ప్రతి రోజు నువ్వు పలికే చిలక పలకులలో
బాగున్నావా అనే ఒక్క చిన్న మాట కోసం ..
ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా....
.ముగ్ధమనోహరంగా..చిలిపిగా ప్రేమగా ఒక్కసారైనా పిలిచావా..
.... నాతో మాట్లాడకున్నా. నా బాధని ..
కోపాన్ని దుప్పటిలో కప్పేసి..
కన్నీటితో నీకై ఎదురు చూస్తున్నాను..
నిద్రలేని ఈ రాత్రిలో ...నీ కొరకు
కిటీకీలోంచి చూస్తున్నాను
ఎక్కడున్నావ్?..ఎప్పుడొస్తావ్ ప్రియా..?.... ఎపుడు నా ఆలోచనలన్ని నీ గురించేనని
నిన్నే తలచుకుంటానని ఎలా తెలుపను.....
నీ ప్రతి తలపు రేగుతున్న గాయాలై..
గుండె నిండా భారమైన గేయాలై. .
ఎదురు చూస్తున్న నా కన్నీటికి..
నీ ఎద ఎప్పుడు కరుగుతుందో ప్రియా..గుండె భారమై బరువెక్కుతుంది....
నీ అన్వేషణలో తలదించుకోని
తప్పుకుంటున్న ఈ ఘడియలకేమైనా తెలుసా..
స్మ్రుతులు నురగలై పొంగుతున్నట్లు...
అవి నాలోనే పేలుతున్నట్టు....
ఆనందమైనా..విషాదమైనా...
గుండెలోనే దాచుకున్నాను..
నువ్వెక్కడ అని అడుగుతున్న
మనసుకు సమాదానం ఏమని చెప్పను...
తెలుసుకోలేని మతిబ్రమణంలా
పారేసుకున్న జీవితం గురించి
ఏమని చెప్పాలి ప్రియా.......
బాగున్నావా అనే ఒక్క చిన్న మాట కోసం ..
ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా....
.ముగ్ధమనోహరంగా..చిలిపిగా ప్రేమగా ఒక్కసారైనా పిలిచావా..
.... నాతో మాట్లాడకున్నా. నా బాధని ..
కోపాన్ని దుప్పటిలో కప్పేసి..
కన్నీటితో నీకై ఎదురు చూస్తున్నాను..
నిద్రలేని ఈ రాత్రిలో ...నీ కొరకు
కిటీకీలోంచి చూస్తున్నాను
ఎక్కడున్నావ్?..ఎప్పుడొస్తావ్ ప్రియా..?.... ఎపుడు నా ఆలోచనలన్ని నీ గురించేనని
నిన్నే తలచుకుంటానని ఎలా తెలుపను.....
నీ ప్రతి తలపు రేగుతున్న గాయాలై..
గుండె నిండా భారమైన గేయాలై. .
ఎదురు చూస్తున్న నా కన్నీటికి..
నీ ఎద ఎప్పుడు కరుగుతుందో ప్రియా..గుండె భారమై బరువెక్కుతుంది....
నీ అన్వేషణలో తలదించుకోని
తప్పుకుంటున్న ఈ ఘడియలకేమైనా తెలుసా..
స్మ్రుతులు నురగలై పొంగుతున్నట్లు...
అవి నాలోనే పేలుతున్నట్టు....
ఆనందమైనా..విషాదమైనా...
గుండెలోనే దాచుకున్నాను..
నువ్వెక్కడ అని అడుగుతున్న
మనసుకు సమాదానం ఏమని చెప్పను...
తెలుసుకోలేని మతిబ్రమణంలా
పారేసుకున్న జీవితం గురించి
ఏమని చెప్పాలి ప్రియా.......