. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, January 28, 2013

సగం కాలిన శవాన్ని నేను ప్రియా


నిన్న కోసం మొన్న
నేటి కోసం నిన్న
రేపటి కోసం నేడు
బాధ పడుతూ జాలి పడుతూ
ఆవేశ పడుతూ అసహాయతతో
ఆందోళనతో బ్రతుకుతున్న
బడుగు జీవిని నేను ప్రియా

జీవితాన్ని జీవించలేక
వర్తమానంతో పోరాడ లేక
బ్రతుకు నడుస్తున్న బానిసను నేను
హృదయమే అడవిగా
మనసే ఎడారిలా రెంటికీ చెడ్డ
రేవడిలా భవిష్యత్తు భయంతో
బ్రతికే భ్రష్ట జీవిని నేను ప్రియా

కళ్ళుండీ కనపడనీ,
చెవులుండీ వినబడనీ
హృదయముండీ
స్పందించని మనసుండీ
మమత పంచని నిన్నడగలేని
నిర్బగ్యున్ని ప్రియా నేను

నీకై అడుగు ముందుకెయ్యలేని
అభాగ్య జీవిని నేను
నీతో మనసు విప్పి ఎవరు మాట్లాడినా
నా హృదయం తట్టి ఎవరు నిద్ర లేపినా
అర్థ చేసుకోలేని..ఆమోదించలేని
నేను బ్రతికున్న శవాన్ని
నా మనసంతా నిర్జీవమే
అందుకే అంటున్నాను
సగం కాలిన శవాన్ని నేను.