1) నేను నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయానిప్పుడు
నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకున్నా అదే మౌన భాష
2) ఒకప్పుడు మనమాటలు మంచు ముత్యాలై గుండెల్లో జాలువారేయి
ఇప్పుడేంటీ అవి జ్ఞాపకాల్లో చేరి అగ్నిగోలాలుగా మారి గుండెను తగలబెడుతున్నాయి
3) ఎందరి దుఃఖాన్ని మేఘంగా ధరించిందో
ఒక్క ఉరుముతో కన్నీటి జళ్ళు కురిచేస్తుంది మేఘం భాదను తట్టుకోలేక
4) మేఘాల భారాన్ని చినుకుల్లా మర్చే
ఆకాశానికి తెలుసు అసలు రహస్యం....అదేంటో చెప్పవూ...?
5) నల్లటి మబ్బులో పుట్టి మట్టిలో కలిసిపోయే చినుకులు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా విడిపోవడమెందుకో కాస్త చెప్పవూ...?
6) నా గుండెల్లో దిగబడ్డ ప్రశ్నల్ని పెకిలించాలని చూస్తావేం...?
7) నీవు లేని నేను ఎందుకని నన్ను నేను విసిరేసుకున్నా
అవేనేమో ఆకాశంలో చుక్కలై నీకోసం వెతుకుతున్నాయి
8) ఎప్పుడూ నీ పిలుపులా మ్రోగే మొబైల్ ఫోన్
నీ హ్రుదయంలా సైలెంట్ మోడ్ లోకి వెల్లిపోయింది ఎందుకో
9) చుట్టూ చిమ్మచీకటి వెలుతురు అస్సలు లేదు
నా హృదయాన్ని తగలబెడితేగాని వెలుగులో నిన్ను చూడాలేనేమో
10) నా నుదుటి స్వేదం గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది నాగుండెల్లో చేరిన నీజ్ఞాపకాల అలజడికి
11) నీవు దూరమై రోజులైనా నాకు మాత్రం మూడు కాలాలు
ఆరు ఋతువులు చివరగా లక్ష నిస్పృహలు గా మిగిలిపోయానని పిస్తోంది
12) నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం నా ఆలోచలన్న్నిటిని
పగులగొట్టి నాకు నేను విదించుకున్న శిక్ష మౌనం
13) ఆలోచనల అలల్లో తీరం దాటకుండా
నా మౌన సామ్రాజ్యంలో ఒక్కడిగా మిగిలిపోయా
14) నీవస్తావని ఎదురు చూసి చూసి ఆశ చచ్చిపోయింది
అందుకేగా మౌనమనే చీకటి గుహలో నన్ను నేను కట్టేసుకున్నా
15) నేను నీజ్ఞాపకాలను పలుకరిస్తున్న క్షనాలలో
ఏంటో కాలం నన్ను పట్టించుకోకుండా పరిగెత్తుతూనే ఉంది నీలా
16) రాత్రుల్లు కొన్ని ప్రశ్నలు కౌగిలించుకుంటాయి ఇప్పటికీ
ఉక్కిరిబిక్కిరి చేసి నిద్రను చెడగొట్టి ఉదయం అయ్యేదాకా వదలవు
17) నా గుండెలోపల చీకటిగదిలో నీవేం చేస్తున్నావు
కష్టపడి నీ జ్ఞాపకాల సౌదాలను నీవే కూల్చేస్తున్నావా
18) అమ్మను సైతం అమ్మజుపే నమ్మక ద్రోహులను
నయవంచకులను చుట్టూ పెట్టుకొని మురిసిపోతున్నావు జాగ్రత్త
19) కసాయి స్నేహంలో ఇరుక్కపోయిన నష్ట జాతకున్ని నేను
బైటికి రాలేను ...మోసపు మనసు గదిలో నాకు గాలాడటంలేదు
20) ఆరోజు ఉదయం ఏదో బరువుగా ఉంది
విరిసిన పుష్పాల పై రాత్రి మిగిల్చిన కన్నీటి చుక్కల్లా మంచుముత్యాలు
21) నిశ్శబ్దపు అంచులమీదకు జారిన జ్ఞాపకాలు
నిప్పు కణికలై మనసులో మంటలు రేపుతున్నాయి
22) నా తలపులను తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం బరించరానిదిగా మారినప్పుడు
ఈ నిఘంటువులెందుకు ? గుండెకోతతో రాసే ఈ రాతలెందుకు..?
23) నా మనస్సును పావురం అంత ప్రేమగా చూసుకొని ఇప్పుడెందుకు
రాళ్ళేస్తున్నావు... గాయాలవ్వలనా తగిలిన గాయాలు సరిపోలేదనా...?
24) మౌన భాషలో..మనసు ఒదిగిపోతుంది..
