ప్రియా మంచు ముత్యమై
నీపై వాలిపోవాలని ఉంది
చినుకునై నిన్ను
తాకాలని ఉంది కాని...
ఎండనై మండిపోతున్న
మాటనై నీ పెదవిపై
పలకాలని ఉంది కాని...
ప్రియా మౌనమై మిగిలిపోతున్న
ఆశనై నీ మదిలో
నిలచి ఉండాలని ఉంది
నిరాశానై కరిగిపోతున్న,
ప్రియా నీ శ్వాసనై నిన్ను చేరాలని ఉంది కాని...
ఊపిరి వదిలి వెల్లిపోతున్నా
నాకు భాదలేదు
నీగుండేలో ఉన్నా అని తెలిస్తే
ఊపిరి ఆగిపోయినా సంతోషంగా
మృత్యువుని ఆహ్వానిస్త ప్రియా
నీవు నమ్మినా నమ్మకా పోయినా