1) నీ కన్నీటిబొట్టు తో నా హృదయం బరువు
సమానంగా తూగుతున్నాయి అంతగా నీరసపడిపోయింది మనస్సు
2) తొలి సంద్య వేళ నిన్ను చూస్తాననే ఆశ
మలి సంద్య వేళ అప్పుడే రోజు గడిచింది అని నిరాశ ..ఇది నా దురాసే కదా
3) ఒంటరి తనాన్ని అంతం చేసే నీ తలపులు....నా గతాలుగా మిగిలిపొతుంటే...
తీరలేని నా ఆశల వెనుక తిరిగి రాని ఆ రోజులును ఏలా లెక్కపెట్టను ఎక్కడని వెతకను
4) మౌనం నుండి మనసు ద్వారం తెరవాలనుకున్నా
నీ మనసును జయించడంలో ఓడిపోతున్నా నీ మనసు తాలం నాదగ్గరలేదుగా
5) నీవు లేని ఒంటరితనంలో ఇమడలేక...
ఆవహించిన ఏకాంతపు మౌనంతో బ్రతకలేక భారంగా కాలం వెల్లదీస్తున్నా
6) గడ్డి పూలలో నేను ఓ గడ్డి పోచనై కలసి పోవాలి....
అయినా నా భావాలూ వాటితో కలవనిస్తే కదా గడ్డిపూలలో కూడా ఇమడలేవు..?
7) నీకోసం కురుస్తున్ననా కన్నీటి జళ్ళు
నీమదిని తడుపుతుంది అనుకోవడం నిజంగా నా పిచ్చేమరి..?
8) వెచ్చని సూర్య కిరణాలు పుడమి తల్లి ముంగిట పారట్లాడుతుంటాయి
నన్ను కాదని వెల్లిలా అటువైపుగా వస్తావేమో అని ఎదురుచూస్తున్న నా మనస్సులా
9) గతం నన్ను గమనిస్తున్నా
భవిష్యత్ ఎందుకో నన్ను భారంగా చూస్తుంది
10) నన్ను అర్ధం చేసుకుందామని చూడకు…నేను నీకు అర్ధంకాను….
నీకే కాదు ఎవ్వరికీ అర్ధం కాను..నా మనసు లోతుల్లో అంతా చీకటేగా ఇప్పుడు
11) రాత్రంతా కష్టపడి పోగేసిన చుక్కలు
తెల్లారేసరికల్లా ఏమయ్యాయో కనిపించలేదేంటీ నీలా
12) నీవు నన్నొదిలి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది
కాలాన్ని గదిలో పెట్టి తాళం వేయాలని కానీ ఎందుకో ఆ అర్షతలేదేమో కదా
13) నీ సమక్షంలో ఒక్క క్షణం గడిస్తే చాలు
నీ కనురెప్పల చాటున చేరి ఓ స్వప్నం లిఖించడానికి
14) నీవు కనిపించడం లేదని నీ కలల్ని తడిమాను
తలచే ప్రతి తలపులో నీ జ్ఞాపకాలు అలజడులు గుచ్చుతున్నాయి
15) నా కనుపాప వర్షించే ఆఖరి
కన్నీటి బొట్టులో ఆర్తనాదం కాస్త ఆలకించవూ
16) క్షనాల్లో మారిపోయె జీవనానికి
మధ్య మిగిలిన గుర్తుగా గుండెల్లో మిగిలిపోయావు
17) ఏం చేయను మౌనమై పోవడం తప్ప
కానరానని తెల్సి నీ కళ్ళల్లో నన్ను వెతుక్కోవడం తప్ప
18) మరిచిపోలేని జ్ఞాపకాలుగా
అందమైనవి ఆక్షణాలు - అందుకోలేని దూరాలుగా మారాయి
19) మృత్యుకౌగిలిలో బిగుసుకుంటున్నాను,
మరణ సెయ్యపైకి ఎక్కబోతున్నాను ఒక్క క్షనం కనిపించిపోవూ
20) నా మది చప్పుడు తెలుసు నీ గుండెకి,
కాని నీ మౌనం నన్ను బాధిస్తున్నదని తెలియదు నీకు ఎందుకని
21) నువ్వు నేనైన క్షనంలో ఒంటర్ని చేశావు
నన్ను కాగితంగా మార్చి నిన్ను కవితగా చేసి రాస్తున్నా పిచ్చిరాతలు
22) నా నిద్రను కాజేసి కలలను చింద్రం చేసి
మనసులో మధురంగా ఉన్న నీరూపం తలచుకొని నిద్రను కోరనా..?