కళ్ళుమూసుకున్న .. మనసు నీకోసం తడుముతోంది
25) చిన్న శబ్దానికి పెదవులు భయపడి మనసు మూగబోతే
నీజ్ఞాపకాలు చేస్తున్న అలజడులను అస్సలు తట్టుకోలేకపోతోంది నా హృదయం
26) నా కలల్ని ముక్కలు చేసి కవితల్ని చెక్కుతున్నా గాని
ఎందుకో హృదయానికి తగిలిన గాయాలే కనిపిస్తున్నాయి అందులో
27) పగిలిన నా గుండె ముక్కలపై నడుస్తున్న
నీ పాదాలకు ఆ ముక్కలు గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉంది
28) నీ కోసం నిరీక్షిస్తూ కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి చూస్తూ,
కర్సైపోతున్న కన్నీటి సాక్షిగా నీకోసం కలల పొలంలో భ్రమల నీడల్లో ఎదురుచూస్తున్నా
29) అక్షరాల బరువుతో అలసిన మనసు పుస్తకంలో
ఎందుకు మనిద్దరం అన్ని ప్రతిపేజీ చించి తగలేశావు
30) నీ మౌనపు తుఫాను తాకిడికి
గుండెనరాలు తెంచుకొన్న భావాలు బలౌతున్నాయి
31) నా హృదయాన్ని పంచనామా చేసి చూడు
నీవు ఇప్పటిదాకా చూడలేని భావాలు తరచి చూడచ్చు
32) నిమిషాలు..క్షణాలు..గోళీల్లా దొర్లిపోతుంటే..
నాలో నేను..నాతో నేను పలుకరించుకోలేక పోతున్నా
33) రెండు శరీరాల మధ్యేకాదు ఒకే ఆత్మకూ
రెండు దారుల మధ్య వంతెన అతి సున్నితమైనది --- ఇక్బాల్ చంద్
34) ఒక ఊహలోంచి యధార్థంలోకి పయనానికి సమాయత్తం
అవుతున్న వేళ ఎన్నెన్ని అవమానాలో... ఎన్నెన్ని అవేదనలో
35) ఒక్క క్షణమైనా నిన్ను
నీవు విడిచిపెట్టు నా జ్ఞాపకాల నదిలోకి..ప్లీజ్
36) పిచ్చి మనస్సాక్షి ఎప్పుడూ
ఓడిపోతూనే ఉంది నన్ను మనిషిగా గెలిపించడానికి..
37) నన్ను నీవు ఓడించానని సంబర పడుతున్నావు
నీచేతిలో ఓడిపోయానన్న సంతోషాన్ని మిగిల్చావని మర్చిపోతున్నావు
38) కన్నీళ్ళు తాగి కొనఊపిరితో ఉన్న జ్ఞాపకాలన్నిటిని
పొలిమేరలో సజీవ సమాధి చేస్తున్నాను నా పార్దీవ దేహం తోపాటు
39) నీ కన్నీటి మంట నా చితికి నిప్పుగా మారి
నన్ను తగలబెడుతోంది మరికాసేపట్లో బూడిదౌతాను
40) నాడేమో తీపికల..నేడేమో పీడకలగా మారిపోయానేంటో
41) కన్నీటి సునామీ కంటి తీరం
దాటి రావాలని పరుగులు పెడుతోంది నీకోసం
42) ఎదమాటున దాగున్న అలజడితో
మూడడుగులు దూరంగా సాగిపోయిన జీవన పయనం
43) గాయమై మిగిలిపోతుంది అనుకున్నప్పుడు
అలాంటి పరిచయం కాకుండా ఉంటే ఎంతో బాగుంటుందికదా...?
44) క్షణం గడిచే సమయంలో
మనసులో యుగం గతంలోకి తిరగబెడుతుంది
45) దగ్గరగా ఉన్న వన్నీ వదులుకొంటూ
దూరంగా ఉన్న దేని కోసమో ప్రయత్నిస్తుంటా రెందుకో
46) నా గుండెల్లో నిశ్శబ్దం అగ్నిపర్వతమై పేలుతుంది
మౌనం మాటున దాగివున్న మాటలు చురకత్తులై గుచ్చుకుంటున్నాయి
47) మన గతకాలపు జ్ఞాపకాలు
మర్రిచెట్టు ఊడల్లా మనసంతా అల్లుకుపోయాయి
48) నీ విరహాన్ని అనుభవించిన అంతరంగం
జ్ఞాపకం గా చేజారి నిస్సహాయతకు అక్షర మై స్పందిస్తూంది
49) నా గుండె చనిపోయి సంత్సరాలు గడుస్తుంది
మళ్ళీ చివురు తొడుగుతుందేమో అని నిత్యం కన్నీరు పోస్తూనే ఉన్నాను
50) గుండె తూట్లుకి మాటలనే వెటకొడవల్లతో దాడి చేశావ్
ప్రేమ రాజ్యానికి ఒంటరిగా మిగిలిన రాజునై గుండెల్లో అగ్గిరాజేసుకున్నా
51) తెల్లారితే నీ వెంట తిరిగే నీడను నేను
చీకటి కమ్ముకుంటే నిద్రమాని చెట్లపైవేలాడే గుడ్లగూబను..
