. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 16, 2013

ఈ రోజు రాత్రి 8:30 గంటలకు నాకు తృటిలో తప్పిన ప్రాణం ప్రమాదం ( 16-09-2013 at 8:30 pm )

వర్షం పడీ రోడ్డు తడిగాఉంది వాహనాలు ఫాష్టుగా వెలితే స్కిప్ అవ్వుతున్నాయి.. గత కొద్ది గంటలక్రితం చనిపోవాల్సిన నేను మళ్ళీ బ్లాగ్ రాస్తున్నా అంటే ఆచ్చర్యింగా అనిపిస్తుంది .. నేనేలా బ్రతికాను అన్నది నాకు ఇప్పటికీ కలగనే అనిపిస్తుంది మృత్యువును చాలా దగ్గరగా చూసిన క్షనాలు అవి... ఏంజరిగిందో తలచుకొంటేనే  మనసంతా ఏదో లా అనిపిస్తుంది ఈ రోజు ఎందుకో మనస్సు అస్సలు బాలేదు కొన్ని జ్ఞాపకాల ప్రభావమో ఏమో మరి కాసింత ఎందుకు బ్రతికామా అని అనిపించినా .. నిజంగా ఏదైనాజరిగి చనిపోతే హేపీగా ఫీల అయ్యేవారుకుడా ఈ బ్లాగ్ చూస్తారు అని నాకు తెల్సు .. పాపం వాళ్ళకు నిరాసైన పోష్టు ఇది....పాపం వాళ్ళు మనసులో నేను బ్రతికానని ఎంత ఫీల్ అవుతారొ కదా..?

జరిగింది ఇలా ...? 
ఈ రోజు ఎందుకో మనసంతా గజిబిజి గందరగోళం.. ఏం జరుగుతుందో తెలీసు .. మనసులో ఆలోచనలు గుండెల్లో గుచ్చేస్తున్నాయి..కారనాలు వెతుక్కొని భాద పడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి .. ఇది అని చెప్పలేని నిస్పృహ ఇలా గందరగోలంగా సాగుతున్న ఆలోచనలు మనిషికి మనసుకు మద్యి జరుతున్న ఘర్షనలో ఒంటరి ఆలొచనలు .. ఆదరించాల్సిన మస్సు మౌనందాల్చిన వేల అర్దం చేసుకోవాల్సిన మనస్సు మారిపోయి తన సంతోషాన్ని వెతుక్కొని వెల్లిన పరిస్థితుల్లో సాగుతున్న ఒంటరి ఆలోచనలు ..కొన్ని ఆలోచనలు నిజంగా మనస్సును కుదిపేస్తాయి... నరకం చూపిస్తాయి  అసలు ఆలోచనలకు కారణం అయినవాల్లు మాత్రం ఏంతెలియనట్టూ తమస్వార్దం చూసుకొన్న పరిస్థితులు గుర్తుకొచ్చి నక్షనాల్లో నేనేంటొ తెలియక నాకేమౌతుందో అర్దం కాక నాలో నేను నలిగిపోతున్నా రోజు ఆఫీసుకు కార్ తీసుకవెల్లేవాన్ని ఎందుకో బండి తీసుకొచ్చాను ఆఫీస్ అయిపోయిన తరువాత మాదాపూర్ నుండీ స్పీడ్ గా వెలుతున్నా...మనస్సులో ఆలోచనలు కూడా నాకంటే వేగంగా ఆలోచిస్తున్నాయి.. ఎందుకో ఇష్టమైన మనుషులకు ఫోన్ చేసినా పలుకరించలేని .. పరిస్థితి..కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలేదు.. నాకంటే అద్బుతమైన స్నేహితులతో వారు బిజీగా ఉన్నారేమో అలా మాదాపూరు నుండీ టోలీ చౌకీ వైపు నా ద్విచక్రవాహనం పై స్పీడ్ గా వెలుతున్నా చుట్టుపక్కల పరిస్తితులు పట్టీంచుకునే పరిస్థితి లేదు.. మనసంతా ఏదోలా ఉంది వెనుక బస్స్ వస్తుంది.. అలా స్పీడ్ గా వెలుతున్న నాకు .. ఎడమ వైపున షడన్ గా కార్ రోడ్డు మీదకు రావడంతో ఏం చేయాలో తెలీక నేను నా వెహికిల్ హేండిల్ ను ప్రక్కకు తిప్పగానే నా బండి స్కిప్ అయింది.. కారు షడన్ బ్రేక్ వేయడం నేను స్కిడ్ అయి పడటం ఒకేసారి జరిగాయి.. ..ఏం జరిగిందో అనుకునే లోపు నా తలపై ఆగిన బస్స్ టైర్..ఒక్క నిమిషం ముందుకొచ్చినా తలపైనుంచి బస్సు వెల్లి పోయేది .. నాకింగా లోకంలో నూకలున్నట్టూన్నాయి.. నాకు ఏం కాలేదు  బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బస్సు దిగి నన్ను బైటికి లాగాడు .. నేను బ్రతికి ఉన్నా అని తెల్సుకొని ఊపిరి పీల్చుకున్నాడు... కారు డ్రైవర్ కంగారు పడి అక్కడినుంచి పారిపోయాడు కారువదలి బస్సులో అందరు నేను బస్సుక్రింద పడి చనిపోయాననే అనుకున్నారు బస్సులోనుంచి చూసిన వారు.. రోడ్డుపైనుంచి చూసినవారు అలాగే అనుకున్నారు నేను ఇంకా షాక్ లో ఉండాగానే ఎవరో నీళ్ళు చల్లారు.. బండీకీ నాకూ ఏం కాలేదు ..చిన్న చిన్న దెబ్బలు తప్ప...తప్పు నాదా డ్రైవర్ దా నాలో గజిబిగిని కలుగజేసిన ఆలొచనలదా తెలీదు... కాని చావును కొద్ది సెకన్లదూరంలో చూసాను.. అందరూ నేను చనిపోయాననే అనుకున్నారు బస్స్ డ్రైవర్ కూడా పారిపోదామనుకొని ఎందుకో బస్సు క్రింద చూడగానే షాక్ లో ఉన్న నన్ను చిన్నగా బైటకు లాగారు.. ఈలోగా నాకు తెల్సిన ఓ స్నేహితువచ్చి నన్ను బండిమీదకు చేర్చి ఇంటిదాక వస్తాను అన్నా ఎందుకో ఏం కాదని అలా బండీ ష్టార్ట్ చేసుకొని ఇంటికొచ్చాను .. ఇప్పటికీ ఈ ఘటనతల్చుకుంటే నిజంగా నేనేనా బ్రతికి ఉంది అనిపిస్తుంది  పాపం ఈపోష్టుచూసిన కొందరు నేను చనిపోలేదెందుకని ఫీల్ అయివుంటారు.. వాళ్ళెవరో వాళ్ళ మనసుకు తెల్సు.... ఈ పోష్టు పెడుతున్న క్షనంలోకుడా ఏదో తెల్సియని వెలితి గుబులు ... ఇంతంకంటేం ఏం చెప్పలేను