నాకు నేను ..నాలో నేను
క్షనాలను లెక్కేసుకొంటూ
గతాన్ని తవ్వుకొంటూ వంటరిగా
నిర్లిప్తంగా నిస్తేజంగా నన్ను
నేను తడుముకొంటాను
నిన్న జరిగిన
వాస్తవాన్ని కాదనలేక..
ఇప్పుడు జరుగుతున్న
నిజాన్ని ఒప్పుకోలేక
మొదలు ఎక్కడ పెట్టాలో
వెతుకుతూఉంటా
నాలో ఆలోచన నిలువునా
తగలబడుతున్న
ప్రతిసారి విఫలం అవుతున్న
ఓ ప్రయత్నం
ఎదురు చూసినా ప్రతిక్షనం
నన్ను వెక్కిరిస్తుంటే
ఏం లేకపోయినా ఏదో
ఉన్నట్టు ఊహించుకొని
ప్రశ్నలను పిడికిలిలోనే
బంధిస్తూ తిరుగుతుంటా
మౌనం గాయమై నన్ను వేదిస్తుంటే
నీ మాటలో నిజాయితీని
కోల్పోయిన క్షనాల్లో
నీ రాతిగుండెను కరిగించలేని
నాకు నేను రాలిపోతుంటా
నిశబ్దాలను చీల్చుకుని
వసంతపు శబ్ధం
నాలో జనిస్తుందని ఆశగా
కొన్ని సార్లు నాలో నేను
మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
ప్రతిపుట్టుకను చావు ఉన్నట్టే ..
నాలో నేను పుట్టి
అప్పటికప్పుడు
మరణిస్తూనే ఉన్నా జీవించలేక
ఇప్పుడు నేనో జీవచ్చవాన్ని...
కాదలేవు కదా మరి....?
క్షనాలను లెక్కేసుకొంటూ
గతాన్ని తవ్వుకొంటూ వంటరిగా
నిర్లిప్తంగా నిస్తేజంగా నన్ను
నేను తడుముకొంటాను
నిన్న జరిగిన
వాస్తవాన్ని కాదనలేక..
ఇప్పుడు జరుగుతున్న
నిజాన్ని ఒప్పుకోలేక
మొదలు ఎక్కడ పెట్టాలో
వెతుకుతూఉంటా
నాలో ఆలోచన నిలువునా
తగలబడుతున్న
ప్రతిసారి విఫలం అవుతున్న
ఓ ప్రయత్నం
ఎదురు చూసినా ప్రతిక్షనం
నన్ను వెక్కిరిస్తుంటే
ఏం లేకపోయినా ఏదో
ఉన్నట్టు ఊహించుకొని
ప్రశ్నలను పిడికిలిలోనే
బంధిస్తూ తిరుగుతుంటా
మౌనం గాయమై నన్ను వేదిస్తుంటే
నీ మాటలో నిజాయితీని
కోల్పోయిన క్షనాల్లో
నీ రాతిగుండెను కరిగించలేని
నాకు నేను రాలిపోతుంటా
నిశబ్దాలను చీల్చుకుని
వసంతపు శబ్ధం
నాలో జనిస్తుందని ఆశగా
కొన్ని సార్లు నాలో నేను
మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
ప్రతిపుట్టుకను చావు ఉన్నట్టే ..
నాలో నేను పుట్టి
అప్పటికప్పుడు
మరణిస్తూనే ఉన్నా జీవించలేక
ఇప్పుడు నేనో జీవచ్చవాన్ని...
కాదలేవు కదా మరి....?