52) నీవు నవ్వుతూ గడిపేస్తున్నప్పుడు
మండుటెండలో మంచులా కరిగే నేను గుర్తుకురానేమో...?
53) నామనస్సిప్పుడు పగిలిన అద్దం
జ్ఞాపకమై గుచ్చుకున్న ప్రతిసారి రక్తమేవస్తుందేంటి ....?
54) నా మనసుపై రక్తపు మరకలా..?
అవి నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు కదూ...?
55) చీకటి గతానికి ఓ తీపిగుర్తు
ఉదయం ప్రస్తుతానికి మాయనిమచ్చ..?
56) అందరూ నిద్రలో ఉన్నారు
నేను మాత్రం నీ జ్ఞాపకాలతో మెలుగువగా ఉన్నా...?
57) మనసు మాటలకు ఎర్రటి రక్తాన్ని పులిమి
కార్చే కన్నీరును చూసి నటిస్తున్నంవంటే ఏం సమాదానం చెప్పను
58) చిద్రమైన దేహపు గాయాలన్నిటిలో
మదిలో ఒలకబోసిన యాసిడ్ గామరింది నీ వెక్కిరింఫు
59) ఒయ్ నీవు నన్ను వదలి వచ్చావు
మరి కనీసం నన్ను నాకు ఇవ్వలేదు ఎందుకని
60) నిశబ్దాలను చీల్చుకుని నాలో నేను
చనిపోయి నాలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
61) శబ్దానికి నిరాశకి నిశ్శబ్దపు ఓదార్పవ్వడంతో
బాధల అగాధాల్ని కప్పేసిన జ్ఞాపకం గుచ్చుకొంటుంది
62) స్వప్నాల పచ్చిక మీద అఘాదాలు
సృష్టిస్తూ సాగుతున్న నిశ్శబ్ద చిత్రకారుడిగా మారాను
63) నా మనస్సులోని ప్రేమను హత్యిచేసి ఎందుకు హంతకురాలైయ్యావు..?
64) ఇద్దరూ మంచిగున్నప్పుడు ఉన్న "రెస్పెక్టు"
విడిపోతే అది వెటకారంగా మారుతుందా ఇదేనా స్నేహం అంటే..?
65) ఏంటో జీవితం నేనిలా ఐపోయాను ఎవరికి ఏం చెప్పాలో తెలీక
నా మాటలను నామీదనే జల్లుకొంటున్నా... ఏంటో గుచ్చుకుంటున్నాయి
66) ఎప్పుడు ఎలా ఉంటుందో కొంత అర్ధం అయ్యీ అవక
మరికొంత అర్ధం కాని రహస్యంలా స్వేచ్ఛకు మరో రూపంలా...మారింది నీజ్ఞాపకం
67) నన్ను నేను వెతుక్కుంటున్నా..ఎవరికైనా కనిపిస్తే కాస్త నాకు చెప్పరూ ..
68) గాయం మానాక మచ్చ కూడా పడుతుందేమో కాని
జ్ఞాపకాన్ని పట్టించుకోకపోతే మాత్రం అది నిలువునా తగలబెడుతుంది..?
69) మనసులో నిర్వేదం నా గుండెని కోస్తుంటే
మౌనంగా ఉండతం తప్ప మరేమీ చేయలేని విచిత్రస్థితి
70) కడదాకా కలిసొస్తానంటూ మాటివ్వు
జీవితాంతం ఎదలో కాస్త చోటివ్వు..ఒయ్ కనిపించవేం..?
71) నిజంకోసం తడుముకుంటున్న నాకు
వెనుదిరిగి చూస్తే ఎక్కడా.. కనిపించవేం? ఏమైపోయావు?
72) నీ గుండె లోతుల్లోని రహస్యాలు విందామని
ఆరాటపడే ఆశతో హృదయం చేసే అలజడే గుండెచప్పుడు
73) ఏమి చేయాలో తెలీక తడబడుతూ
నేను "కల"కి దగ్గరయి "నిజానికి" దూరం అయ్యాను
74) కన్నీళ్ళు కాలువలై పారుతుంటే
ఙ్ఞాపకాలు పడవలుగా తేలుతున్నాయి ఎన్నాళ్ళిలా
75) ఇద్దరు మిత్రులునిజంగా ..విడిపోవడమంటే చనిపోవడమేనేమో..