నే నొక్కడినే ఒంటరిగా
ఒంటరిగా నేనొక్కడినే
నా మూల గదిలో
గదిలోని మూలలో
నామనస్సులోని
నీ జ్ఞాపకాలతో కొట్లాడుతూ
జీవితపు తెల్ల డైరీలోని
నల్ల పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి
నిలదీసి సంజాయిషీ
అడుగుతున్నాయి ప్రియా
అపరాధ భావాలనఅంతర్మదనంతో
ప్రతిరాత్రి నిన్నే తలస్తూ
కన్నీళ్ళతో తలగడను తడుపుతూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా
నీవు లేని నేను లేను అని తెల్సీ
గదిలో గది వెలుపల స్థబ్ధత ఉన్నా
హృదయాంతరాలలో
మాత్రం విస్ఫోటనాల ప్రకంపనలు
ముగింపు లేని
ఈ జీవిత సమస్యల పరంపరలో
శాశ్వత విజయం కోసం పరితపిస్తూ
మనసంతా గాయాలతో
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని
స్వార్దం కోసం కొందరాడిని
నాటాకానికి సమిదనైనా..
గెలుపు దరి చేరని ఓటరినైనా..
ఆశసన్నగిళ్ళింది
మనసు నీరస పడింది
నాకు చావు దగ్గరకొచ్చినట్టుంది ప్రియా