23) నా ఎద లోపలి సడులన్నీ ఒదిగి వినవా
విని చూడు ప్రతి క్షణం నీ తలపే నా గుండెపలికేది
24) మనినిద్దరినీ వేరు చేసింది మన మధ్య ఉన్న
జ్ఞాపకాలే ఎందుకు మసక బారి ముక్కలయ్యాఎందుకనో చెప్పవూ
25) మనమిద్దరం కలసి పంచుకున్న కాలం ఆవిరైపోయింది
నీకూ నాకూ మధ్య తరగని దూరాన్ని పెంచి నానుంచి పారిపోయావెందుకని
26) మన కను పాపల వెనుక మనమిద్దరం
కన్న కలలన్నీ కరగదీసావెందుకని ఇది నీకు న్యాయమా
27) నేను మాత్రం నిన్న నీవు వొదిలిన జ్ఞాపకాల మధ్య
నీ నవ్వులను ఏరుకొంటూ తప్పిపోయాను అందుకే నాకు నేను వెతుక్కుంటున్నా
28) నీకోసం నీ సహచర్యం కోసం
తపన పడుతున్న నేనెవరో నాకు నన్ను గుర్తు చేసావు
29) మనం క్షణకాల జీవితంలో మెరుస్తున్న మెరుపులను
దోసిటలో ఒడిసి పట్టుకుందామా రేపటి క్షణాలను మైలురాళ్లుగా మారుద్దామా
30) నీగూర్చి నా మదిని మెలిపెడుతూ నిద్రని దూరం చేసి
కళ్ళని కలవరపెడుతున్నది నిజానికి ... అబద్ధానికి మధ్య ఉన్నది గోడలాంటి కల
31) నిశ్శబ్దపు విషాద ఛాయలు మదిలో అలుముకుంటున్నాయి
మౌనంలో మాటలు ముక్కలుగా విరిగిపోయి మనస్సులో గుచ్చుకుంటున్నాయి
32) నా మనసు అపార్ధాల అగ్నిలో దగ్ధమవుతుంటే...
గుండెలో విషాదాలు తగలబడుతూ...నిశ్శబ్దంలోకి జారిపోతున్నా
33) ఒంటరి తనాన్ని అంతం చేసే నీ తలపులు....
జ్ఞాపకాలు గతాలుగా మిగిలిపొతుంటే..స్వగతం నన్ను చంపేస్తుంది
34) ఒంటరి చీకటిని తరుముతున్న నాకు
ఆనందం పంచే చల్లని వెన్నెల నీ ప్రేమ ఇప్పుడెక్కడుందో చెప్పవా....
35) నా కలం కన్నీరు పెడుతుంది...
కావాలనుకున్న నీవు కటువుగా మాట్లాడినప్పుడు
36) ఎండిన రక్తంతో ఊపిరందక కొట్టుకుంటూ..
నీ చూపుల వాన కురియక బీటలు పడిన నా గుండె కనిపిస్తుంది చూసావా
37) ఏడ్చే కళ్ళు నావి అవుతున్నాయి
ఏడ్పించే మనస్సు నీదౌతుంది ఏంవింతో మరి
38) చావును నాపక్కన పడుకోబెట్టి వెర్రి నవ్వులు నవ్వుతాయి నీ "జ్ఞాపకాలు"
39) మనసులకి తనువుల మద్యి అగాధాలు
తపించే తనువుల మనసుల అగాధాలు పూడ్చేదెలా
40) నింగిలో దూరంగా అలుముకున్న చీకటిని
తదేకంగా చూస్తూ ఉన్నాను నా మనసు రోదిస్తూ నీకోసం ఎదురు చూస్తూ
41) పని వేళల్లో నేను పదిమందితో ఉంటాను,
కానీ ఎవరూలేని ఆ చీకటి వేళ నిన్ను మాత్రమే నేను కోరుకొనేది.
