రేపటి ఉదయానికి
నాతో నడచే స్నేహానివనుకున్నా
కలలేన్నో కన్నా ప్రియా
కన్నీరే మిగిల్చవెందుకో
అదే నీకిష్టం కనుక
మౌనంగా రోదిస్తున్నా
నీకిష్టమని..
ఎందుకంటే
కష్టమైనా ..
నీ ఇష్టమే నాకిష్టం ప్రియా
చల్ల గాలిలొ నీకోసం పరితపిస్తూ
నీ జ్ఞాపకాల తోటలో విహరిస్తున్నా
మౌనరోదనలో
రాత్రంతా పరిహసించిన
పెనుగాలిని లెక్కచేయని
ఆత్మవిశ్వాసం
ఆకుల మధ్య మెల్లగా
విచ్చుకుంటుంటే
కళ్ళు మూసుకొని నీకోసం ఆలోచిస్తున్నా ప్రియా
తియ్యటి స్వరం వినిపించింది
సన్నని పరిమళం
మనసుని మెత్తగా
హత్తుకుంది!
నీజమేమో అని
హృదం నాట్యమాడగా
ఆనందిస్తున్న క్షణాన
ఉలిక్కి పడి లేచా
అది కల అని అప్పటికి కాని తెలీలా ప్రియా