కనపడని అడుగులు చేస్తున్న శబ్దం
గళ్ళు గళ్ళు మని
అదియల శబ్దం లయబద్దంగా
ఏదో నాకు వినిపిస్తుంది
టక్కున నిశ్శబ్దాన్నీ చేదిస్తూ
గుండెలదిరేలా పెద్ద శబ్దం
కిందపడి భళ్లున పగిలి
ముక్కలైన మౌన శిథిలాలు
చెల్లా చెదురుగా విడివడి
లెక్కలేనన్ని రూపాలను
సంతరించుకుంటున్నాయి
మనసు అగాథంలో ఎక్కడో
అణు విస్ఫోటం జరిగి
నా అణువణువుకూ పాకి
ప్రకంపనలు సృష్టిస్తుంది
ఏదో తెలియని శక్తి
నా నరనరాలగుండా ప్రవహించి
నన్ను ఉత్తేజపరుస్తుంది
ఎన్నో రంగులు పులుముకున్న
అందమైన దృశ్యమొకటి
నా కంటి నాడులపై నాట్యం చేస్తుంది
కకలావికలమైన ఆలోచనల ఉప్పెన
చివరకు సద్దుమణిగి నా ముందొక
అందమైన చిత్రాన్ని ఆవిష్కరించింది
లోతెరుగని లోయల్లోకి
జారిపోతున్న నా చేతికి
ఓ చెట్టుకొమ్మ దొరికింది
నాకు ఆధారంగా నిలుస్తూ
అరే అదేంటి అక్కడ నీవు కనిపిస్తున్నావు
నీ తియ్యని స్వరం వినిపిస్తుందేమిటి.
ఆనువ్వు నీవేనా ఆనవ్వునీదేనా ప్రియా
ఉలిక్కిపడి చూస్తే అంతా చీకటి ఎక్కడనీవు ..
ఏదా అద్బుత దృస్యిం..అందమైన జలపాతంలాంటి నవ్వు ఎక్కడున్నావు ప్రియా
గళ్ళు గళ్ళు మని
అదియల శబ్దం లయబద్దంగా
ఏదో నాకు వినిపిస్తుంది
టక్కున నిశ్శబ్దాన్నీ చేదిస్తూ
గుండెలదిరేలా పెద్ద శబ్దం
కిందపడి భళ్లున పగిలి
ముక్కలైన మౌన శిథిలాలు
చెల్లా చెదురుగా విడివడి
లెక్కలేనన్ని రూపాలను
సంతరించుకుంటున్నాయి
మనసు అగాథంలో ఎక్కడో
అణు విస్ఫోటం జరిగి
నా అణువణువుకూ పాకి
ప్రకంపనలు సృష్టిస్తుంది
ఏదో తెలియని శక్తి
నా నరనరాలగుండా ప్రవహించి
నన్ను ఉత్తేజపరుస్తుంది
ఎన్నో రంగులు పులుముకున్న
అందమైన దృశ్యమొకటి
నా కంటి నాడులపై నాట్యం చేస్తుంది
కకలావికలమైన ఆలోచనల ఉప్పెన
చివరకు సద్దుమణిగి నా ముందొక
అందమైన చిత్రాన్ని ఆవిష్కరించింది
లోతెరుగని లోయల్లోకి
జారిపోతున్న నా చేతికి
ఓ చెట్టుకొమ్మ దొరికింది
నాకు ఆధారంగా నిలుస్తూ
అరే అదేంటి అక్కడ నీవు కనిపిస్తున్నావు
నీ తియ్యని స్వరం వినిపిస్తుందేమిటి.
ఆనువ్వు నీవేనా ఆనవ్వునీదేనా ప్రియా
ఉలిక్కిపడి చూస్తే అంతా చీకటి ఎక్కడనీవు ..
ఏదా అద్బుత దృస్యిం..అందమైన జలపాతంలాంటి నవ్వు ఎక్కడున్నావు ప్రియా