. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 27, 2013

నన్నేప్పుడో చంపేశారు..ఒకసారికాదు రెండుసార్లు


ఎన్నో నెలలుగా వెతుకుతున్నా
అయినా దొరకడంలేదు..
నేను పారేసుకున్న మనసుకోసం కాదు


చుట్టూ ఎముకల గూళ్ళు
చుట్టూ చచ్చి పడిన శవాలు
ఎంతవెతికినా నాకింకా దొరకనేలేదు
నాదగ్గరకూడా చచ్చిన శవం వాసనే

నన్నేప్పుడో చంపేశారు
ఒకసారికాదు రెండుసార్లు
చంపడం వాళ్ళకిష్టంకాబట్టి ఇలా అయ్యా 
ముక్కలైన శవంలా

ఎందుకో ఒక్కసారి గతం గిర్రున తిరిగింది
ఇష్టం అని చెప్పిన మనిషి
ఎవరి వంచనో చేరి నన్ను చంపేసింది
వాడు నన్ను చంపుతుంటే తనూ నవ్వుతూ
నామీద దారుణంగా దాడి చేసి చంపేసి 
నవ్వుతూ వెళ్ళీపోయారు..అప్పుడే ఓ వింత

కొసప్రాణం ఉన్న నన్ను
ప్రాణం పోసింది..ఓ అందాల బొమ్మ
నన్ను నేను నమ్మలేనంత ప్రేమ చూపించి
ప్రపంచంలో ఇంతలా ప్రేమించే వాళ్ళుటారా అన్నంత
నిజం అని నమ్మా ..
ఆ నమ్మకం నిజంకాదని కొద్దిరోజులకే తెల్సింది

అంతే తనూ అంతకంటే దారూణంగా
చంపేస్తుంది..సేం.. మళ్ళీ దారుణంగా
 అందరిలోఅవమానిస్తూ ..
వెటకారమనే పదునైన కత్తులతోదాడి .
తనెప్పుడైనా ..జాలి పడుతుందేమో అని
తనవైపు జాలిగా చూశా..లేదు
ఆచూపుల్లో ఏం అర్దం చేసుకుందో
మళ్ళీ బంగారం అంటూ ఎవరినో తీసుకొచ్చి
దారుణంగా అతనితో చేరి దాడి చేసింది
ముక్కలు ముక్కలుగానరికేసింది నన్ను

అవును తనూ మనిషేగా..
అందుకే మనిషిలా చేసింది
తనతప్పేముంది చెప్పు..నిజాన్ని ఒప్పుకోవాలిగా..?

ఇప్పుడే నాశవం తాలూకా ముక్కలు 
ఏరుకొచ్చి కుప్పకుప్పగా పెట్టుకున్నా

కాని నేను అనుకున్నది దొరకలే 
ఎంతవెతికినా దొరకలే..
చుట్టూ శావాలే..
నేను వెతుకుతునంది మాత్రం దొరకలేదు

అదిగో ఎదో కనిపిస్తుంది 
అదేనా నేను వెతుకుతుందని దగ్గరకు వెల్లా
చూస్తే చిరాకేసింది ...అది నా మనస్సు

ఎందుకో ఒక్కసారిగా నామనస్సుమీద
నాకు చెప్పలేనంతకోపం
పదునైన కత్తి తెచ్చి ముక్కలు ముక్కలు చేద్దాం అని
నా మనస్సుమీద కత్తితో ఒక్కవేటు వేశా
నామనస్సు రెండుగా నిలువునా చీలిపోయింది  

అప్పుడో వింత జరిగింది
అప్పటినుంచి నేను వెతుకుతుంది 
కనిపించింది..అదే..నీజ్ఞాపకాలమూట
నీజ్ఞాపకాల మూట నా మనస్సులో బద్రంగా ఉంది
అమ్మయ్యనాశ్రమ ఫలించింది..
నీజ్ఞాపకాల మూటను బద్రంగా తీసుకున్నా

ఓ చెట్టు క్రిందకెళ్ళి కూర్చున్నా
నీజ్ఞాపకాల మూటనూ తీసుకేల్లా
ఎందుకో తెలుసా 
నీవు అన్నావుగా 
మన జ్ఞాపకాలనీ మూటగట్టి పెట్టు
ఏకాంతంలో జతచేరుతా అని
అందుకే ఈ స్మశానంలో
నీజ్ఞాపకాల మూటతో ఏకాంతంగా ఎదురు చూస్తున్నా
వస్తావు కదా ప్రియా..మాట మార్చవుగా..