1) తడిచే వృక్షానికి తెలియదు ఆ వర్షానికి కారణం తానేనని,
ఆహ్లాదించే నీ మనసుకి తెలియదు నీ అసలు ప్రేమకు కారణం నేనేనని.
2) నీ కన్నుల నుండి జారే కన్నీటి బొట్లు నా గుండెపై పడుతున్నాయి,
కరిగిపొతున్న కాలం తనతో బాటు నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది ఏకాంత శిసిరంలోకి
3) మూగబోయిన నీ స్వరపు మౌనరాగం నా గుండెను గాయం చేస్తుంది,
ఎరుపెక్కిన నీ కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెదరిపోలేదులే
4) నీ ఊపిరి తగిలిన సమయం ఊహలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే,
నీవు ఎదుటబడిన నిముషం ఎదలోని భావాలు ఎగిరిపోతూ ఎదను కోస్తున్నాయి
5) అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహ సంద్రంలోకి విసిరేశావు ఎందుకని చెప్పవూ
6) కొంటెనవ్వుతో చూసే నీ ఓరకంటిచూపులు
గుండెల్లో గుచ్చుకొని ఉలిక్కిపడి నిదురలేచాయి ఆశలు
7) స్వచ్చమైన కన్నీటి లాంటి ప్రేమ నాదంటే పొంగిపోయాను....
గుండెకు చిచ్చుపెట్టి నేను రోధిస్తుంటే కనులనుండి జారిపోతున్నాయేంటో
8) ఆనందపు వెలుగులోతోడున్నప్పుడు
ఒంటరితనపు చీకటిలో విడిచిపోతవని అస్సలు ఊహించలేదు
9) నీ మౌనం నిశీధిలో శూన్యం...
నా మనస్సు ఎడారిలోని నిశ్శబ్దం.
10) నీ మౌనానికి మేఘం కరిగినట్టుంది
అందుకేనేమో నా కన్నీరు చినుకై కురుస్తోంది ఈ రోజు
11) ఒక పుస్తకం గొప్ప స్నేహితుడిగా మారుతుంది
ఒక తియ్యటి స్నేహం జీవితకాలపు వరంగా గుండెల్లో నిలచిపోతుంది
12) దిగులు దీపపు కాంతిలో కన్నీటి లోతుల్లో నా ప్రతిబింబం
కనుమరుగౌతున్న నా రూపాన్ని నీ మదినుండి మరగుపడనీయకు నేస్తం
13) కనురెప్పల కింది చీకటిని వేళ్ళ చివర్లతో తుడిచివేసి
ఆ కన్నీటి చుక్కల్లో ప్రమిదెలు వెలిగించి చూడు నేను కనిపిస్తా
14) కనులపై పల్చటి పొరలా వ్యాపిస్తున్న చెమ్మ నన్ను అడిగింది యిలా
చీకటి బాకుతో ఛాతిని నిలువునా చీల్చుకుని నాలోని వెలుగులను ఎవ్వరెత్తుకెల్లారు
15) నీ మనసు మాత్రం నాకే సొంతం నీ ఓరచూపుకే నాలో కలిగెను పరవశం
నా గుండెల్లో మొదలయ్యెను ఒక కలవరం ఎవరు చల్లారు నా మనసుపై ఈ సంతోషం.
