ఇప్పుడేదో అంతా
మాయగా ఉంది
నా చుట్టూ
ఎడారి పరుచుకున్నట్లు
నా పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో రంగుమారి
రక్తవర్నమైపోతున్నట్టు
చెమటలు పడుతున్నా దేహంలో
వేడి ఆవిర్లు చిమ్ముతున్నాయి
ఎక్కడ తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..
ఎవరో నాచర్మాన్ని
చీలుస్తున్నట్టు
తట్టుకోలేని భాద
గుండేలొంచి తన్నుకొస్తుంది
అంతా రంగు రుచి
లేని ఓ విషమేదో
కషాయంలా గొంతులో
మండె అగ్నిగోళాలై జారి
ఏదో విషం గొంతులోకి బలవంతంగా
దిగుతున్నట్టు తట్టుకోలేని
బాధ తెలియని చెప్పుకోలేని వేదన
ఒంటరితనంవైపు పరుగులు
పెడుతున్న ఏకాంతం
నీషారాత్రి చిమ్మచీకట్లో లీలగా
వినిపిస్తున్న విషాదగీతాలు
గుండెను కెలికేస్తున్నాయి ఘోరంగా
నన్నేవరో ఊపిరాడకుండా
గొంతు నులిపేస్తున్నారు
లీలగా చూస్తే అక్కడ
నీవే కనిపిస్తున్నావేంటో..నీవే కదూ
చుట్టూరా కమ్ముకున్న
చిమ్మచీకటి రాత్రుల్లలో
ఈ సమ్మె వాతావరణంలాంటి నిశ్శబ్దంలో
గుండే చప్పుడే బయంకరంగా వినిపిస్తోంది
నాలుక పిడచకట్టి గొంతెండిన
వేసవితనం వెంటాడుతోంది…
నాకేదో జరుగుతోంది నన్నేదో చేసేస్తున్నారు
మాయగా ఉంది
నా చుట్టూ
ఎడారి పరుచుకున్నట్లు
నా పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో రంగుమారి
రక్తవర్నమైపోతున్నట్టు
చెమటలు పడుతున్నా దేహంలో
వేడి ఆవిర్లు చిమ్ముతున్నాయి
ఎక్కడ తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..
ఎవరో నాచర్మాన్ని
చీలుస్తున్నట్టు
తట్టుకోలేని భాద
గుండేలొంచి తన్నుకొస్తుంది
అంతా రంగు రుచి
లేని ఓ విషమేదో
కషాయంలా గొంతులో
మండె అగ్నిగోళాలై జారి
ఏదో విషం గొంతులోకి బలవంతంగా
దిగుతున్నట్టు తట్టుకోలేని
బాధ తెలియని చెప్పుకోలేని వేదన
ఒంటరితనంవైపు పరుగులు
పెడుతున్న ఏకాంతం
నీషారాత్రి చిమ్మచీకట్లో లీలగా
వినిపిస్తున్న విషాదగీతాలు
గుండెను కెలికేస్తున్నాయి ఘోరంగా
నన్నేవరో ఊపిరాడకుండా
గొంతు నులిపేస్తున్నారు
లీలగా చూస్తే అక్కడ
నీవే కనిపిస్తున్నావేంటో..నీవే కదూ
చుట్టూరా కమ్ముకున్న
చిమ్మచీకటి రాత్రుల్లలో
ఈ సమ్మె వాతావరణంలాంటి నిశ్శబ్దంలో
గుండే చప్పుడే బయంకరంగా వినిపిస్తోంది
నాలుక పిడచకట్టి గొంతెండిన
వేసవితనం వెంటాడుతోంది…
నాకేదో జరుగుతోంది నన్నేదో చేసేస్తున్నారు