మబ్బుల్ని గుండెల మీదకు లాక్కుని..
పచ్చని ప్రకృతి దుప్పటితో
నీ జ్ఞాపకాల్నిపరుచుకొని పడుకుంటాను
నన్నిప్పుడు చుట్టుముట్టే నిరాశల వేడిగాలుళ్ళో
నేను కాలి బూడిద ఔతానేమో ప్రియా
ప్రతిరాత్రి వచ్చే ఆకొద్దిపాటి నిద్రలో
ఉలిక్కిపాటు కలవరింతల్లో
ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా కనిపిస్తావు
వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయి హటాత్తుగా మాయమౌతావు
మళ్ళీ లీలగా నీ జ్ఞాపకాల కందిరీగలు
చుట్టుముట్టి నాగుండెపైదాడి చేస్తాయి ప్రియా
నీ కలలకు బద్ధలైన కళ్ళలోంచి నెత్తురో కన్నీరో
అర్దంకాని పరిస్థితుల్లో
నారోదన నీకు వినిపిస్తుందో లేదో ప్రియా
అన్నీ తెల్సినా నీవు మాత్రం కలగా మిగిలావు