ప్రేమ కి రూపం లేదు.
అది మనం ప్రేమించే వ్యక్తిగానో,
మనని ప్రేమించే వ్యక్తిగానో
మాత్రమే రూపుదిద్దుకుంటుంది.
నేనూ ఒకప్పుడు నాలో నేను.
తన ఆగమనం నా జీవితంలో
జరిగే వరకు ఇలా..
నేనింకా నీ రాక కోసం వేచివున్నానని,
నీవొచ్చే దారులు వెదుకుతున్నానని
చెప్పాగా నీకు, ఇపుడూ
నేను వెదుక్కుంటున్నా ...
వెదుకులాటలోనే వున్నానని
వుసూరుమంటూనేవున్నా
ఎందుకంటే ఎపుడూ
వెదుక్కుంటునేవున్నా,
వెదికినవేవి నాకు దొరకవని తెల్సి
గురుతుకీ రాదు మరి
వెదకాల్సినవింకేవీ లేవని ఆపేసిన క్షణం
మిగిలిన నన్ను నేను మళ్ళీ
వెదుక్కోవాలని అనిపిస్తుంది,
నేను కనుక నాకు మళ్ళీ దొరికితే
ఈ సారి మాత్రం వెదకటాన్ని ఇంకెవరికైనా
వీలునామా వ్రాసేయాలని.
వెతుక్కోవాల్సినవి మాత్రం వారు ఎంచుకోవాలని
నే వెతికినవేవీ ఈ లోకంలో ఇంకెక్కడా వుండవని
నా కెపుడోనే తెల్సిందని చెప్పటానికి
మాత్రం మాటలు వెదుక్కుంటున్నా
ఆవి వినే మనిషి కొరకు మాత్రమే
ఇపుడు వెదుక్కుంటున్నా
మరి చెస్తావా ఆ మాట నాకు,
నే వెదుక్కున్నది నిన్నేనని?
ఇప్పటికైనా నీకు అర్దం అయ్యేఉంటుంది ప్రియా