42) వసంతం విరబూసి సెలవు తీసుకుంది.
నేను వాడిపోయి వ్యర్ధమైన పూల భారంతో విడువలేక వేచి ఉన్నాను.
43) నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తాను
ఆశగా అమాంతం నీలోనికి చొరబడాలని చూస్తాను అక్కడ ఎవరో ఉంటారు
44) జాబిలి నా ఎదలో మంటని రగిలించింది
నను కాదని ఏమీ తెలియనట్టు మరో తారకతో జతకట్టింది
45) నీవు లేవని తలచుకొని కనులు దాటాయి కన్నీళ్ళు
దారి తెలియక నిన్ను మరువక కాలంలో ఐక్యిం అవుతోంది
46) మననేదే లేకుండా పోయింది
దానికి మాటలు రాని మూగదైందంటే నమ్మేదెలా
47) నీవులేని జ్ఞాపకాల నదిలో నన్ను శిలగా చేసింది నీ జ్ఞాపకం
48) వాస్తవాలను ఊహలు చేసి రెప్పచాటు చేరావు...
చిట్టచివరి నిమిషంలో చిక్కుముడిని వేసి వంటరిని చేశావు
49) నీ జ్ఞాపకాల తీరంలో అనుభూతుల తెన్నెలలో
ఒంటరిగా కూర్చున్నాను ఎంచేయాలో తెలీక ఎరుపెక్కిల కల్లతో
50) ఒంటరితనం లొ నకు నేను జంటకడుతూ
నాలో నేను ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా
51) రాత్రి నా జ్ఞాపకాలను నీ కోసం వెలిగించి
ఆచీకట్లో ఆరిపోయినా దీపాల్లా అయ్యాయేంటీ నా జ్ఞాపకాలు
52) ఎన్నో బావాలని నా అక్షరాలలో పొందుపరుస్తున్నా
ఎందుకో అక్షరాలు నిలకుండా దొర్లుకుంటూ పోతున్నాయి
53) నీవు లేని ఈ ప్రపంచం..పేజీలు లేని పుస్తకం లా ఉందేంటో
54) గతం లో " తను" నాతో ఉంది
వర్తమానం లో నేను మాత్రమే మిగిలిపోయా
55) విషపు చిరునవ్వుతో వెళ్ళిపొయిన నీకేం తెలుసు..
మరవలేని నిన్ను మనసునిండా పెట్టుకొని నీకోసం వెతికే మనస్సు విలువ
56) గుండెలో విషాదాన్నీ మిగులుస్తూ...
నిశ్శబ్దపు అడుగులతో జారిపోతున్న జ్ఞాపకాలు
57) గడిచిన ప్రతి క్షణం నీ జ్ఞాపకాలుగా మారుతున్నాయి
వాటి తాలూకా నిజాలే ఇక్కడ కనిపించే అక్షరాల అల్లికలు
58) దిగంతాల నీడల్లో తలదాచుకుంది "నిజం"
జరుగుతున్నా వాస్తవాలను చూసి తట్టుకోలేక
59) నీవు నాకిచ్చిన "ఓటమి" లో...
న్యాయం ఒంటరిగా మిగిలి రోదిస్తుంది
60) మరుగుతున్న నా రక్తంలో
మరపురాని వాస్తవాలు కరిగిపోతున్నాయి
61) మనసులోంచి జారిపోతున్నాయి నీ జ్ఞాపకాలు
దూరం అవుతున్నాయి అని ఆత్రంగా వాటిని పట్టు కోబోతే
62) నీవు దూరమై దగ్గరైన నా ఈ ఒంటరితనం
నీ జ్ఞాపకాలకు వారదిగా మిగిలిపోయింది నీకోసం
63) ఓపిక నశించి నిజంచెప్పాలని చూస్తే
అవమానపు రక్తపు గాట్లతో జారుతుంది నా నెత్తురు
64) ఒక్కక్షణం కూడ నన్ను వీడని నీ జ్ఞాపకాలు...
