సాయంత్రం సంద్యి
పిల్లగాలులు పలకరిస్తూ
పులకరిస్తున్న వేళ
తనువు మర్చి తన్మయత్మలో
ఎదురు చూపులు
చిరుగాలుల చిరుస్పర్శలు..
లయబద్దంగా వస్తున్న
తియ్యటి సంగీతం
అప్పుడే గుప్పుమన్న
నీ వంటి పరిమళం
పిల్లగాలి తత్తరపాటు..
దగ్గ్రగా వస్తున్న ఓ చిన్నది
చెట్ల కొమ్మల మద్యినుంచి దొంగచూపులు..
చూస్తున్న సరిగ్గా
కనిపించదేమి అని తత్తరపాటు
దగ్గరగా వస్తున్న ఓ చిన్నది
తన చిరు మందహాసంతో జారిపోతున్న క్షణాలు..
వెన్నెలెప్పుడు నిద్రపోయిందో
తెలీని అచేతనస్థితి!!
నాపక్కనే వెలుతూ
చూసిన కోరచూపులు
గుండెను అలా సర్రున కోశాయి..
ప్రతినరం ఒక్కొక్కొటిగా తెగినంత తీయ్యటి భాద
అటుగా వెళ్ళీ
ఎటుగా వచ్చావో
నీకోసం నాకళ్ళూ తడుముతుండగా
పక్కనే కూర్చున్న నీవు..
కరెంటు ఎక్కువై టప్పున బల్బు పగిలినట్టు
ఒక్కసారిగా పగిలిన నాచిన్నిగుండె
గుండెలదరగా మనసు చెదరగా
పక్కన నీవు..నిజమాకలనా
ఏదురు చూసిన క్షనాలు
ఇలా ఒక్కసారిగా
మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి