. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 22, 2013

నన్ను నాకు ప్రాణాలతో ఇవ్వవా ప్లీజ్

చీకటి రాత్రి  నీఆలోచనలతో 
స్వేదబిందువులు 
రక్తపు వర్నంగా 
మారుతున్నాయి
రక్త చరిత్రలు రాస్తున్నాను  
నాకోసం నేను
 అక్షరాలతో కాదు 

హాహాకారాలతో,
 శ్వాసించలేని 

మనిషినైనా ఇప్పుడు
నన్ను నాకు ప్రాణాలతో 
ఇవ్వవా ప్లీజ్
ఎందుకిలా నాప్రాణాలు 
తోడేస్తువో తెలీదు
ఇదీ అని అడగలేని నిస్సహాయత.. 

నేనేంటొ తెలియని స్థితి..
శిలగా మారానెప్పుడో

నన్ను నేనుగా మర్చిపోకముందే
ఏ మలుపు మొదట్లోనో 

వదిలేసిన ఆశయాల్ని
మరో మజిలీగా 

మొదలుపెడుతున్నా.
ఏదొక మజిలీలో నీవు 
కనిపిస్తావేమోఅని వెర్రి ఆశ

నే వెళుతున్నా  ఆదారిలో 

నీవుంటావు కాని 
నన్ను చూసి కూడా
ఎవరొ తెలియనట్టు 

ఎప్పుడూ చూడనట్టు
నీ చుట్టు చేరిన 

ఈగల్లాంటి వాళ్ళ కోసం
కావాలని నన్ను దూరం చేశావు 

నీకిది న్యాయమా అంటూ
నిన్ను ఏదో అడగాలనుకుంటా
కానీ ఏమీ అడుగలేను 

అడిగే సమయం నాకివ్వవు
"ఒయ్" నేనెవరో నీకు తెలీదు కదూ
అయినా తెల్సుకోవాల్సిన అవసరం
గుర్తుంచుకోవాల్సిన సమయం నీకెక్కడిది లే కదా


ఎందుకో ఒకప్పుడు ఎక్కడ నీవు 
కనిపిస్తావోఅని ఆశగా ఎదురు చూసేవాడిని
కాని ఇప్పుడు ఎక్కడ కనిపిస్తావో .. 

ఎవరితో కనిపిస్తావో ...కనిపించి
నా మనస్సుపై ఎదురు దాడి చేస్తావో 

అని భయపడుతున్నా..
నేను ఎవ్వరో జాలిపడతారనో 
భాదపడటంలేదు
ఎవరో జాలి చూపాలని 

బాదపడటంలేదు
నటించడంలేదు ..

నిజం తెల్సుకో
అర్దం చేసుకోకపోయినా పర్లేదు.. 

అపార్దం చేసుకోకు నీఇష్టం నీది కాదనను