మరుక్షణంలోనే మాయమవుతాయని ఎలా ఊహించావు
65) నువ్వు దోచుకెళ్ళిన నీ భావాలను
నా మనసు గోడల మధ్య బంధించి వాటికి ఖైదీ చేయలేను ప్రియా
66) నిస్సహాయతతో నిండి ఈ చిమ్మ చీకటీలో...
విధి లిఖించిన వెర్రి చిత్రంలా మిగిలిపొయానేంటీ...
67) మనం కన్న కలల్ని కత్తులుగా మార్చవెందుకో ప్రియా
68) గుండె గదిలో చోటు ఇచ్చి
నీ మనసు నా మనసు కు తోడుగా నిద్రపోనివ్వవా
69) కనురెప్పల దుప్పటి కప్పి
కంటి పాపను నిద్రపుచ్చుదాం అంటే కన్నీటి వర్షం భోరున కురుస్తుంది
70) మధురమైన జ్ఞాపకమైతే నా హృదయపు పొరలో
గాయం రేపె బాధవైతే మౌనంగా భరిస్తాను అని మర్చిపోయినట్టున్నావు
71) నువ్వు బాధ పడినప్పుడు నా భుజం
నువ్వు ఆనందపడినప్పుడు నా హృదయం
తోడుగా ఉంటాయని ఎలా మర్చిపొయావు నేస్తం
72) నేను స్మరించే నీ పేరును నా పెదవి అంచుపై వెతకలేక...
నిస్సహాయతతో నిండిన నీ హృదయంలో నేను లేనన్న నిజాన్ని ఒప్పుకోలేక
73) నీ ఆలోచనల చితిలో కాలుతున్నది నేనే
నీ ఎడబాటు కొలిమిలో రగులుతున్న అగ్గిని నేనే
74) ఒక్కోసారి మనసును తగలబెడుతున్న వెలుగు కంటే..
కళ్ళు కనిపించనంత చిమ్మ చీకటే నయమనిపించేలా చేసావు.
75) అబద్దపు అనుబంధాలతో... కారణాల్ని అన్వేషిస్తూ.
నీకు నీవు చేసే ప్రతిపని గొప్పగానే కనిపిస్తుంది..నిజాన్ని తగలబెట్టావుగా
76) మనసులో స్వచ్ఛతను నీవు కోల్పోయిన క్షనంలో
నిన్ను నీవు ఏమార్చుకొని సాదించింది ఏమిటీ ఇప్పటికైనా తెల్సిందా
77) జన్మకు చాలని ఆవేదననీ నాకు అంకితమిస్తూ
విషపు చిరునవ్వుతో నిర్లీప్తంగా వెళ్ళిపొయిన నీకేం తెలుసు నా వేదన
78) నా జ్ఞాపకాల తెరలను చీల్చుతున్నాయి
ఏదో జ్ఞాపకంలో నా ఆనందం కనిపిస్తుందేమో అని
79) ఒంటరితనంలో ఇమడలేక...
నీవిచ్చిన ఏకాంతపు మౌనంతో బ్రతకలేక...
80) వాన వెలిసాక గొడుగు... మది గాయపడ్డాక నీ అడుగు ఎందుకు నేస్తం
81) చీకటి పలకలమీద రేడియం అక్షరాలను
వ్రాసుకునే మీకేం తెలుసు మనుషుల మనస్సు విలువ
82) జ్ఞాపకాల అజ్ఞాతంలో నాది ఏకాంత వాసం
నీవు లేని నేను ఎప్పటికీ ఒంటరినే అని తెల్సే ఇలా చేస్తున్నావు
83) ఆనవాళ్ళ వలయాలు నన్ను శాసిస్తున్నప్పుడు..
నా మనసునిండా కత్తి గాట్లు పెట్టి ఆనందిస్తున్నది ఎవరు,,,?
84) ఎవరన్నారు నేను ఫ్రేమలో ఓడిపోయానని..
నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఘోరంగా ఓడి నన్ను వీడిపోయావు
85) ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి మనో మైదానం మీద
యుద్ధాన్ని ప్రకటిస్తుంది" ఏమీ తోచని నేను ఆత్మహత్యను అన్వేషిస్తూ