నిజాన్ని ఒప్పుకోలేను
గతం నుంచి తప్పుకోలేను
కన్నీళ్ళిప్పుడు శాశిస్తున్నాయి
జీవితగమనం రోజులెన్నో చెబుతున్నాయి
ప్రేమగురించి అంతబాగా చెప్పేనీవు
ఎదుటి మనిషిమనస్సును ఎందుకు చింద్రం చేస్తావు
నా గుండెళ్ళో భాద తక్కువైందనా
ఏదురుపడి మరీ గుండెళ్ళో గుచ్చుతున్నావు
నీవచ్చం మనిషిలానే ప్రవర్తిస్తున్నావు
ఏడుస్తుంటే చూసి పగలబడి నవ్వుతున్నావు
అందరూ మరనిస్తారు
కాని ఇలా ప్రతిక్షనం మరణించరేమో
నిశ్శబ్దపు డైనమేట్లేకాదు
వెటకారపు అక్షరాల అనుబాంబులు వేస్తున్నావు
ఎందుకిలా చేస్తున్నావు
ఎవరో ఒకరికోసం అవమానిస్తూ ఎందుకు ఏడిపిస్తున్నావు
నా శవయాత్రలో
దూరంగా నిలబడి పగలబడి నవ్వుతున్నదినీవేనా
నవ్వు విరగబడి నవ్వు
నాచావు నీకంత ఆనందానిస్తే.
ఇలా రోజూ క్షణ క్షణం చస్తూనే ఉంటా
ఏడ్చేందుకు కన్నీళ్ళు కూడా లేవు
గుండేళ్ళోంచి చిందుతున్న రక్తపు చుక్కలు తప్ప
ఇలాంటి క్షనాలకోసమా నేనెదురు చూసింది
నిజంగా నీవు మనిషివి అనిపించావు..
కాదు కాదు మనిషిలా నటిస్తున్నావు ప్రియా