పెదవి పై చాలా పేర్లు పలికేవి కాని
ఆ పలుకులు ఇంత మధురమైనవని
నీ పేరు పలికేవరకు తెలియదు ప్రియా...
నిజం గా నిజం...
నా కవితకు ప్రాణం గా మలుచుకున్నా
నీ చెరగని చిరునవ్వు ని మాత్రమే అని తెలుసా
ఈ కావ్యపు పదాలన్ని నీజ్ఞాపకాల తునకలే
అవన్నీ అనాలోచితంగా పేర్చినా ఇలా నే ఉంటాయి
అచ్చం చందమామలాంటి నీ మోములా..
నీ మనసు నను వీడనీ నీడల్లే విహరిస్తు
ప్రతిక్షణం నీతలపులతో నా కాలాన్ని కరిగిస్తూ
నీ జ్ఞాపకాల శ్వాసలో నీ పిలుపుకై వేచివుంది
కానీ ఎప్పటి వరకూ ఈ నీ మౌనం
అర్ధం కాని రాతిరిని...నీ తలపుల నిశాచరిని
నిన్ను తలచుకున్న ప్రతిసారి లయతప్పుతూ
భారంగా వెక్కిపడుతున్న గుండె సవ్వడి
నీకై అన్వేషిస్తున్నప్పుడు తలదించుకుని
తప్పుకుంటోంది ఎలా సమాధానమీయాలో తెలీదని
ఈ ఘడియలకే మందు పూయాలో తానెరుగనని
చుక్కల నవ్వుల్ని తోడిచ్చి జాబిలి దోసిలివంటి
నీ తలపుల నించి నన్ను జారవిడిచింది..నీ మౌనం
నీ జ్ఞాపకాలను వెంటేసుకుని నీకోసం వెతికాను
నీ చూపులుకై వెతుకుతూ నాది కానీ లోకంలో
కాని చివరకు నాకు మిగిల్చావు వేదనే ...
నువ్వు నాకేమీ కావనే సందేశాన్నిస్తూ....
అయినా నే వేచి ఉంటాను మరుజన్మవరకూ
నా ప్రేమన్నది నీకు అర్ధమయేవరకూ
నీ మనసు నాకు మాత్రమే సొంతమయ్యేవరకూ....
ఎందుకంటే నేనప్పుడూ ఇప్పుడూ...ఎప్పుడూ ....
చెలీ! నీ సుఖమే కోరుకుంటా కడవరకూ.....