16) ఒంటరి తనం జీవితంలో అన్నింటిని నేర్పిస్తుంది
ఎడబాటులోని విరహాని బంధాల అంతర్యాన్ని మంచిని చెడుని బేరీజు వేసే మనస్తత్వాన్ని
17) కోటి జ్ఞాపకాలు నింపుకున్న కనుపాపలు కన్నీటిలో మునిగితేలుతున్నాయి
క్షణాలతో ఒంటరిగా బ్రతకలేక నాగుండెకి తగిలిన గాయాలతో భాదను ఒర్చుకోలేకున్నాను
18) మదిని తలపించే ఒకే ఒక్క అరుదైన సన్నివేశం అదే వెంటాడే జ్ఞాపకం
నీవు నానుండి దూరం అయ్యేసరికి ఆ దృశ్యం మనోఫలకం మీద.. అలాగే ఉండి పోయింది
19) రాత్రుళ్ళకు నల్లని రంగు వేసి పగళ్ళకు వెలుతురు బల్బులను వెలిగించా
ఆబల్బులను అర్పేసి నీళ్ళు చల్లుతున్నారెందుకో..అయినా చల్లగా ఉందిలే నీ మనస్సులా
20) జరిగిపోయిన కాలం నన్ను నీవెవరని బాధిస్తున్నా
జవాబు లేక నీ పేరే పలుకుతూ నాలోనే ఉన్న నీకు చేస్తున్న విన్నపం
21) ఈ కన్నీరు వరదలా నన్ను ముంచి వేస్తుంది
కూలిన నా ఆశల సౌధాల వద్ద విలపిస్తూ ఏకాంతంగా
22) బదులిమ్మని నీ మౌనాన్నిబతిమాలి నాజవాబు చెప్పని నీమౌనం
నా గుండెలో శులాలై దిగాబడగా నా కళ్ళల్లో సుడులకు నీమనసు మారలేదేమి
23) కట్టలు తెంచుకుని నీ చెంపలపై నుండి జారే కన్నీటిని నేనేమని అడిగేది
గుండె నిండా దాచుకున్న తలపులు కొట్టుమిట్టాడుతున్న నీ మదినేమని అడిగేది
24) రెప్ప వెనకాల ఉబికిన నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కి నా మనస్సుకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది
25) నీకూ నాకూ మాత్రమే తెలిసిన మనదైన మరువలేని
ఏకాంతం లోనూ నీ చుట్టూ నేను రాలేని నిలువెత్తైన గడ్డుగోడలు పెట్టావెందుకు
26) మత్తెకించే దగ్గరితనం తడిమి తడిమి పదే పదే తీపిని గుర్తు చేస్తూ
పెదవి పై నీవు అద్దిన మకరందం ఆరకుండా నా నిద్దురను దూరం చేసింది
27) నీ ప్రేమ పోందలేని ప్రతి క్షణం
కోరుతుంది మరణం మరల నీ ప్రేమక్తె కోరుతుంది మరు జననం
28) కన్నుల వెనుక స్వప్నం నువ్వు..నా మాటల వెనుక మౌనం నువ్వు
నా శ్వాసల స్పందన నువ్వు..నా రేపటి వెనుక నిన్నటివి నువ్వు .. ఏమైంది నా "లవ్వు"
29) నా మాటలన్ని దోచుకొన్ని మూగన్ని చేసినా
మదిలో పలికే సరకాలన్నిటిలో నీమౌనం పలికిస్తున్నాయి రాగాలు
30) కన్నీరే నాకు మిగిల్చినా
కరిగిపోదు నా కంటి పాప లో నీ రూపం నిలచిపోతుంది ఎప్పటికీ
31) నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం
నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం అన్ని జన్మలకు
32) నా ఈ జన్మంతా నీకు దాసోహం
నేను పొందగలిగితే నీ మాటల పాలసంద్రం లోని అమృతం
33) రాత్రులు కరిగిపోతాయి నిద్దుర బరువుని నా కనురెప్పలు అలవాటుగా మోసేస్తాయి ఎప్పుడైనా నువ్వొస్తావని రేయంతా నీకోసం ఎదురుచుస్తానని నీకు తెలుసా
34) ఓకప్పుడు నే రాసే ప్రతీ పదంలో నిన్ను వెతుక్కునేదానివి
ఇప్పుడేమో నే రాసేది నీ కొసమే అని తెలిసినా నీ మనస్సు నిను చేరనివ్వడం లేదు
35) నీవు నాలోకి నువ్వు చొప్పించిన ప్రతీ భావోద్వేగము
నీ జ్ఞాపకాల చితి మంటల్లో కాలిపోయాక నాకంటు మిగిలిందేముందని ఏకాతం తప్ప
36) రాసే కొద్ది గుర్తొస్తావు తలచేకొద్ది కలచివేస్తావు
మరుపంటు రానివ్వక అలుపంటు తెలియనివ్వక గుండేల్లో అలజడి చేస్తావు
37) భగ్గుమంటున్న ఒంటరితనపు సెగలు కాల్చకముందే ..
నీ బాహుబంధాల్లో నలిగిపోనీ తెలియని లోతులలోకి ఇంకి కరిగిపోనీ
38) ఇన్నాళ్ళకు ఓడిన ఈ దూరం కర్పూరమై కరిగి
మన హద్దులు కడుగుతోంది అహం అడ్డు చెరిగిపోతుంది నిజమా ...?
