కదిలిస్తే చాలు గుండె ఒలికి పోతుంది
పలకరిస్తే చాలు మనసు
పులకించి పరవసించి పోతుంది
ఎలా ప్రారంభిచను ప్రియా
నీ కోసం ఏం రాస్తున్నానో తెలీక
నాలోని నిన్ను మినహా
నాలోనుంచి నన్నే తరిమేశాను
ఆహ్వానం లేకుండానే
నా హృదయంలో ప్రవేశించి
నా దృష్టిని నా మనస్సును
నీ వైపు మరల్చుకుంటున్నావు
నీవు రావు నన్ను పోనీవు
తీయ్యటి మాటలతోఊరించి
ప్రపంచానికి దూరం చేశావు
అందుకే మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నా
నా కలల ప్రపంచంలో నీఒక్కదానివే ఉంటావు
నిన్ను అలాగే చూస్తూ నేనుంటా ప్రియా
దిగులు కళ్ళతో,వెర్రి చూపులతో,
మరపు మాటలతో,
ఏమరపాటులో ఎదురుచూపులు
నీకోసం ఎక్కడ వెతకాలో తెలీక
నీ కోసం వెతికి వెతికి అలసి
చిక్కి శల్యమయ్యే ఈ నిర్భాగ్యుణ్ని చూసి
దిక్కులే నవ్వుతున్నాయి
చుక్కలు కూడా ఏడుస్తున్నాయి
నా జీవితాన్ని అల్ల కళ్ళోలం చేశావు
అనిపిస్తుంది నాకు
నీ ప్రేమకోసం నాదొక
నిరంతర పోరాటం
సముద్రపు కెరటాల ఉప్పెనలా
నిరంతరంగా..జీవనదిలా..
నిరంతరం నీకోసం వెతుకుతూనే ఉంటా ప్రియా