. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, January 2, 2013

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..

పల్లవి:
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

నా గుండె ఏనాడో చేజారి పోయింది..
నీ నీడగా మారి..నా వైపు రానంది..
దూరాన ఉంటూనే.. ఏం మాయ చేసావో..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

చరణం:
నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..గడిపేదెలా కాలం

పగలైనా కాసేపు పని చేసుకోనీవు..
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది..
నువుకాక వేరేదీ కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది!

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది..

మతిపోయి నేనుంటే..నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..

చిత్రం: గులాబి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: శశి ప్రీతమ్
గానం: సునీత