39) తడి కన్నుల చూపులలో జ్ఞాపకాలు మునిగిపోతున్నాయి
గతించిన కాలం వెక్కిరిస్తూ క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తున్నాయి
40) స్పందన మరచిపోయిన ఈ మనసుకి నాయద చప్పుళ్ళు కనిపించేవేమో సంధ్యల్లో మూగపోయిన నీ మనసుకి తొలి వేకువై నను నీదరి చేర్చవా
41) అబద్దపు మమతలను ప్రోగు చేసానేమో
నిజమైన బంధాలు తుంచుకుంటున్నాను అదే భ్రమలో జీవిస్తూ ఇంకా
42 ) ఈ చేదునిజమేంటి స్వప్నమై నిలిచింది ఎందుకో
నా శ్వాస నా గుండె లయఎప్పటికి....నావి కావా మరి దేనికోసమో నా హృదయవేదన
43) నా కలలన్నీ అనాధలై పోనీ నీ తీరమైన చేరుకోని
ఎందుకో నా మనస్సు కోరుతోంది నీ ఎద గూటిలో సేద తీరే ఈ క్షణం శాశ్వతమైతే చాలని
44) నన్ను సేద తీర్చగలవు..కాసింత ప్రేమ పంచగలవు
నాకు తెలియకుండా నా కలలను లిఖించనూగలవూ నీకేదైనా సాద్యమే
45) ముద్దంటే....మొహం కాదు అదో తియ్యని స్పర్శ
మౌనం లో మాటలు లేని వేళ పెదాల కాగితంపై లిఖించే సాధనమే "ముద్దు "
46) కరిగే కలవా..? ఎదలో లయవా..? మదికి తగులుకున్న గాలానివా
ఉహల ఊయలలో కనిపించని గాధవో.. వినిపించని బాధవో కాస్త క్లారిటి ఇవ్వవూ..?
47) నా మౌనం సందేశం తెలియజేస్తే...
కనీసం నువ్వైనా... మౌనంతో కాకా మాటతో బదులివ్వు ప్రియా
48) నా మాటల వర్షంలో నిన్ను తడిపి
నా ప్రేమ మంటల వేడిలో నువ్వు చలి కాచుకోవాలని మనసు కోరుతోంది
49) నిన్నై గడిచిందో నేడై నిలిచిందో…రేపై నీకై వేచిందోఆశై చేరిందో….
శ్వాసై తాకిందో ఎదకే ఏమైపోతుందో నీ తలపులో నీ వలపులలో కరిగిపోతూ నేను
50) కన్నులు ఎందుకని నీ కలల్ని తడిమాను
నా కలలదేవతే నీవని చెప్పనీ ఓ ప్రియా చేరువకాని గుండెలయని
51) గుండెల్లో కసి ఎగసి ఆకాశాన్నంటితే అంతా శూన్యమే కనిపించేను
ఎండిన కనుపాప వర్షించే కన్నీటి బొట్టులో ఆర్తనాదం ఎవరికి వినిపించేను
52) ఈ కనులు కన్నీటి వరదలై పారి
కన్నీటి కొలనులో కలలు కాగితపు పేలికలై రాలిపోతున్నాయి
53) జ్ఞాపకాల దుప్పటి కప్పుకున్న నిన్నటి కలల్నే తలుచుకుంటూ...
ముగింపులేని కధగా మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోతున్నానెందుకో చెప్పవూ
54) గుండెల్లొ గతాన్నీ... గడిపిన జ్ఞాపకాలనీ నింపుకొని...
గుప్పెట్లొ తెలిసిన రహస్యాలను దాచుకొని గుచ్చుకుంటున్న జ్ఞాపకాలను ఏంచేయను
55) నిశ్శబ్దంగా... కన్నీటి కలం నుండి జారుతూ...
