ్ఞానం. సాటి మనిషి దుఃఖానికి స్పందించే జ్ఞానం ఆ ప్రేమకు మూలంగా ఉన్నప్పుడు అది తప్పనిసరిగా సమాజాన్ని మెరుగు పరుస్తుంది. ప్రేమకు ఎదుటి వారి మంచిని కోరే తత్వమే లేనప్పుడు మనం ఆశించే ఆనందకరమైన సమాజం మనకు ఎప్పుడూ లభించదు. ప్రేమతో స్పూర్తివంతమైన జీవితం, జ్ఞాన నిర్ధేషితమైన ప్రయాణాన్ని సాగించే జీవితమే ప్రపంచంలో ఉత్తమ జీవితం. అది ఎన్ని ప్రతికూల పరిణామాలు ఎదురైనా, ఎన్ని వైరుధ్యాలు చుట్టుముట్టినా నిర్విఘ్నంగానే సాగిపోతుంది. జ్ఞానం అంతిమ తీరాలనేమీ చూపదు. కానీ, ఉత్తమ జీవన తీరానికి చేరే స్ఫుర్తినిస్తుంది.
                           ఆత్మీయమైన ప్రేమలు, సంరక్షిత ప్రేమలు అంటూ రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఆత్మీయమైన ప్రేమలో ఎదుటి వారి పట్ల ఒక శ్రద్ధ ఉంటుంది. అదే సంరక్షిత ప్రేమలో ఎప్పటికీ తోడై నిలిచే ఒక అంకిత భావం ఉంటుంది. అయితే మోహాలు నిండిన ప్రేమలో కోరికలు ఉంటాయి. వాస్తవానికి మోహమూ, ప్రేమ విడదీయరానివి. అలా అని రెండూ ఒకటే అనడానికి కూడా లేదు. ఎందువ ల్ల అంటే మోహంతోనే మొదలైనా ఒక దశలో ప్రేమ మోహానికి అతీతంగా కూడా వెళుతుంది. అందుకే వాళ్ల దృష్టి శారీరక విషయాలకే పరిమితం కాకుండా, ప్రేమించిన వారి జీవిత ఔన్నత్యం కోసం కూడా పాటుపడేలా ఉంటుంది. సాటి మనిషి గాయమైనప్పుడు, ఆ గాయం తనకే అయినట్లు విలవిల్లాడిపోయే స్థితిలో వారు ఉంటారు.