ఓ జాబిలమ్మ
ఎక్కడున్నావు జాబిలమ్మా
చూడబోతే సిగ్గుతో
నల్లమబ్బుల చాటుగా దాగుతావు
చూపు తిప్పగానే తోంగి చూస్తూ
దొబుచులు ఆడతావు
ఏవో ఉసులు చెప్పబోతే
ఎవరు నీవన్నట్టు చూస్తావు
మౌనంగానేనుంటే నన్ను
చూసి కొంటెగా నవ్వుతావు
కోపంతో ముఖం తిప్పుకుంటే
ప్రేమతో బుజ్జగిస్తావు
కొంటె ఉసులాడుతు నన్ను నవ్విస్తావు
తనివి తీరకుండానే సెలవంటూ సాగుతావు
నా మదిలో సిరివెన్నెలు కురిపించే ఓ జాబిలమ్మ
మరల నీ దర్శనం ఎప్పుడమ్మా?
ఇన్ని మాయలు చేసి మనసు గుళ్ళచేసి
ఇలా మౌనంగా ఉంటే ఎలా జాబిలమ్మా నీకిది న్యాయమా