మది కాగితం మీద పేర్చిన అక్షరాలు ఎర్రబడ్డాయి ఎందుకో
56) చినిగిన స్వప్నపు సంచిలో... చితికిన జ్ఞాపకాలను తలచుకొంటూ
ఆవేదనతో నన్ను నేను అద్దంలొ చూసుకుంటే మృతకళేబరం కనిపిస్తుందేంటి
57) నిశి రాత్రిలో కరిగిపొయే నా జ్ఞాపకాలకు విలువ కట్టగలవా
నేను స్మరించే నీ పేరును నా పెదవి అంచుపై ఎప్పుడూ ఉంటుందని నీకు తెల్సుగా
58) నీ ఆలోచనల చితిలో కాలుతున్నది ఎవరో గుర్తుపట్టావా
ఒకప్పుడు నీవిచ్చిన ఓదార్పు ఇప్పుడు నిన్ను నా భుజాలపై మోస్తుందని మరిచావు
59) జీవిత గమనంలో చీకటి కెరటాలను కప్పుకొని
నిరంతరం నిరాశతో నా మరణం ప్రయాణం చేస్తుంది మరి
60) గుండెల్లో చిరిగిన స్వప్నపు సంచుల్నీ కుట్టాలని చూసినా
గతాన్ని తవ్వాలని చూస్తున్నా చిరుగుల్లొంచి జారుతున్న జ్ఞాపకాలు
61) చీకటిలో జారిపోతున్నా నన్ను నేను ఓదార్చుకోలేక
వదలిపొయిన నీ స్నేహన్నీ విడవలేక మానిపోని గాయం మిగిలావెందుకో
62) నీ జ్ఞాపకాల తుంపర్లలొ తడుస్తూ
ఊహలను మరుమల్లెలను మనసు గుమ్మానికి కడుతూ
63) మనసుకు జ్ఞాపకాలు మరమేకుల్లా దిగబడుతుంటే
నా మనస్సెప్పుడొ మొద్దుబారి చచ్చి పోయిందెందుకొ
64) తప్పతాగి తందనాలాడుతున్ననా మనస్స్సు నీ కొసం
తులసి కొట చుట్టూ కన్నీటి దీపాలు వెలిగిస్తుంది ఎందుకని
65) తలుపులు మూసిన నా గుండె గదిలొ...
నీ తలపుల గడుసుతనం ఇంకా వేదిస్తునే ఉంది...
66) ముగింపులేని కధగా మిగిలిపొతున్నాను
మరుగున పడిన నిన్నటి మాటలను చీల్చుకుంటూ
67) ప్రతి రొజు నిజాన్ని కన్నీటి పొరలతొ కప్పుతుంది జ్ఞాపకం
నేను ఊహించిన అద్బుతమైన నిజాలన్నీ అవిరౌతున్నాఎందుకో ..?
68) కనురెప్పలు కాపలా కాస్తున్నా...
నీ కలలును ఆపలేకపొయాయి పిచ్చి జ్ఞాపకాలు
69) గుండెకు గుచ్చుకున్న తన జ్ఞాపకాల మువ్వలతొ...
తన జీవితం మీద తానే నిద్రపొయింది ఏం చేయాలో తెలీక
70) అంతులేని నీరీక్షణ...ఏదొ తెలియని ఆవేదన...
గతాన్ని జ్ఞాపకాలుగా గుండెల్లొ నింపుకొని నేనేం సాదించాను
71) మరు మల్లెపూల ఫానుపు మీద పడుకునే నీకేం తెలుసు...
నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి నిద్ర లేని చీకట్ల గురించి
72) నిన్ను నువ్వే బంధించుకొని...అవే నిజాలనుకొన్న క్షనంలో
కన్నీటి రూపంలొనిజాలన్నీ నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నాయి
73) నామనో భావాలను అర్ధం చేసుకుంటూ నేను ఒంటరిని
కాను అని నాపక్కన కూర్చొని నేను ఉన్నాను అంటుంది నా ఒంటరితనం
74) ఆలోచనలో అందం లేనప్పుడు
ఎంత అద్బుత సౌందర్యవతి అయితే ఎం లాభం
75 ) మౌనంతో కాలిపోతున్న నా మది చితి ఇంకా ఆరక ముందే
నన్ను నీ నుంచి నీ జ్ఞాపకాల నుంచి వేరుచేయడం ఏలా సాధ్యం అనుకొంటున్నావు
76) నీవు నన్ను పట్టించుకోనప్పుడు....
నిశ్శబ్దాన్ని గుండెలమీదేసుకుని జోకోట్టిన ఏకాంతాలెన్నో.
77) నీ సమక్షంలో ఒక్క క్షణం గడిస్తే చాలు
నీ కనురెప్పల చాటున చేరి ఓ స్వప్నం లిఖించడానికి
78) ఏం చేయను మౌనమై పోవడం తప్ప
కానరానని తెల్సి నీ కళ్ళల్లో నన్ను వెతుక్కోవడం తప్ప
79) ఎవరన్నారు నేను ఫ్రేమలో ఓడిపోయానని..
నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఘోరంగా ఓడి నన్ను వీడిపోయావు
80) నా ప్రేమ స్వచ్చమైనదైతే నీవెందుకు నాకు!నీ జ్ఞాపకం చాలు!