ఏదో చెయ్యాలని ఉన్నా ….ఏం చెయ్యాలో తెలియక
సమస్యేంటో తెలిసినా….పరిష్కారం పాలుపోక
ప్రపంచంలో ఇంతమందున్నా ….భుజం తట్టే వారు ఒక్కరూ లేక
నీలోనే ఒక నేస్తమున్నా ….తనతో మాట్లాడ బుద్ధికాక
ఓదార్చే చేతుల కోసం….సేదదీర్చే ఒడి కోసం
బేలగా ఎదురు చూస్తూ బాధగా బ్రతుకీడుస్తూ
నిమిషం అనేది నిరాశ రూపం గా కనిపిస్తే
అది ఆనందానికి అంటరానితనం
దాని పేరే ఒంటరితనం
అదినీవిచ్చిన గొప్పవరం కదా ప్రియా
సమస్యేంటో తెలిసినా….పరిష్కారం పాలుపోక
ప్రపంచంలో ఇంతమందున్నా ….భుజం తట్టే వారు ఒక్కరూ లేక
నీలోనే ఒక నేస్తమున్నా ….తనతో మాట్లాడ బుద్ధికాక
ఓదార్చే చేతుల కోసం….సేదదీర్చే ఒడి కోసం
బేలగా ఎదురు చూస్తూ బాధగా బ్రతుకీడుస్తూ
నిమిషం అనేది నిరాశ రూపం గా కనిపిస్తే
అది ఆనందానికి అంటరానితనం
దాని పేరే ఒంటరితనం
అదినీవిచ్చిన గొప్పవరం కదా ప్రియా