ఈ నిశీధి లో
ఎన్ని రాత్రులను
కరిగిపోతున్నాయో
కాదన్న వాస్తవాల సాక్షిగా
నీవు దూరం అవ్వడం
దూరమవుతావో అని
భయపడ్డ క్షనాలు దగ్గర అవ్వడం
బరించడం చాలా కష్టం
భావాలను బందిచాలనే
విఫల ప్రయత్నంలో
వేడెక్కిన గుండే సాక్షిగా
ప్రతీ రాత్రి
లోకం అంతా నిదురపోతోంది
ఒక్క నేను తప్ప
నీవు నిద్రపోతూనే ఉంటావు
నీ ఆలోచనతో నేనున్నా
నా ఆలోచనలు నీకులేవుగా ప్రియా....?
నీ జ్ఞాపకాల సంకెళ్ళు
నాగొంతులో గుచ్చుకున్నాయి
మాట పెగలడంలేదు..
మనసు మాత్రం రగులుతోంది
అందుకే కాబోలు మాట పడిపోయింది
అందుకే పొద్దు పొడవని
రాత్రుల్లు కావాలి
రాత్రుల్లు చీకట్లో
ఒక్కడిగా మిగిలిపోవాలి
కాదనలేని నిజం కసుక్కున
గుండెల్లో దిగబడితే
కదల్లేని బావాలు
నన్నే కసుకుంటున్నాయి
నీండు జాబిల్లి
నీవెవరని అడుగుతుంది
సమాదానం లేనిప్రశ్నల్లో
సర్దుకొని పోనా..
నిన్ను సాదించే కున్నందుకు
నన్ను నేను శిక్షించుకోనా ప్రియా